మానవుల ఆరోగ్యం భగవంతుడు నిర్దేశించిన ఆహారపదార్ధాల జాబితాలో దానిమ్మకు తొలి స్థానం కొన్ని మత విశ్వాసాల్లో పరిగణిస్తారు.
By Bolleddu Sarath Chandra Dec 19, 2024
Hindustan Times Telugu
దానిమ్మలో ఉండే పోషకపదార్ధాలలో కార్బో హైడ్రేట్స్, ప్రొటీన్స్, కొవ్వు పదార్ధాలు, ఫైబర్, పొటాషియం, ఫాస్పరస్, మాంగనీస్, ఫ్రూట్ షుగర్ పుష్కలంగా ఉంటాయి.
దానిమ్మలో విటమిన్ బి6, సి,ఈ, కె, ఫోలేట్ ఉంటాయి. పోషకపదార్దాలు పుష్కలంగా ఉన్న దానిమ్మను ఆహార నిపుణులు ప్రతిక్షారినిగా గుర్తించారు.
దానిమ్మ పండును తినడం వల్ల అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, కణాల వాపును నిరోధించవచ్చు.
దానిమ్మ శరీరంలో అధికంగా ఉండే చక్కెర శాతాన్ని నియంత్రించడంలో ఉపయోగపడుతుంది.
దానిమ్మను ఆహారంలో తీసుకోవడం ద్వారా సంతాన సాఫల్యంతో పాటు వివిధ రకాల క్యాన్సర్లను నిరోధించడంలో ఉపయోగపడుతుంది.
రక్త ప్రసారం లేకపోవడం వల్ల పురుషులలో స్తంభన సమస్యలకు దానిమ్మ చక్కగా పనిచేస్తుంది.
అంగస్తంభన లేకపోవడం వల్ల లైంగిక పటుత్వం లోపిస్తుంది. ఇలాంటి వారు నిత్యం దానిమ్మ రసం సేవిస్తే అంగ స్తంభన సమస్యను అధిగమించవచ్చు.
దానిమ్మ పండును సహజమైన వయాగ్రా ఫుడ్‌గా పరిగణిస్తారు. ఇంగ్లాండ్ రాజైన హెన్రీ VIII భార్య కేధరిన్ ఆఫ్ ఆరగాన్ మగసంతానంకోసం దానిమ్మ పండ్లను తీసుకున్నట్టు చరిత్రలో నమోదైంది.
దానిమ్మ రసం నిత్యం సేవించే వారి లాలాజలంలో టెస్టోస్టెరాన్ హార్మను పరిణామం 20శాతం పెరిగినట్టు వైద్య పరిశోధనల్లో గుర్తించారు.
వయసు పైబడిన వారిలో వచ్చే చేతులు, కాళ్లలో కీళ్ల నొప్పుల్ని దానిమ్మలోని ప్రతిక్షారినులైన ఫ్లేవనాల్స్ కీళ్ల వాపుల్ని తగ్గిస్తాయి.
కీళ్లలో కొలెజాన్ తగ్గడం వల్ల వచ్చే ఆర్థరైటిస్ సమస్యల్ని దానిమ్మ రసం గణనీయంగా తగ్గిస్తుంది.
దానిమ్మ గింజల రసం క్యాన్సర్ కణాలపై సమర్థవంతంగా పనిచేస్తుంది.