NCERT deletes Gandhiji topic: పాఠ్య పుస్తకాల నుంచి మహాత్మా గాంధీ టాపిక్స్ డిలీట్
NCERT deletes Gandhiji topics: 12వ తరగతి పొలిటికల్ సైన్స్ పాఠ్య పుస్తకం నుంచి మహాత్మా గాంధీ (Mahatma Gandhi) కి సంబంధించిన అంశాలను తొలగించడం వివాదాస్పదంగా మారింది.
NCERT deletes Gandhiji topic: 12వ తరగతి పొలిటికల్ సైన్స్ పాఠ్య పుస్తకం నుంచి మహాత్మా గాంధీ (Mahatma Gandhi) కి సంబంధించిన అంశాలను తొలగించడం వివాదాస్పదంగా మారింది. చరిత్రను తమకు అనుగుణంగా మార్చుకుంటున్నారని విపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి.
NCERT deletes Gandhiji topic: చరిత్ర పాఠ్యాంశాల నుంచి..
కొత్తగా రూపొందించిన 12వ తరగతి పాఠ్య పుస్తకాల నుంచి గతంలో ఉన్న కొన్ని పాఠ్యాంశాలను ఎన్సీఈఆర్టీ (National Council of Educational Research and Training NCERT) తొలగించింది. ముఖ్యంగా రాజనీతి శాస్త్రం (political science) సబ్జెక్టులో నుంచి మహాత్మాగాంధీ (Mahatma Gandhi) కి సంబంధించిన కీలక అంశాలను తొలగించింది. హిందూ, ముస్లిం ఐక్యత కోసం గాంధీజీ (Gandhiji) పరితపించడం, ఆ కారణంగా హిందూ అతివాదులు మహాత్మాగాంధీని ద్వేషించడం, గాంధీ హత్య అనంతరం ఆరెస్సెస్ (RSS) పై నిషేధం విధించడం.. మొదలైన అంశాలను NCERT తొలగించింది. 12వ తరగతి రాజనీతి శాస్త్రం పాఠ్య పుస్తకంలోని ‘‘స్వాతంత్య్రం తరువాత భారతదేశంలో రాజకీయాలు (Politics in India since Independence)’’ అనే చాప్టర్ నుంచి ఈ అంశాలను తొలగించింది. ‘మహాత్మా గాంధీ త్యాగం’ (Mahatma Gandhi’s sacrifice) అనే సబ్ టాపిక్ ను NCERT పూర్తిగా డిలీట్ చేసింది.
NCERT deletes Ban on RSS topic: గాంధీజీ హత్య, ఆరెస్సెస్ పై నిషేధం..
‘‘హిందూ ముస్లింల ఐక్యత కోసం గాంధీజీ (Gandhiji) కృషి చేయడం హిందూ అతివాదులకు నచ్చలేదు. వారు గాంధీజీ ముస్లింలకు, పాకిస్తాన్ కు అనుకూలంగా ఉన్నట్లు భావించారు. పాకిస్తాన్ ను ముస్లిం దేశంగా ప్రకటించినట్లుగా, భారతదేశాన్ని కూడా హిందూ దేశంగా ప్రకటించాలని వారు ఆశించారు. అందుకు గాంధీజీ (Gandhiji) అడ్డుగా ఉన్నట్లు భావించారు. అందుకే ఆయనను హతమార్చడానికి పలుమార్లు ప్రయత్నించారు’’ అని ‘మహాత్మా గాంధీ త్యాగం’ (Mahatma Gandhi’s sacrifice) అనే చాప్టర్ లోని ఒక పేరాగ్రాఫ్ లో ఉంది. ఆ పేరాగ్రాఫ్ ను పూర్తిగా తొలగించారు. గాంధీజీ హత్య అనంతరం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (Rashtriya Swayamsewak Sangh) ను నిషేధించిన ప్రస్తావనను కూడా సిలబస్ నుంచి తొలగించారు. దేశ విభజనకు సంబంధించిన హింస, ఆగ్రహావేశాలు కొంత తగ్గాయి. మత విద్వేషాన్ని ప్రచారం చేస్తున్న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (Rashtriya Swayamsewak Sangh) సంస్థలపై కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. వాటిపై నిషేధం విధించింది. దాంతో, కొంతవరకు మత రాజకీయాల ప్రభావం తగ్గింది’’ అని ఉన్న పేరాను కూడా ఎన్సీఈఆర్టీ (NCERT) తొలగించింది.
(Nathuram Godse topics deleted: గాడ్సే ప్రస్తావన కూడా డిలీట్
12వ తరగతి చరిత్ర పుస్తకంలోని థీమ్స్ ఇన్ ఇండియన్ హిస్టరీ 3 (Themes in Indian History-3) లో గాంధీజీ (Gandhiji) హత్యకు సంబంధించిన ఒక పేరాగ్రాఫ్ లో కూడా NCERT మార్పులు చేసింది. ‘‘గాంధీజీ ని 1948 జనవరి 30న హత్య చేసింది నాథూరాం గాడ్సే (Nathuram Godse)’’ అని కొత్తగా ముద్రించిన పాఠ్య పుస్తకంలో ఒకే వ్యాక్యంలో తేల్చేశారు. గతంలో చెలామణిలో ఉన్న పాఠ్య పుస్తకాల్లో ‘‘ జనవరి 30 ప్రార్థనల అనంతరం గాంధీజీని (Gandhiji) పుణె కు చెందిన బ్రాహ్మణుడైన నాథూరాం గాడ్సే (Nathuram Godse) తుపాకీతో కాల్పులు జరిపి హత్య చేశాడు. నాథూరాం గాడ్సే (Nathuram Godse) ఒక హిందూ అతివాద పత్రికకు ఎడిటర్. గాంధీజీని ముస్లింల మద్దతుదారుగా ఇతడు గతంలో ప్రకటించాడు’’ అని ఉంది. గత సంవత్సరం NCERT చేపట్టిన 30% సిలబస్ రేషనలైజేషన్ కు అదనంగా, ఇప్పుడు ఈ తొలగింపులను చేపట్టడం గమనార్హం. ఈ తొలగింపుల అనంతరం ముద్రించిన పాఠ్య పుస్తకాలు 2023 - 24 విద్యా సంవత్సరంలో విద్యార్థులకు అందుబాటులోకి వస్తాయి.
టాపిక్