AP EAPCET BiPC: నేటి నుంచి ఏపీ ఈఏపీసెట్ బైపీసీ తుది విడత అడ్మిషన్లు.. నేడు, రేపు మాత్రమే రిజిస్ట్రేషన్ ఛాన్స్‌-ap eapcet bipc final phase admissions from today registration chance only today and tomorrow ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  Ap Eapcet Bipc: నేటి నుంచి ఏపీ ఈఏపీసెట్ బైపీసీ తుది విడత అడ్మిషన్లు.. నేడు, రేపు మాత్రమే రిజిస్ట్రేషన్ ఛాన్స్‌

AP EAPCET BiPC: నేటి నుంచి ఏపీ ఈఏపీసెట్ బైపీసీ తుది విడత అడ్మిషన్లు.. నేడు, రేపు మాత్రమే రిజిస్ట్రేషన్ ఛాన్స్‌

Bolleddu Sarath Chandra HT Telugu
Dec 19, 2024 11:46 AM IST

AP EAPCET BiPC: ఏపీ ఈఏపీ సెట్‌ 2024లో భాగంగా బైపీసీ స్ట్రీమ్‌ విద్యార్ధులకు తది విడత వెబ్‌ కౌన్సిలింగ్‌ నేటి నుంచి ప్రారంభం కానుంది. బీఫార్మసీ, ఫార్మా డీ , ఫుడ్ టెక్నాలజీ, ఫుడ్‌ ఇంజనీరింగ్‌, అగ్రికల్చరల్, ఫార్మాస్యూటికల్ ఇంజనీరింగ్, బయో టెక్నాలజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది.

నేటి నుంచి ఏపీ ఈఏసీ సెట్‌ తుది విడత బైపీసీ  అడ్మిషన్ కౌన్సిలింగ్
నేటి నుంచి ఏపీ ఈఏసీ సెట్‌ తుది విడత బైపీసీ అడ్మిషన్ కౌన్సిలింగ్

AP EAPCET BiPC: ఏపీ ఈఏపీ సెట్‌ 2024 బైపీసీ స్ట్రీమ్ తుది విడత కౌన్సిలింగ్‌ నేటి నుంచి జరుగుతోంది. ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఈఏపీ సెట్‌ 2024లో బైపీసీ స్ట్రీమ్‌ విద్యార్థుల కోసం ఫార్మసీ, బయో టెక్నాలజీ కోర్సుల్లో తుది విడత ప్రవేశాల నోటిఫికేషన్‌ విడుదలైంది.

బీఫార్మసీ, ఫార్మా డీ , బయో టెక్నాలజీ, ఫార్మాస్యూటికల్ ఇంజనీరింగ్, ఫుడ్‌ టెక్నాలజీ, ఫుడ్‌ ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్ ఇంజనీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం ప్రాసెసింగ్ ఫీ చెల్లింపు, స్లాట్ బుకింగ్, సర్టిఫికెట్ వెరిఫికేషన్‌, వెబ్ ఆప్షన్ల నమోదుకు షెడ్యూల్ విడుదలైంది.

ఏపీ ఈఏపీ సెట్‌ వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్‌ విడుదల చేశారు. పూర్తి నోటిఫికేషన్‌ కోసం లింకును అనుసరించండి..

B. ఫార్మసీ, ఫార్మా D, ఫార్మాస్యూటికల్ ఇంజనీరింగ్, ఫుడ్‌టెక్నాలజీ, ఫుడ్‌ ఇంజనీరింగ్, బయో టెక్నాలజీ, బయో-మెడికల్ ఇంజనీరింగ్, బయో-టెక్నాలజీ కోర్సులలో అడ్మిషన్ కోరుకునే AP EAPCET-2024 (Bi.P.C) అర్హత పొందిన అభ్యర్థులకు కౌన్సెలింగ్ ప్రక్రియ డిసెంబర్‌ 19న ప్రారంభం అవుతుంది. డిసెంబర్‌ 20వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో ప్రాసెసింగ్ ఫీజులు చెల్లించవచ్చు. రిజిస్ట్రేషన్‌, సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ కూడా ఇవే తేదీల్లో హెల్ప్‌ లైన్ సెంటర్లలో పూర్తి చేస్తారు.

మొదటి విడత కౌన్సిలింగ్‌ అడ్మిషన్లు పొందిన విద్యార్థులు మిగిలిపోయిన సీట్లలో సర్దుబాటు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తారు. సీట్లతో పాటు కోర్సుల్లో మార్పులు చేసుకోవాలనే విద్యార్థులు మరోసారి ప్రాసెసింగ్ ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. మొదటి విడత కౌన్సిలింగ్‌లో పాల్గొనని అభ్యర్థులు సర్టిఫికెట్‌ వెరిఫికేషన్ పూర్తి చేయాల్సి ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు ఇవే...

  • డిసెంబర్ 19,20 తేదీల్లో పేమెంట్‌ ప్రాసెసింగ్‌, సర్టిఫికెట్‌ వెరిఫికేషన్, రిజిస్ట్రేషన్ చేపడతారు.
  • రిజిస్ట్రేషన్‌ కోసం ఈ లింకును అనుసరించండి. https://cets.apsche.ap.gov.in
  • డిసెంబర్ 19-21 తేదీల మధ్య సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహిస్తారు. గుర్తింపు పొందిన హెల్ప్‌లైన్ సెంటర్లలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేపడతారు.
  • డిసెంబర్ 19 నుంచి 22 మధ్య వెబ్‌ ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పిస్తారు. ఈ లింకును అనుసరించండి.. https://cets.apsche.ap.gov.in.
  • డిసెంబర్ 22వ తేదీన ఆప్షన్లలో మార్పులు, చేర్పులు చేసుకోడానికి అవకాశం కల్పిస్తారు.
  • డిసెంబర్ 24న సీట్లను కేటాయిస్తారు.
  • డిసెంబర్ 24 నుంచి 26 మధ్య కాలేజీల్లో విద్యార్థులకు కేటాయించిన కాలేజీల్లో సెల్ఫ్‌ రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.

Whats_app_banner