Heroes As Villains 2024: హీరోలే విలన్స్.. 2024లో పవర్‌ఫుల్ విలనిజంతో భయపెట్టిన టాప్ 5 స్టార్ హీరోలు!-top 5 star heroes who played villain roles in 2024 year kamal haasan r madhavan arjun kapoor bobby deol jackie shroff ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Heroes As Villains 2024: హీరోలే విలన్స్.. 2024లో పవర్‌ఫుల్ విలనిజంతో భయపెట్టిన టాప్ 5 స్టార్ హీరోలు!

Heroes As Villains 2024: హీరోలే విలన్స్.. 2024లో పవర్‌ఫుల్ విలనిజంతో భయపెట్టిన టాప్ 5 స్టార్ హీరోలు!

Sanjiv Kumar HT Telugu
Dec 19, 2024 01:04 PM IST

Star Heroes Who Played Villain Roles In 2024: సినిమాల్లో విలన్ పాత్రలను స్టార్ హీరోలు కూడా చేస్తూ అలరిస్తున్నారు. అలా ఈ ఏడాది (2024) పవర్‌ఫుల్ విలన్ రోల్స్‌లో నటించి భయపెట్టిన టాప్ 5 స్టార్ హీరోలు ఎవరు, వారు నటించిన సినిమాలు ఏంటీ అనే విశేషాలను ఇక్కడ తెలుసుకుందాం.

2024లో పవర్‌ఫుల్ విలనిజంతో భయపెట్టిన టాప్ 5 స్టార్ హీరోలు!
2024లో పవర్‌ఫుల్ విలనిజంతో భయపెట్టిన టాప్ 5 స్టార్ హీరోలు!

Top 5 Villain Roles In 2024: సినిమాల్లో హీరోలకు ఎక్కువగా మంచి పేరు తీసుకొచ్చేది విలన్స్. ప్రతినాయకుడు ఎంత స్ట్రాంగ్‌గా ఉంటే హీరోకు అంత ఎలివినేషన్, హైప్ ఉంటుంది. అయితే, విలన్ రోల్స్‌లో స్టార్ హీరోలే నటిస్తే.. ఆ పాత్రలు మరింత పవర్‌పుల్‌గా ఉంటాయి. మరి ఈ ఏడాది (2024) పవర్‌ఫుల్ విలనిజంతో భయపెట్టిన టాప్ 5 స్టార్ హీరోలు, ఆ సినిమాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

ఆర్ మాధవన్- షైతాన్

బాలీవుడ్ బ్లాక్ బస్టర్ హారర్ థ్రిల్లర్ మూవీ షైతాన్‌లో తన విలనిజంతో భయపెట్టాడు స్టార్ హీరో ఆర్ మాధవన్. అజయ్ దేవగన్, జ్యోతిక హీరోహీరోయిన్స్‌గా నటించిన షైతాన్ సినిమాలో ఆర్ మాధవన్ వనరాజ్ కశ్యప్ పాత్రలో మాంత్రికుడిగా అదిరిపోయే నటన కనబర్చాడు. 2024లో వచ్చిన సినిమాల్లో వనరాజ్ కశ్యప్ పాత్రలో నటించిన మాధవన్ యాక్టింగ్‌ను ఎవరు అంత ఈజీగా మర్చిపోలేరు.

కమల్ హాసన్- కల్కి 2898 ఏడీ

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ కల్కి 2898 ఏడీ. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన కల్కి మూవీలో పవర్‌ఫుల్ సుప్రీమ్ యాస్కిన్ పాత్రలో లోకనాయకుడు కమల్ హాసన్ అదరగొట్టిన విషయం తెలిసిందే. కనిపించేది కొన్ని సీన్స్‌లో అయినప్పటికీ తన మార్క్ యూనిక్ యాక్టింగ్‌తో భయపెట్టాడు కమల్ హాసన్.

బాబీ డియోల్- కంగువా

తమిళ స్టార్ హీరో సూర్య నటించిన యాక్షన్ ఫాంటసీ మూవీ కంగువాలో మెయిన్ విలన్ ఉధిరన్ పాత్రలో నటించాడు బాలీవుడ్ అగ్ర కథానాయకుడు బాబీ డియోల్. హిందీలో ఒకప్పుడు స్టార్ హీరోగా వెలుగొందిన బాబీ డియోల్ ఆశ్రమ్ ఓటీటీ వెబ్ సిరీస్, యానిమల్ సినిమాతో ప్రతినాయకుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. కంగువాలో కూడా తన పర్ఫెక్ట్ విలనిజంతో అలరించాడు బాబీ డియోల్.

అర్జున్ కపూర్- సింగమ్ ఎగైన్

బాలీవుడ్ స్టార్ యాక్షన్ డైరెక్టర్ రోహిత్ శెట్టి తెరకెక్కించిన సింగం మూవీ ఫ్రాంచైజీ నుంచి వచ్చిన కొత్త సినిమానే సింగమ్ ఎగైన్. అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్, రణ్‌వీర్ సింగ్, టైగర్ ష్రాఫ్, దీపికా పదుకొణె, కరీనా కపూర్ వంటి స్టార్ హీరో హీరోయిన్స్ నటించిన సింగమ్ ఎగైన్‌లో వారికి పవర్‌ఫుల్ విలన్‌గా మరో యంగ్ హీరో అర్జున్ కపూర్ నటించాడు. స్టార్ హీరోలకు పోటీగా తన విలనిజంతో జుబేర్ హఫీజ్ పాత్రలో ఆకట్టుకున్నాడు.

జాకీ ష్రాఫ్- బేబీ జాన్

కీర్తి సురేష్, వరుణ్ ధావన్ హీరో హీరోయిన్స్‌గా నటించిన సినిమా బేబీ జాన్. తమిళ డైరెక్టర్ అట్లీ నిర్మించిన బేబీ జాన్ సినిమాలో పవర్‌ఫుల్ విలన్‌ బబ్బర్ షేర్ పాత్రలో జాకీ ష్రాఫ్ నటించాడు. అయితే, బేబీ జాన్ మూవీ డిసెంబర్ 25న రిలీజ్ కానుంది. ఇక డిఫరెంట్ పాత్రలతో ఆకట్టుకుంటున్న జాకీ ష్రాప్ సీనియర్ స్టార్ హీరోనే. 1980 కాలంలో పలు సినిమాల్లో హీరోగా చేసి స్టార్‌డమ్ సంపాదించుకున్నారు.

సునీల్ కుమార్- స్త్రీ 2

బాలీవుడ్‌లో 2024 సంవత్సరంలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హారర్ కామెడీ సినిమాగా రికార్డ్ కొట్టింది స్త్రీ 2. శ్రద్ధా కపూర్, రాజ్ కుమార్ రావు, పంకజ్ త్రిపాఠి మెయిన్ లీడ్ రోల్స్‌లో నటించిన స్త్రీ 2లో విలన్ పాత్ర సర్కాటగా సునీల్ కుమార్ నటించారు. 7.7 అడుగుల ఎత్తు ఉన్న సునీల్ కుమార్ ఒక రెజ్లర్. సునీల్ కుమార్ తప్పా మిగతా వారంతా విలన్స్‌గా మెప్పించిన స్టార్ హీరోలే.

Whats_app_banner