ఐపీఎల్ ప్రపంచంలోనే మోస్ట్ కాస్ట్‌లీ లీగ్‌గా పేరు తెచ్చుకున్నది. ఐపీఎల్ ద్వారా ఆటగాళ్లతో పాటు ఫ్రాంచైజ్‌లు ప్రతి ఏటా కోట్ల ఆదాయాన్ని దక్కించుకుంటోన్నాయి. ఐపీఎల్ బ్రాండ్ వాల్యూ ఒక్కో ఏడాది పెరుగుతూ లక్ష ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలకు చేరుకుంది. 2023తో పోలిస్తే 2024 ఏడాదికి 28 వేల కోట్ల రూపాయలు బ్రాండ్ వాల్యూ పెరిగింది. టైటిల్ స్పాన్సర్‌షిప్ కోసమే టాటా గ్రూప్ ఐదేళ్లకు ఐపీఎల్ పాలలకమండలితో 335 కోట్లతో ఒప్పందం కుదుర్చుకుంది.
ఐపీఎల్ ఫ్రాంచైజ్‌లు కూడా ఆటగాళ్లను కోట్లు పెట్టి వేలంలో దక్కించుకుంటున్నాయి. వారికి ఉన్న ఇమేజ్ ద్వారా యాడ్స్ రూపంలో ఫ్రాంచైజ్‌లో భారీగా ఆదాయాన్ని దక్కించుకుంటున్నాయి. యాడ్స్ ద్వారా మాత్రమే కాదు జెర్సీ స్పాన్సర్‌షిప్‌ల ద్వారా ఐపీఎల్ ఫ్రాంచైజ్‌లకు భారీగానే ఆదాయం దక్కుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఐపీఎల్ 2025లో కొత్త జెర్సీతో ముంబై ఇండియన్స్ బరిలోకి దిగబోతుంది. ఇటీవలే లారిట్జ్ నడ్సెన్ కంపెనీతో ముంబై ఇండియన్స్ జెర్సీ స్పాన్సర్‌షిప్ డీల్ కుదుర్చుకున్నట్లు సమాచారం. ఈ స్పాన్సర్‌షిప్ కోసం లారిట్జ్ కంపెనీ ముంబై ఇండియన్స్‌కు దాదాపు ఏడాదికి నలభై కోట్లు చెల్లించబోతున్నట్లు ప్రచారంజరుగుతోంది. 2025 నుంచి 2027 వరకు మూడు సీజన్లకు కలిపి 120 కోట్లకు డీల్ కుదిరినట్లు సమాచారం.
ఐపీఎల్‌లో కాస్ట్‌లీ జెర్సీ స్పాన్సర్‌షిప్‌లో చెన్నై సెకండ్ ప్లేస్‌లో ఉంది. సీఎస్‌కే టీమ్ జెర్సీలపై టీవీఎస్ యూరోగ్రిప్ బ్రాండ్ పేరు కనిపిస్తుంది. ఈ జెర్సీ స్పాన్సర్‌షిప్ కోసం టీవీఎస్ సంస్థ ప్రతి ఏటా చెన్నైకి ముప్పైమూడున్నర కోట్లు చెల్లిస్తోన్నట్లు సమాచారం.
ఆర్‌సీబీ టీమ్ ఇప్పటివరకు ఒక్కసారి కూడా కప్ గెలవలేకపోయినా బ్రాండ్ వాల్యూలో మాత్రం దూసుకుపోతోంది. ఆర్‌సీబీ తమ టీమ్ జెర్సీల కోసం ఖతార్ ఏయిర్‌వేస్‌తో డీల్ కుదుర్చుకుంది. ప్రతి ఏటా ఇరవై ఐదు కోట్లతో మూడేళ్లకు 75 కోట్లకు స్పాన్సర్‌షిప్ డీల్ ఫిక్స్ అయినట్లు క్రికెట్ వర్గాలు చెబుతోన్నాయి.
రాజస్థాన్ రాయల్స్ టీమ్ జెర్సీలపై గత కొన్నేళ్లుగా లూమినస్ సంస్థ బ్రాండ్ పేరు కనిపిస్తూ వస్తోంది. జెర్సీలపై తమ బ్రాండ్ కనిపించడం కోసం రాజస్థాన్ రాయల్స్‌కు లూమినస్ సంస్థ ఏటా ఇరవై కోట్లకుపైనే చెల్లిస్తోన్నట్లు సమాచారం.