Electric Scooters : ఇండియా మొబిలిటీ ఎక్స్ పో 2025లో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లు కనిపించే ఛాన్స్!-new scooters to likely debut at bharat mobility global expo 2025 including electric scooters check list ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Electric Scooters : ఇండియా మొబిలిటీ ఎక్స్ పో 2025లో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లు కనిపించే ఛాన్స్!

Electric Scooters : ఇండియా మొబిలిటీ ఎక్స్ పో 2025లో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లు కనిపించే ఛాన్స్!

Anand Sai HT Telugu
Dec 19, 2024 01:20 PM IST

Electric Scooters : ఇండియా మొబిలిటీ గ్లోబల్ ఎక్స్ పో 2025 ప్రారంభానికి మరికొన్ని రోజులే ఉంది. ఇది దేశంలోనే అతిపెద్ద ఆటో ఈవెంట్. ఇలాంటి పరిస్థితుల్లో పలు కంపెనీలు తమ కొత్త ఉత్పత్తులతో ముందుకు రాబోతున్నాయి. ఈ ఎక్స్ పోలో ప్రదర్శి్స్తాయి.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ఇండియా మొబిలిటీ గ్లోబల్ ఎక్స్ పో 2025 అతి త్వరలో ప్రారంభం కానుంది. ఇది దేశంలోనే అతిపెద్ద ఆటో ఈవెంట్. పలు కంపెనీలు తమ కొత్త ఉత్పత్తులను ప్రదర్శిస్తాయి. దేశంలోని పలు కంపెనీలు ఈ ఈవెంట్ కోసం తమ లైనప్‌ను వెల్లడించడం ప్రారంభించాయి. ఈ జాబితాలో టూ వీలర్స్ కూడా ఉన్నాయి. ఎక్కువగా ఎలక్ట్రిక్ మోడళ్లు ఉంటాయి. ప్రత్యేకత ఏమిటంటే హోండా తన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల ధరలను కూడా ఈ ఈవెంట్‌తో వెల్లడించే అవకాశం ఉంది. ఈ ఈవెంట్‌కు వచ్చే అవకాశమున్న మోడల్స్‌పై ఓ లుక్కేద్దాం.

హీరో డెస్టినీ 125

జనవరి 17న ఇండియా మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌ పో 2025లో కంపెనీ తన డెస్టినీ 125 స్కూటర్‌ను విడుదల చేయనుంది. ఈ స్కూటర్ వీఎక్స్, జెడ్ఎక్స్, జెడ్ఎక్స్ ప్లస్ అనే మూడు ట్రిమ్ స్థాయిలలో లభిస్తుంది. అయితే ఈ స్కూటర్ కొత్త ఎంట్రీ లెవల్ ఎల్ఎక్స్ వేరియంట్‌ను కూడా కంపెనీ వినియోగదారుల కోసం ప్రవేశపెట్టనుంది. ఇందులోని 125సీసీ సింగిల్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 9బిహెచ్‌పీ పవర్, 10.4ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. భారతదేశంలో ఇది టీవీఎస్ జూపిటర్ 125, హోండా యాక్టివా 125లతో పోటీ పడనుంది.

హోండా యాక్టివా ఈవీ

యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్ ఈవీ లాంచ్ చేసింది. అయితే దీని ధరలను కంపెనీ 2025 జనవరిలో ప్రకటించనుంది. ఈ సందర్భంగా దాని ధరలతో సస్పెన్స్‌కు తెరపడుతుందని భావిస్తున్నారు. ఇందులో 1.5 కిలోవాట్ల స్వాపబుల్ డ్యూయల్ బ్యాటరీ సెటప్ ఉంది. ఈ రెండు బ్యాటరీలు ఫుల్ ఛార్జ్ చేస్తే 102 కిలోమీటర్ల రేంజ్ ఇస్తాయి. ఈ బ్యాటరీలు 6 కిలోవాట్ల ఫిక్స్‌డ్ మాగ్నెట్ సింక్రోనస్ ఎలక్ట్రిక్ మోటారుకు శక్తినిస్తాయి. ఇది 22 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది ఎకో, స్టాండర్డ్, స్పోర్ట్ అనే మూడు రైడింగ్ మోడ్‌లను కలిగి ఉంది. దీని గరిష్ట వేగం గంటకు 80 కిలోమీటర్లు. అదే సమయంలో ఇది 0 నుండి 60 కిలోమీటర్ల వేగాన్ని 7.3 సెకన్లలో అందుకుంటుంది. ఇందులో 7 అంగుళాల టీఎఫ్‌టీ డిస్‌ప్లేను అందించారు. స్క్రీన్ నావిగేషన్‌ను సపోర్ట్ చేస్తుంది.

హోండా క్యూసీ1

హోండా క్యూసీ1 ఎలక్ట్రిక్ స్కూటర్‌ ధరలను కూడా జనవరిలో కంపెనీ ప్రకటించనుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 80 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 1.5 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్‌తో లభిస్తుంది. ఇందులో 7.0 అంగుళాల టీఎఫ్టీ స్క్రీన్ ఉంది. ఇది హోండా రోడ్ సింక్ డుయో యాప్‌తో రియల్ టైమ్ కనెక్టివిటీని అందిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 1.5 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఇది 1.2 కిలోవాట్ల (1.6 బిహెచ్పీ), 1.8 కిలోవాట్ల (2.4 బిహెచ్పీ) శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 0 నుండి 75 శాతం వరకు ఛార్జ్ చేయడానికి 3 గంటలు పడుతుంది. అదే సమయంలో ఫుల్ ఛార్జ్ 6 గంటల్లో జరుగుతుంది.

సుజుకి యాక్సెస్ ఈవీ సుజుకి

భారత మార్కెట్ కోసం యాక్సెస్ 125 ఆధారంగా కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను రూపొందించే పనిలో ఉంది. ఇది ఫిక్స్‌డ్ బ్యాటరీ ప్యాక్‌తో వస్తుందని నివేదికలు చెబుతున్నాయి. దీని స్థానిక ఉత్పత్తి కూడా మరికొద్ది రోజుల్లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. దీనికి ఎక్స్ ఎఫ్ 091 అనే కోడ్ నేమ్ పెట్టారు. 2025 జనవరిలో జరిగే ఇండియా మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో తొలిసారిగా దీనిని ప్రవేశపెట్టనున్నారు. రాబోయే సుజుకి ఇ-స్కూటర్ టెక్నాలజీ వివరాలు ఇంకా వెల్లడికాలేదు. కానీ ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే కనీసం 100 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని భావిస్తున్నారు.

టీవీఎస్ జూపిటర్ ఈవీ

మొబిలిటీ గ్లోబల్ ఎక్స్ పో 2025లో సరికొత్త జూపిటర్ ఆధారిత ఈవీని ఆవిష్కరించనుంది. మార్చి 2025 నాటికి భారత మార్కెట్లోకి ఆల్-ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేయనున్నట్లు కంపెనీ ఇప్పటికే ధృవీకరించింది. అయితే ప్రస్తుతానికి జూపిటర్ ఈవీ గురించి పెద్దగా తెలియదు. టీవీఎస్ ఇప్పటికే తన పోర్ట్‌ఫోలియోలో ఐక్యూబ్, ఎక్స్ రూపంలో రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను కలిగి ఉంది. టీవీఎస్ ఐక్యూబ్ భారతదేశంలో 3 లక్షల యూనిట్ల అమ్మకాల మార్కును దాటింది.

Whats_app_banner