Stock Market Crash : యూఎస్ ఫెడ్ రేట్ ఎఫెక్ట్.. మరోసారి భారతీయ స్టాక్ మార్కెట్‌ క్రాష్!-us fed rate reduced to 25 bps effect indian stock market crash sensex nifty know in details ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Stock Market Crash : యూఎస్ ఫెడ్ రేట్ ఎఫెక్ట్.. మరోసారి భారతీయ స్టాక్ మార్కెట్‌ క్రాష్!

Stock Market Crash : యూఎస్ ఫెడ్ రేట్ ఎఫెక్ట్.. మరోసారి భారతీయ స్టాక్ మార్కెట్‌ క్రాష్!

Anand Sai HT Telugu
Dec 19, 2024 11:41 AM IST

Stock Market Crash : యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటు తగ్గింపు ప్రభావం భారతీయ స్టాక్ మార్కెట్‌పై కనిపించింది. ఉదయం ప్రారంభమైన స్టాక్ మార్కెట్‌ భారీ పతనం చూసింది. సెన్సెక్స్ 1010 పాయింట్లు పడిపోయింది.

స్టాక్ మార్కెట్ క్రాష్
స్టాక్ మార్కెట్ క్రాష్

భారతీయ స్టాక్ మార్కెట్‌లో గురువారం ప్రారంభంలో క్షీణతను చూశాయి. దీని కారణం అమెరికా సెంట్రల్ బ్యాంక్ తీసుకున్న నిర్ణయం. యూఎస్ ఫెడర్ రిజర్వ్ వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లను తగ్గిస్తున్నట్టుగా ప్రకటించింది. దీంతో అమెరికా స్టాక్ మార్కెట్‌ల మీద ప్రభావం పడింది. గ్లోబల్ మార్కెట్‌ ఫాలో అవుతూ భారతీయ స్టాక్ మార్కెట్‌ కూడా భారీగా పతనమైంది. సెన్సెక్స్, నిఫ్టీ గురువారం ప్రారంభ ట్రేడ్‌లో క్షీణించాయి.

ఉదయం 9.30 గంటలకు 30 బీఎస్‌ఈ బెంచ్‌మార్క్ సెన్సెక్స్ 1,010 పాయింట్లు క్షీణించి 79,171 వద్దకు చేరుకుంది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 302 పాయింట్లు క్షీణించి 23,895 వద్దకు చేరుకుంది. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటును (25 bps) తగ్గించింది. 4.25 నుంచి 4.50 శాతానికి తగ్గించిన తర్వాత ఈ క్షీణత కనిపించింది.

యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ ఎఫెక్ట్‌తో గ్లోబల్ మారెట్‌లు క్షీణించాయి. అదే దారిలో భారతీయ స్టాక్ మార్కెట్ కూడా ఇంట్రాడేలో భారీగా పతనమైంది. సెన్సెక్స్ 1000 పాయింట్ల మేర పతనమైంది. మరోవైపు నిఫ్టీ కూడా 24000 పాయింట్ల కింద నడిచింది.

ఉదయం 11.12 గంటలకు సెన్సెక్స్ 928 పాయింట్లు పడిపోయింది. నిఫ్టీ 247 పాయింట్లతో 23,951 వద్ద ఉంది. మరోవైపు నిఫ్టీ ఆటో, ఐటీ, బ్యాంక్ నిఫ్టీ సూచీలు అమ్మకాల ఒత్తిడిని చూస్తున్నాయి. విప్రో, ఇన్ఫోసిస్ స్టాక్స్ పతనంలో ఉన్నాయి. ఐటీ స్టాక్స్ విక్రయించేందుకు పెట్టుబడిదారులు ఆసక్తి చూపిస్తున్నట్టుగా కనిపిస్తోంది.

యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపు తర్వాత అమెరికన్ స్టాక్ మార్కెట్‌లో క్షీణత కనిపిస్తుంది. వడ్డీ రేట్ల తగ్గింపు తనఖా, ఆటో లోన్‌తో సహా క్రెడిట్ కార్డ్‌లపై రుణ వడ్డీని తగ్గించే అవకాశం ఉన్నందున వినియోగదారులకు ఉపశమనం కలిగిస్తుందని భావిస్తున్నారు.

నిన్నటి స్టాక్ మార్కెట్

బుధవారం సెన్సెక్స్ 502.25 పాయింట్లు అంటే 0.62 శాతం క్షీణించి 80,182.20 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 137.15 పాయింట్లు అంటే 0.56 శాతం క్షీణించి 24,198.85 పాయింట్ల వద్ద ముగిసింది. బీఎస్ఈలో 2,563 స్టాక్‌లు క్షీణించగా, 1,442 పురోగమించగా, 94 మారలేదు.

Whats_app_banner