Winter School Holidays : ఇక్కడ ఈ తేదీల్లో స్కూళ్లకు శీతాకాల సెలవులు.. లిస్ట్ చూసేయండి!
Winter School Holidays 2024-25 : డిసెంబర్ నెల ప్రారంభమయ్యే కొద్దీ ఉత్తర భారతదేశంలోని రాష్ట్రాల్లో చలి పెరుగుతుంది. పిల్లలు ఉదయం పాఠశాలకు వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడతారు. చాలా రాష్ట్రాల్లో శీతాకాల సెలవులు ఉంటాయి.
డిసెంబర్ నెలలో చలి విపరీతంగా ఉంటంది. దీంతో పిల్లలు పాఠశాలకు వెళ్లడానికి ఇబ్బందిపడతారు. ఉత్తర భారత రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరిగి పిల్లలు ఉదయం పూట పాఠశాలకు వెళ్లడానికి కష్టంగా ఉంటుంది. ముఖ్యంగా చిన్నపిల్లలు ఇంటి నుంచి బయటకు రావడం ఇబ్బందే. చాలా పాఠశాలలకు శీతాకాల సెలవులు డిసెంబర్ 25 నుండి ప్రారంభమవుతాయి. అనేక రాష్ట్రాల్లో శీతాకాల సెలవులకు షెడ్యూల్ విడుదల చేశారు. వాతావరణ పరిస్థితులపై ఆధారపడి, పాఠశాల శీతాకాల సెలవుల తేదీలు మారవచ్చు. శీతాకాలపు సెలవులు కాకుండా డిసెంబర్ 25న అన్ని పాఠశాలలు, కళాశాలలు మూసివేస్తారు.
2024-25 విద్యా సంవత్సరానికి ఢిల్లీ ప్రభుత్వం శీతాకాల సెలవులను ప్రకటించింది. ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలకు శీతాకాల సెలవులు 2025 జనవరి 1 నుండి జనవరి 15 వరకు ఉంటాయి. ఎక్కువగా ఉత్తర ప్రదేశ్‌ని పాఠశాలలు డిసెంబర్ చివరి వారంలో శీతాకాల సెలవులను ప్రారంభిస్తాయి. ఇది జనవరి మొదటి వారం వరకు ఉంటుంది. 2024-25 విద్యా సంవత్సరానికి యూపీలో శీతాకాల సెలవులు డిసెంబర్ 25న ప్రారంభమై 2025 జనవరి 5 వరకు ఉంటాయని భావిస్తున్నారు.
పంజాబ్‌లోని పాఠశాలలకు శీతాకాల సెలవులు కూడా ప్రకటించారు. పంజాబ్‌లోని అన్ని పాఠశాలలు 2024 డిసెంబర్ 24 నుండి 2024 డిసెంబర్ 31 వరకు మూసివేస్తారు. వాతావరణ పరిస్థితులను బట్టి సెలవులను కూడా పొడిగించుకోవచ్చు. హర్యానా ప్రభుత్వం కూడా త్వరలో శీతాకాల సెలవులను ప్రకటించే అవకాశం ఉంది. గత ఏడాది హర్యానాలో శీతాకాల సెలవులు జనవరి 1 నుంచి జనవరి 15 వరకు జరిగాయి. దాదాపు ఇవే తేదీలు ఉండనున్నాయి.
రాజస్థాన్‌లోని అన్ని పాఠశాలలకు శీతాకాల సెలవులు 25 డిసెంబర్ 2024 నుండి 5 జనవరి 2025 వరకు ఉంటాయి. 2024 డిసెంబర్ 25 నుంచి 31 వరకు శీతాకాల సెలవుల్లో బీహార్లోని అన్ని పాఠశాలలు మూసివేస్తారు.
జమ్మూ కాశ్మీర్‌లో పెరుగుతున్న చలి, హిమపాతం కారణంగా అన్ని పాఠశాలలను మూసివేస్తున్నట్లు ప్రకటించారు. 2024 డిసెంబర్ 10 నుంచి 2025 ఫిబ్రవరి 28 వరకు జమ్మూకశ్మీర్లో 1-5 తరగతులకు పాఠశాలలు మూసివేస్తారు. 2024 డిసెంబర్ 16 నుంచి 2025 ఫిబ్రవరి 28 వరకు 6 నుంచి 12వ తరగతి వరకు స్కూళ్లను మూసివేయనున్నారు.
విద్యార్థులు, తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు పాఠశాల అధికారులను సంప్రదించి అప్డేట్స్ లేదా సెలవుల షెడ్యూల్‌లో ఏవైనా మార్పుల కోసం సంప్రదించాలని సూచించారు. వాతావరణ పరిస్థితుల ఆధారంగా సెలవుల్లో మార్పులు ఉండే అవకాశం ఉంది.