ETV Win OTT: అలాంటి కథలు చాలా అరుదు.. ఈటీవీ విన్ కంటెంట్ హెడ్ కామెంట్స్.. ఓవర్ థింకింగ్ కాన్సెప్ట్ చూపిస్తున్నాం అంటూ!-bigg boss shanmukh jaswanth anagha ajith leela vinodam ott streaming on etv win from today and content head comments ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Etv Win Ott: అలాంటి కథలు చాలా అరుదు.. ఈటీవీ విన్ కంటెంట్ హెడ్ కామెంట్స్.. ఓవర్ థింకింగ్ కాన్సెప్ట్ చూపిస్తున్నాం అంటూ!

ETV Win OTT: అలాంటి కథలు చాలా అరుదు.. ఈటీవీ విన్ కంటెంట్ హెడ్ కామెంట్స్.. ఓవర్ థింకింగ్ కాన్సెప్ట్ చూపిస్తున్నాం అంటూ!

Sanjiv Kumar HT Telugu
Dec 19, 2024 10:18 AM IST

ETV Win OTT Content Head About Leela Vinodam Story: బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్ జస్వంత్ హీరోగా నటించిన ఓటీటీ మూవీ లీలా వినోదం. ఈటీవీ విన్‌లో ఇవాళ్టి నుంచి లీలా వినోదం ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఇటీవల లీలా వినోదం మూవీ స్టోరీ, అది సెట్ అయిన విధానంపై ఈటీవీ విన్ ఓటీటీ కంటెంట్ హెడ్ కామెంట్స్ చేశారు.

అలాంటి కథలు చాలా అరుదు.. ఈటీవీ విన్ కంటెంట్ హెడ్ కామెంట్స్.. ఓవర్ థింకింగ్ కాన్సెప్ట్ చూపిస్తున్నాం అంటూ!
అలాంటి కథలు చాలా అరుదు.. ఈటీవీ విన్ కంటెంట్ హెడ్ కామెంట్స్.. ఓవర్ థింకింగ్ కాన్సెప్ట్ చూపిస్తున్నాం అంటూ!

ETV Win OTT Movie Leela Vinodam Story: ట్యాలెంటెడ్ యాక్టర్, బిగ్ బాస్ తెలుగు 5 సీజన్ రన్నరప్ షణ్ముఖ్‌ జస్వంత్‌ లీడ్ రోల్‌లో నటించిన ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్ మూవీ ‘లీలా వినోదం’. పవన్‌ సుంకర దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో అనఘా అజిత్‌, గోపరాజు రమణ, ఆమని, రూపాలక్ష్మి తదితరులు కీలక పాత్రలు పోషించారు.

తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్

శ్రీ అక్కియన్ ఆర్ట్స్ బ్యానర్‌పై శ్రీధర్ మారిసా ఈ సినిమాను నిర్మించారు. ఇప్పటికే విడుదలైన లీలా వినోదం టీజర్, ట్రైలర్ మంచి బజ్ క్రియేట్ చేశాయి. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఈటీవీ విన్‌లో ఇవాళ్టీ (డిసెంబర్ 19) నుంచి లీలా వినోదం ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సందర్భంగా ఇటీవల మేకర్స్ ప్రీరిలీజ్ ప్రెస్ మీట్‌ని నిర్వహించారు.

సింగిల్ సిట్టింగ్‌లో

ఈ ఈవెంట్‌లో ఈవిన్ ఓటీటీ కంటెంట్ హెడ్ నితిన్ చక్రవర్తి మాట్లాడుతూ.. "పవన్ ఈ కథ చెప్పిన వెంటనే సింగల్ సిట్టింగ్‌లో ఓకే అయింది. అలా సింగల్ సిట్టింగ్‌లో ఓకే అయిన కథలు చాలా అరుదు. తను చాలా ఫెంటాస్టిక్ రైటర్, డైరెక్టర్. ఇండస్ట్రీలో తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకుంటాడు. ఈ సినిమాలో నటించిన చాలామంది నా ఫ్రెండ్స్. షణ్ముఖ్‌ జస్వంత్‌ జెన్యూన్ పర్సన్. చాలా హార్డ్ వర్క్ చేస్తాడు. తను లేకుండా లీలా వినోదం అయ్యేది కాదు. డిసెంబర్ 19న ఈవిన్‌లో తప్పకుండా సినిమా చూడండి. మీ అందరికీ నచ్చుతుంది" అని తెలిపారు.

నా అనుభవాలతో

డైరెక్టర్ పవన్‌ సుంకర మాట్లాడుతూ.. "అందరికి నమస్కారం. ఈ జర్నీలో మా పేరెంట్స్ ఫ్రెండ్స్ చాలా సపోర్ట్ చేశారు, నా ఎక్స్‌పీరియన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా లీలా వినోదంలో చూస్తారు. శ్రీధర్ అన్నకి భరత్ అన్నకి థాంక్యూ సో మచ్. నన్ను నమ్మి ఈ ప్రాజెక్ట్‌ని ఇంత అద్భుతంగా చేశారు. ఉషా కిరణ్ మూవీస్‌లో డైరెక్టర్‌గా పరిచయం కావడం ఒక గొప్ప అదృష్టం" అని అన్నారు.

సర్‌ప్రైజ్ అవుతారు

"లీలా వినోదం మూవీలో ఓవర్ థింకింగ్ అనే కాన్సెప్ట్‌ని చూపిస్తున్నాం. కచ్చితంగా ఆడియన్స్ సర్‌ప్రైజ్ ఫీల్ అవుతారు. అందరూ రిలేట్ అవుతారు. చాలా మెమోరీస్‌ని గుర్తు చేస్తుంది. చాలా మంచి ఫీలింగ్ ఇచ్చేసి సినిమా ఇది. ఇందులో ఫ్రెండ్స్ క్యారెక్టర్ చేసిన యాక్టర్స్ అంతా అద్భుతంగా చేశారు. అనఘా అజిత్ చాలా చక్కగా నటించింది. షణ్ముఖ్ జస్వంత్ చాలా అద్భుతంగా నటించారు. నా కథకి పూర్తి న్యాయం చేశాడు. అందరికీ థాంక్యూ సో మచ్. ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది" అని డైరెక్టర్ పవన్ సుంకర తెలిపారు.

షణ్ముఖ్ సపోర్ట్ చేశారు

"అందరికి నమస్కారం. లీలా పాత్ర కోసం భరత్ గారు నన్ను సంప్రదించినప్పుడు చాలా ఆనందంగా అనిపించింది. దర్శక నిర్మాతలకు థాంక్యూ. షణ్ముఖ్‌ చాలా సపోర్ట్ చేశారు. టీంలో అందరికీ థాంక్యూ సో మచ్" అని లీలా వినోదం హీరోయిన్ అనఘా అజిత్ చెప్పుకొచ్చింది.

నటుడిగా మాట్లాడటం

"ఈ స్టేజ్ మీద ఒక యాక్టర్‌లా మాట్లాడడం ఆనందంగా ఉంది. భరత్ అన్నకి థాంక్యూ. డైరెక్టర్ పవన్ గారు నాకు చాలా వెయిట్ ఉన్న క్యారెక్టర్ ఇచ్చారు. షణ్ముఖ్‌ టెర్రిఫిక్ యాక్టర్. ఈ ఫ్లాట్ ఫామ్ ఇచ్చిన ఈటీవీ విన్ వారికి థాంక్యూ" అని మిర్చీ ఆర్జే శరన్ తెలిపాడు.

Whats_app_banner