TG EDCET 2025 : 23 ఏళ్ల తర్వాత కేయూకు ఎడ్‌సెట్ నిర్వహణ బాధ్యతలు.. కారణం ఏంటో తెలుసా?-after 23 years kakatiya university takes over the responsibility of managing edcet 2025 ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  Tg Edcet 2025 : 23 ఏళ్ల తర్వాత కేయూకు ఎడ్‌సెట్ నిర్వహణ బాధ్యతలు.. కారణం ఏంటో తెలుసా?

TG EDCET 2025 : 23 ఏళ్ల తర్వాత కేయూకు ఎడ్‌సెట్ నిర్వహణ బాధ్యతలు.. కారణం ఏంటో తెలుసా?

Basani Shiva Kumar HT Telugu
Dec 19, 2024 11:16 AM IST

TG EDCET 2025 : తెలంగాణ ఉన్నత విద్యా మండలి కీలక నిర్ణయం తీసుకుంది. 2025 విద్యా సంవత్సరానికి సంబంధించి ఉమ్మడి ప్రవేశ పరీక్షల బాధ్యతలను వివిధ యూనివర్సిటీలకు అప్పగించింది. కన్వీనర్లను నియమించింది. కౌన్సిల్ మార్పులు చేసింది. దీంతో 23 ఏళ్ల తర్వాత కేయూకు ఎడ్‌సెట్ బాధ్యతలు దక్కాయి.

23 ఏళ్ల తర్వాత కేయూకు ఎడ్‌సెట్ నిర్వహణ బాధ్యతలు
23 ఏళ్ల తర్వాత కేయూకు ఎడ్‌సెట్ నిర్వహణ బాధ్యతలు

కాకతీయ యూనివర్సిటీకి దాదాపు 23 ఏళ్ల తర్వాత ఎడ్‌సెట్ నిర్వహణ బాధ్యతలు మళ్లీ అందాయి. రాష్ట్ర స్థాయి ప్రవేశ పరీక్షల నిర్వహణను వివిధ యూనివర్సిటీలకు కేటాయిస్తూ.. తెలంగాణ ఉన్నత విద్యా మండలి తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో 1997, 98, 99, 2001, 2002 సంవత్సరాల్లో ఐదుసార్లు కాకతీయ యూనివర్సిటీ విద్యా విభాగం ప్రొఫెసర్ గంటా రమేష్.. ఎడ్‌సెట్ కన్వీనర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు.

తాజాగా కేయూ ఫిజిక్స్ డిపార్ట్‌మెంట్ ప్రొఫెసర్ వెంకట్రామిరెడ్డిని ఎడ్‌సెట్ కన్వినర్‌గా నియమించారు. కాకతీయ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్‌లో రెగ్యులర్ అధ్యాపకులు లేరు. ఒకరు ఒప్పంద, ఏడుగులు గెస్ట్, ముగ్గురు తాత్కాలిక అధ్యాపకులు మాత్రమే ఉన్నారు. దీంతో ఎడ్‌సెట్ నిర్వహణ బాధ్యతను సీనియర్ ప్రొఫెసర్ వెంకట్రామి రెడ్డికి అప్పగించారు.

అపార అనుభవం..

ప్రొఫెసర్ వెంట్రామి రెడ్డికి మూడున్నర దశాబ్దాల బోధన అనుభవం ఉంది. ఆయన గతంలో రిజిస్ట్రార్‌గా, పరీక్షల నియంత్రణ అధికారిగా, హాస్టల్ సంచాలకుడిగా, సైన్స్ డిపార్ట్‌మెంట్ డీన్‌గా పాఠ్య ప్రణాళిక అధ్యక్షుడిగా, పీజీ కాలేజీ ప్రిన్సిపల్‌గా పనిచేశారు. దీంతో వెంకట్రామి రెడ్డిని కన్వీనర్‌గా నియమించినట్టు తెలిసింది.

ఐసెట్ నిర్వహణ తొలగింపు..

గత 13 ఏళ్లుగా ఐసెట్ నిర్వహణ బాధ్యతలను కాకతీయ యూనివర్సిటీ నిర్వహిస్తోంది. కానీ.. గతేదాడి నిధుల దుర్వినియోగం ఆరోపణలు వచ్చాయి. దీంతో తెలంగాణ ఉన్నత విద్యా మండలి కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది ఐసెట్ నిర్వహణ బాధ్యతలను కేయూకు ఇవ్వలేదు. మహాత్మా గాంధీ విశ్వ విద్యాలయానికి అప్పగించింది. ఈ నేపథ్యంలో.. ఎడ్‌సెట్ నిర్వహణ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని వర్సిటీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

ఎడ్‌సెట్‌కు తెలంగాణలో డిమాండ్ ఉంటుంది. ఈ పరీక్షకు భారీ సంఖ్యలో దరఖాస్తు చేసుకుంటారు. బీఈడీ కోర్సులకు అర్హత సాధించిన అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేయడంలో ఈ పరీక్ష కీలక పాత్ర పోషిస్తుంది. తెలంగాణలోని ప్రభుత్వ బీఈడీ కళాశాలల్లో డీఈడీ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి ఇది ఒక గేట్‌వేగా పనిచేస్తుంది. బోధనా యోగ్యత, సాధారణ జ్ఞానం, విషయ నైపుణ్యం వంటి అంశాలపై పరీక్ష నిర్వహిస్తారు.

Whats_app_banner