Baby Names with R: ఆంగ్ల అక్షరం Rతో మొదలయ్యే పిల్లల పేర్లు, ఇవి మీకు కచ్చితంగా నచ్చుతాయి-baby names starting with the english letter r you will definitely like these ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Baby Names With R: ఆంగ్ల అక్షరం Rతో మొదలయ్యే పిల్లల పేర్లు, ఇవి మీకు కచ్చితంగా నచ్చుతాయి

Baby Names with R: ఆంగ్ల అక్షరం Rతో మొదలయ్యే పిల్లల పేర్లు, ఇవి మీకు కచ్చితంగా నచ్చుతాయి

Haritha Chappa HT Telugu
Dec 19, 2024 10:44 AM IST

Baby Names with R: మీ బిడ్డకు R అక్షరంతో పేరు పెట్టాలనుకుంటే, అందమైన, ప్రత్యేకమైన, అర్థవంతమైన పేర్లను ఎంచుకోండి. ఈ పేర్లు మీ బాబుకు, పాపకు పెడితే ఎంతో అందంగా. మీకు నచ్చిన పేరును ఎంచుకోండి.

పిల్లల పేర్లు
పిల్లల పేర్లు (Pixabay)

బిడ్డ పుట్టిన వెంటనే ఏం పేరు పెట్టాలా అని ఆలోచించడం మొదలుపెడతారు. హిందూమతంలో ఆచారం ప్రకారం ప్రతిది నిర్వహించడానికి ప్రయత్నిస్తారు. పద్ధతి ప్రకారం నామకరణం చేసే ఆచారం ఉంటుంది. బిడ్డకు అర్ధవంతమైన, పాజిటివ్ అర్ధాన్నిచ్చే పేరు పెట్టేందుకు ప్రయత్నిస్తారు. పిల్లల వ్యక్తిత్వంపై మంచి ప్రభావాన్ని చూపుతుంది. మీరు మీ ప్రియమైన బిడ్డకు ర అక్షరంతో లేదా R అక్షరంతో పేరు పెట్టాలనుకుంటే, ఈ ప్రత్యేకమైన పేర్ల జాబితాలను ఇక్కడ ఇచ్చాము.

R అక్షరంతో బేబీ బాయ్ పేర్లు


రఘోత్తమ్ - శ్రీరాముడి పేరు ఇది

రఘువీర్ - ఇది శ్రీరాముడి పేరే

రజత్ - ఈ పేరుకర్ధం స్వచ్ఛమైనది, చెడు లేనిది అని అర్థం.

రాజీవ్ నయన్ - కమలంలాంటి కళ్లున్న వ్యక్తి అని అర్థం.

రాజుల్ - మంచి మనషి అర్థం

రక్షిత్ - రక్షించేవాడు అని అర్థం.

రచిత్ - ఏదైనా సృష్టించే వ్యక్తి అని అర్థం.

రణక్ - రాజు లేదా యోధుడు అని అర్థం.

రిహాన్ - విష్ణువు పేరు ఇది, దేవుడి ఎంచుకున్న వ్యక్తి.

రీయాన్ష్ - సూర్యుడి తొలికిరణం

రుద్రాన్ష్ - శివుడి పేరు ఇది

రివాన్ - మెరిసే నక్షత్రం

రాధేయ్ - కర్ణుడు, రాధా కొడుకు

రుషిత్ - సంపద

రిషాంక్ - శివ భక్తుడు

రుధిర్ - రుద్రుడు

రుషిక్ - భూమికి అధిపతి

రుషిల్ - మెరుపులాంటి వ్యక్తి

………………………..

R పేరుతో బేబీ గర్ల్ నేమ్ లిస్ట్

రాగవి - సంగీతంలోని రాగం పేరు ఇది.

రాహిణి - ఈ పేరుకర్థం సరస్వతీ దేవి.

రవణ్య - ఇది ఒక ఆధునిక పేరు.

రీతుపర్ణ - ఈ పేరుకర్థం పచ్చని వాతావరణం అని అర్థం.

రామనికా - ఈ పేరుకర్థం అంటే ఆహ్లాదకరమైనది

రానియా - దృఢమైన అని అర్థం.

రణవిత - ఈ పేరుకర్థం మాతృదేవత అని అర్థం.

రష్మిత - ఈ పేరుకర్థం వెలుగు అని అర్థం.

రైమా - ఆనందం, పరశు రాముడి గొడ్డలి

రజని గంధ -ఒక పువ్వు

రజిషా - చందమామ

రజ్వి - ఈ పేరుకర్థం రాణి

రమణిక - అందమైన అమ్మాయి

రంజిక - ఆనందంతో

రీషా - మనసుకు నచ్చిన సౌండ్

రేయా - రాణిలాంటి మహిళ

రిద్ధి - మంచి అదృష్టం

రితికా - నీటి ప్రవాహం

రాతంజలి - దీనికర్థం ఎర్రచందనం అని అర్థం.

Whats_app_banner