LIVE UPDATES
Andhra Pradesh News Live December 19, 2024: Tirumala Vision 2047 : 'తిరుమల విజన్-2047’ - ప్రతిపాదనలు ఆహ్వానించిన టీటీడీ, లక్ష్యాలివే
ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Thu, 19 Dec 202403:06 PM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: Tirumala Vision 2047 : 'తిరుమల విజన్-2047’ - ప్రతిపాదనలు ఆహ్వానించిన టీటీడీ, లక్ష్యాలివే
- TTD Tirumala Vision-2047 : తిరుమల విజన్-2047 కోసం టీటీడీ ప్రతిపాదనలు ఆహ్వానించింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. “స్వర్ణాంధ్ర విజన్ – 2047″కి అనుగుణంగా తిరుమలలో కూడా ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి కోసం లక్ష్యాలను నిర్ణయించారు.
Thu, 19 Dec 202402:05 PM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Cabinet Decisions : ఏపీ కేబినెట్ భేటీ - కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర, వివరాలివే
- ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అమరావతి నిర్మాణం కోసం ప్రతిపాదించిన అంశాలకు ఆమోదముద్ర పడింది. పోలవరం ఎడమ కాల్వ రీటెండర్‌కు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Thu, 19 Dec 202401:06 PM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: YS Jagan : ఎవరూ భయపడొద్దు.. మనకూ టైమ్ వస్తుంది, పోరాటానికి సిద్ధం కండి - వైఎస్ జగన్
- చంద్రబాబు పాలనలో ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని వైసీపీ అధినేత జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని… స్కామ్‌ల మీద స్కామ్‌లు జరుగుతున్నాయని ఆరోపించారు. వైసీపీ కార్యకర్తలెవరూ భయపడొద్దని, పోరుబాటకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
Thu, 19 Dec 202410:59 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: Kurnool Crime : కర్నూలు జిల్లాలో ప్రేమ జంటపై కత్తులతో దాడి.. వెలుగులోకి విస్తుపోయే నిజాలు!
- Kurnool Crime : కర్నూలు జిల్లాలో ప్రేమ జంటపై కత్తులతో దాడి ఘటనలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ప్రియురాలే ఈ దాడి చేయించింది. ఆమెకు ఇద్దరు లవర్స్ ఉన్నారు. దీంతో మొదటి ప్రేమికుడిని అడ్డుతొలగించుకునేందుకే.. పథకం ప్రకారం ప్రియురాలే దాడి చేయించింది.
Thu, 19 Dec 202410:42 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: Vizag Student Died in Canada : కెనడాలో విశాఖ జిల్లా యువకుడు మృతి - తీవ్ర ఆందోళనలో తల్లిదండ్రులు
- కెనడాలో విశాఖపట్నం జిల్లాకు చెందిన యువకుడు మృతి చెందాడు. ఎమ్మెస్సీ చేసేందుకు వెళ్లిన యువకుడు మృతి చెందడంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో ఉన్నారు. మృతి చెంది వారం రోజులవుతున్నప్పటికీ మృతదేహం స్వగ్రామానికి చేరుకోలేదు. దీంతో తల్లిదండ్రులు ఆందోళనలో ఉన్నారు.
Thu, 19 Dec 202409:36 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: TTD Calendar 2025 : ఆన్‌లైన్ ద్వారా భక్తులకు టీటీడీ డైరీలు, క్యాలెండర్లు.. ఇలా బుక్ చేసుకోండి
- TTD Calendar 2025 : భక్తుల సౌకర్యార్థం టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. 2025 సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్లు, డైరీలను ఆన్‌లైన్‌లో విక్రయిస్తోంది. ఎంపిక చేసిన ప్రాంతాలలో ఆఫ్‌లైన్‌లోనూ అందుబాటులో ఉండనున్నాయి. టీటీడీ వెబ్ సైట్ ద్వారా భక్తులు బుక్ చేసుకోవచ్చు.
Thu, 19 Dec 202408:25 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Eggs Scam : గుడ్డు పోయింది.. అంగన్‌వాడీ గుడ్లు అంగట్లోకి.. తెరపైకి కొత్త దందా!
- AP Eggs Scam : కోడిగుడ్ల ధరలు బాగా పెరిగాయి. ఇలాంటి సమయంలోనే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలని భావిస్తున్న కొందరు.. కొత్త దందాకు తెరలేపారు. ఫలితంగా చిన్నారులకు అందాల్సిన గుడ్లు.. డబ్బుల రూపంలో అక్రమార్కుల జేబుల్లోకి వెళ్తున్నాయి. ఈ వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
Thu, 19 Dec 202406:09 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: APSRTC : సప్త శ్రీనివాస, పంచ వైష్ణవ క్షేత్రాల దర్శనానికి ప్రత్యేక బస్సులు.. ప్యాకేజీ వివరాలు ఇవే!
- APSRTC : పుణ్యక్షేత్రాల యాత్ర చేసే భక్తులకు ఆర్టీసీ శుభవార్త చెప్పింది. సప్త శ్రీనివాస దర్శన భాగ్యం, పంచ వైష్ణవ క్షేత్ర దర్శనం, త్రిముఖ వైష్ణ దర్శన భాగ్యం పేరుతో పుణ్యక్షేత్రాలకు స్పెషల్ సర్వీసులను నడిపిస్తోంది. మచిలీపట్నం నుంచి స్పెషల్ సర్వీస్‌లు అందుబాటులో ఉండనున్నాయి.
Thu, 19 Dec 202405:03 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: Dummy Pistol Robbery: బొమ్మ తుపాకీతో బెదిరించి కాకినాడలో బంగారం దోపిడీ.. చివరకు ఏమైందంటే…
- Dummy Pistol Robbery: బంగారు ఆభరణాల షోరూమ్‌లో నగలు కొంటున్నట్టు నటిస్తూ ఉన్నట్టుండి బొమ్మ తుపాకీతో సేల్స్ బాయ్‌ను బెదిరించి పరారైన ఘటన కాకినాడలో బుధవారం రాత్రి జరిగింది. చేతికి అందిన ఆభరణాలతో ఊడాయించిన నిందితుడు కొద్ది దూరంలోనే కానిస్టేబుల్‌కు దొరికిపోయాడు.
Thu, 19 Dec 202404:28 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: Bad Teacher: ప్రకాశం జిల్లాలో ఘోరం, మాయ మాటలు చెప్పి బాలికను అత్యాచారం చేసిన ఉపాధ్యాయుడు... ఆపై వేధింపులు
- Bad Teacher ప్రకాశం జిల్లాలో ఘోరమైన సంఘటన చోటు చేసుకుంది. మాయమాటలు చెప్పి బాలికపై ఒక కీచక ఉపాధ్యాయుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆపై వేధింపులకు పాల్పడ్డాడు. నాలుగేళ్ల నుంచి జరుగుతున్న వేధింపుల ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Thu, 19 Dec 202403:58 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: Vijayawada Struggles: విజయవాడలో చావంటే, బంధువులకు చావుకు మించిన కష్టం.. దేవాలయాల్లో నిద్ర అంటే నరకమే…
- Vijayawada Struggles: విజయవాడలో ఎవరైనా మరణిస్తే వారి బంధువులకు కూడా చచ్చేంత కష్టాలు తప్పడం లేదు. మరణించిన వారి కర్మకాండలు పూర్తి చేసిన తర్వాత ఆలయాల్లో నిద్రించడం కూడా కష్టమైపోతోంది. దేవాదాయ శాఖ తీరుతో కర్మకాండలు పూర్తి చేసిన తర్వాత ఆలయాల్లో నిద్రించే ఆనవాయితీని పాటించడం కూడా సవాలుగా మారుతోంది.