Stock Market Crash : స్టాక్ మార్కెట్‌ క్రాష్.. సెన్సెక్స్ 1000 పాయింట్ల నష్టం.. కారణాలివే!-stock market crash why sensex cracked over 1000 points today heres reasons ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Stock Market Crash : స్టాక్ మార్కెట్‌ క్రాష్.. సెన్సెక్స్ 1000 పాయింట్ల నష్టం.. కారణాలివే!

Stock Market Crash : స్టాక్ మార్కెట్‌ క్రాష్.. సెన్సెక్స్ 1000 పాయింట్ల నష్టం.. కారణాలివే!

Anand Sai HT Telugu
Dec 17, 2024 03:13 PM IST

Stock Market Crash : స్టాక్ మార్కెట్‌లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్ 1000 పాయింట్స్‌కి పైగా నష్టపోగా.. నిఫ్టీ 50.. 24,336 కింద ఉంది.

స్టాక్​ మార్కెట్ క్రాష్​
స్టాక్​ మార్కెట్ క్రాష్​ (MINT_PRINT)

డిసెంబర్ 17న భారతీయ స్టాక్ మార్కెట్ వరుసగా రెండో రోజు క్షీణిస్తోంది. సెన్సెక్స్, నిఫ్టీ 50 సూచీలలో క్షీణత ఉంది. రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వంటివి మార్కెట్ క్షీణతలో ముఖ్యమైన పాత్ర పోషించాయి. వాస్తవానికి మార్కెట్ దృష్టి డిసెంబర్ 18న జరగనున్న యూఎస్ ఫెడరల్ రిజర్వ్ పాలసీ మీటింగ్‌పై ఉంది. దీంతో పెట్టుబడిదారులు సైతం ఇందుకోసం వెయిట్ చేస్తున్నారు.

yearly horoscope entry point

స్టాక్ మార్కెట్‌లోని ప్రధాన సూచీలు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్ దాదాపు 1061 పాయింట్లు పడిపోయి 80,687 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇది ఇంట్రాడేలో 80,700కి పడిపోయింది. అలాగే నిఫ్టీ కూడా ప్రారంభ ట్రేడింగ్‌లో 24350 స్థాయికి పడిపోయిన 24400 స్థాయి కిందకి ఉంది. బీఎస్‌ఇ మిడ్‌క్యాప్, బీఎస్‌ఇ స్మాల్‌క్యాప్ సూచీలలో స్వల్ప వృద్ధి కనిపిస్తోంది. మరోవైపు ప్రపంచ మార్కెట్‌ నుంచి మిశ్రమ స్పందన కనిపిస్తోంది.

సెన్సెక్స్ షేర్లలో అదానీ పోర్ట్స్ మాత్రమే లాభపడింది. దీనికి వ్యతిరేకంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో భారీ క్షీణత కనిపిస్తోంది. నిఫ్టీ ఇండెక్స్‌లో అదానీ పోర్ట్స్, టాటా మోటార్స్‌లో వృద్ధి కనిపిస్తోంది. అయితే శ్రీరామ్‌ ఫైనాన్స్‌ మాత్రం భారీ నష్టాన్ని చవిచూసింది. ఫైనాన్షియల్, ఆయిల్, గ్యాస్ రంగాలు 1 శాతం కంటే ఎక్కువ క్షీణించగా, నిఫ్టీ మీడియా, రియల్టీ సూచీలు దాదాపు 1 శాతం లాభపడ్డాయి.

మార్కెట్‌లోని పెట్టుబడిదారులు ఫెడ్ నిర్ణయంతో పాటు ఇతర ప్రపంచ ఆర్థిక పరిణామాలను నిశితంగా చూస్తున్నారు. వీటిలో బ్యాంక్ ఆఫ్ జపాన్ పాలసీ సమావేశం, చైనా రుణ ప్రధాన రేటు ప్రకటన వంటివి ఉన్నాయి. రాబోయే యూఎస్ ఫెడ్ పాలసీ ప్రకటన మార్కెట్ సెంటిమెంట్ దిశలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని భావిస్తున్నారు. Q3 FY25 ఆదాయాల సీజన్, యూనియన్ బడ్జెట్ వంటి దేశీయ ఈవెంట్‌లు కూడా ముఖ్యమైనవిగా ఉన్నాయి.

విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు.. మళ్లీ విక్రయదారులుగా మారడం కూడా మార్కెట్‌ సెంటిమెంట్‌ను దెబ్బతీసిందని అంటున్నారు. వీరు సోమవారం సుమారు రూ.279 కోట్ల నిధుల్ని దేశీయ మార్కెట్ నుంచి వెనక్కు తీసుకున్నారు. మరోవైపు ఎగుమతులు, దిగుమతులు కూడా మార్కెట్ మీద ప్రభావం చూపించాయని అంటున్నారు. నవంబర్‌లో దేశీయ వాణిజ్య ఎగుమతులు తగ్గాయని, దిగుమతులు 27 శాతం పెరిగి రికార్డు స్థాయి 69.75 బిలియన్ డాలర్లకు చేరింది. దీంతో వాణిజ్యలోటు 37.84 బిలియన్ డాలర్లకు పెరిగింది. డాలర్ విలువ మరింత పెరగడం కూడా స్టాక్ మార్కెట్‌లపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది.

మార్కెట్‌లో ఈ క్షీణత పెట్టుబడిదారులకు హెచ్చరిక పంపిస్తుందని మార్కెట్ విశ్లేషకులు సూచిస్తున్నారు. ఈ కాలంలో ఐటీ, ఫార్మా, రియల్టీ వంటి రంగాలు మెరుగైన పనితీరు కనబరిచే అవకాశం ఉందని అంటున్నారు.

గమనిక : ఇది పెట్టుబడి సలహా కాదు. స్టాక్ మార్కెట్ పనితీరు గురించి మాత్రమే. స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయడం రిస్క్‌తో కూడుకున్నది. నిపుణులను సంప్రదించండి.

Whats_app_banner