ETV Win OTT: రామోజీరావు చనిపోయినప్పుడు వచ్చిన సక్సెస్ అది, చాలా సంతోషంగా ఉంది: ఈటీవీ విన్ ఓటీటీ కంటెంట్ హెడ్
ETV Win OTT Shashi Madhanam Ramoji Rao Death: ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు జూన్ 8న అనారోగ్య కారణంగా మరణించిన విషయం తెలిసిందే. రామోజీరావు చనిపోయినప్పుడు వచ్చిన సక్సెస్ ఇది అని ఈటీవీ విన్ ఓటీటీ కంటెంట్ హెడ్ నితిన్ అన్నారు.
ETV Win OTT Content Head About Ramoji Rao Death: మీడియా మొఘల్, ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత, నిర్మాత రామోజీరావు జూన్ 8న గుండె సంబంధిత సమస్య కారణంగా మరణించిన విషయం తెలిసిందే. చికిత్స పొందుతూ రామోజీరావు చివరి శ్వాస విడవడంతో సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది.
అయితే, రామోజీరావు ఈటీవీ, ఈటీవీ న్యూస్, ఈటీవీ ప్లస్ వంటి ఇతర ఛానెళ్లతో పాటు ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ను కూడా తీసుకొచ్చారు. అచ్చ తెలుగు కంటెంట్‌ను మాత్రమే అందించే ఈటీవీ విన్ ఓటీటీలో ఇటీవల శశిమథనం అనే రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్ రిలీజ్ అయింది. జూలై 4 నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న శశిమథనం వెబ్ సిరీస్ టాప్ 1 స్థానంలో ట్రెండింగ్‌లో ఉంది.
ఈ సందర్భంగా తాజాగా శశిమథనం సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వెబ్ సిరీస్ యూనిట్‌తోపాటు ఈటీవీ విన్ కంటెంట్ హెడ్ నితిన్ ఇతరులు ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు. "శశిమథనం సక్సెస్ చాలా ఆనందాన్ని ఇచ్చింది. గత నెలలో రామోజీరావు గారు స్వర్గస్తులైనప్పుడు, మేము అంతా దిగులుగా ఉన్నప్పుడు మాకొచ్చిన సక్సెస్ శశిమథనం" అని ఈటీవీ విన్ ఓటీటీ కంటెంట్ హెడ్ నితిన్ తెలిపారు.
"వుయ్ ఆర్ వెరీ వెరీ హ్యాపీ. శశిమథనం మంచి ఎంగేజింగ్ కంటెంట్ అని నమ్మాం. మా నమ్మకం నిజమైయింది. సబ్ స్క్రిప్షన్స్ వస్తున్నాయి. మేము పెట్టిన ఇన్వెస్ట్మెంట్ తొలి నెలలోనే రికవరీ అయింది. సీజన్ 2 వర్క్ కూడా స్టార్ట్ అయింది. బాపనీడు గారికి, ఈటీవీ మేనెజ్‌మెంట్‌కి థాంక్ యూ. ఈటీవీ విన్ నుంచి చాలా అద్భుతమైన కంటెంట్ రాబోతోంది. శశిమథనం టీం అందరికీ పేరు పేరునా థాంక్స్" అని నితిన్ చెప్పారు.
ఇక శశిమథనం డైరెక్టర్ వినోద్ గాలి మాట్లాడుతూ.. "మా డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ అంతా చాలా హార్డ్ వర్క్ చేశారు. మా నిర్మాత హరీష్ గారికి థాంక్స్. మొదటి నుంచి బలంగా నమ్మారు. నితిన్, సాయి అన్న థాంక్స్. మ్యూజిక్, డీవోపీ, ప్రొడక్షన్ డిజైనర్ ఇలా అందరూ అద్భుతంగా పని చేశారు. నటీనటులంతా చాలా సపోర్ట్ చేశారు. సిద్దు సోనియా చాలా కోపరేట్ చేశారు. ఈటీవీ విన్, అందరికీ థాంక్స్. ఈ సక్సెస్‌ని రామోజీ రావు గారికి అంకితం ఇస్తున్నాం" అని అన్నారు.
"శశిమథనం ఫ్యామిలీ అంతా కూర్చుని చూసే ఎంటర్‌టైనర్. ఈ అవకాశం ఇచ్చిన ఈటీవీ విన్ వారికి థాంక్స్. చాలా అద్భుతమైన టీంతో కలసి చాలా మంచి ఎంటర్‌టైనర్‌ని ఇచ్చాం. ఈ రోజు సక్సెస్ సెలబ్రేషన్ జరుపుకోవడం ఆనందంగా ఉంది" అని నిర్మాత హరీష్ కోహిర్కర్ తెలిపారు.
"ఈ సిరిస్‌కి పని చేసిన అందరికీ పేరు పేరునా థాంక్స్. సోనియా సింగ్, పవన్ సిద్ధూ చాలా సపోర్ట్ చేశారు. టీం అందరి సపోర్ట్ వలన ఈ ప్రాజెక్ట్ ఇంత అద్భుత విజయం సాధించింది" అని శశిమథనం నిర్మాత హరీష్ కోహిర్కర్ అన్నారు. కాగా, ఈ శశిమథనం వెబ్ సిరీస్ సక్సెస్ మీట్‌లో టీం అంతా పాల్గొని చాలా గ్రాండ్‌గా వేడుకను నిర్వహించారు.