Keerthy Suresh mangalsutra: మోడ్రన్ డ్రెస్‌లో మంగళసూత్రంతో కీర్తి సురేష్.. పెళ్లి తర్వాత తొలిసారి ఇలా..
Keerthy Suresh mangalsutra: కీర్తి సురేష్ పెళ్లి తర్వాత తొలిసారి మెడలో మంగళసూత్రంతో కనిపించింది. అయితే రెడ్ మోడ్రన్ డ్రెస్ లో ఆమె ఇలా కనిపించడం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది.
Keerthy Suresh mangalsutra: మోడ్రన్ డ్రెస్ లో మంగళసూత్రంతో కీర్తి సురేష్ పెళ్లి తర్వాత తొలి పబ్లిక్ అప్పియరెన్స్ అదిరిపోయింది. తాను నటిస్తున్న తొలి బాలీవుడ్ మూవీ బేబీ జాన్ ప్రమోషన్లలో భాగంగా ఆమె ఓ ఈవెంట్ కు వచ్చింది. రెడ్ బాడీకాన్ డ్రెస్ లో పెళ్లి కళ ఉట్టిపడుతుండగా.. కీర్తి ఫొటోలకు పోజులిచ్చింది. ఇవి ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
మంగళసూత్రంతో కీర్తి సురేష్
కీర్తి సురేష్ డిసెంబర్ 12న గోవాలో తన బాయ్‌ఫ్రెండ్ ఆంటోనీ తాటిల్ ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. మొదట హిందూ సాంప్రదాయంలో, ఆ తర్వాత క్రిస్టియన్ సాంప్రదాయంలో వీళ్ల పెళ్లి జరిగింది. అయితే పెళ్లి తర్వాత తొలిసారి బయటకు వచ్చిన కీర్తి సురేష్ మెడలో తాళితో కనిపించడం విశేషం.
రెడ్ బాడీకాన్ మోడ్రన్ డ్రెస్ లో మంగళసూత్రం స్పష్టంగా కనిపించేలా ఆమె ఇచ్చిన ఈ అప్పియరెన్స్ అభిమానులను బాగా ఆకర్షిస్తోంది. బేబీ జాన్ మూవీ ప్రమోషన్లలో భాగంగా వరుణ్ ధావన్, డైరెక్టర్ అట్లీ, వామికా గబ్బిలతో కలిసి కీర్తి ఈ ఈవెంట్ కు వచ్చింది. మోడ్రన్ డ్రెస్ లో మంగళసూత్రం ధరించడం మాత్రం చాలా ప్రత్యేకంగా అనిపించింది.
కీర్తి లుక్‌కు అభిమానులు ఫిదా
బేబీ జాన్ ఈవెంట్లో కీర్తి సురేష్ ను చూసిన ఫ్యాన్స్.. ఆమెలో పెళ్లి కళ స్పష్టంగా కనిపిస్తోందని కామెంట్స్ చేయడం విశేషం. నిజానికి కీర్తి చాలా హాట్ గా, స్లిమ్ గా కనిపించింది. కీర్తి సాంప్రదాయాలాను చాలా బాగా పాటిస్తోందంటూ ఓ అభిమాని కామెంట్ చేశారు. చాలా అందంగా ఉన్నావంటూ మరొకరు అన్నారు. కీర్తి పెళ్లి చేసుకొని ఇప్పటికే రెండు వారాలు దాటింది.
గోవాలో పెళ్లి తర్వాత ఆమె తొలిసారి పబ్లిక్ ఈవెంట్ కు హాజరైంది. ఆమె నటించిన బేబీ జాన్ మూవీ డిసెంబర్ 25న రిలీజ్ కానుంది. తమిళంలో వచ్చిన సూపర్ హిట్ అయిన తెరి మూవీకి ఇది రీమేక్. ఈ బేబీ జాన్ తర్వాత రివాల్వర్ రీటా అనే మరో సినిమాతో కీర్తి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ మూవీ టీజర్ రిలీజైంది.
కీర్తి, ఆంటోనీ పెళ్లి
కీర్తి, ఆంటోనీ 15 ఏళ్ల పాటు డేటింగ్ చేసిన విషయం తెలిసిందే. హైస్కూల్లో మొదలైన వీళ్ల ప్రేమకు ఈ మధ్యే 15 ఏళ్లు పూర్తయినట్లు కీర్తి ఓ పోస్ట్ చేసింది. ఆ తర్వాత డిసెంబర్ 12న గోవాలో వీళ్లు పెళ్లి చేసుకున్నారు. నాలుగు రోజుల వ్యవధిలో మొదట హిందూ సాంప్రదాయంలో, తర్వాత క్రిస్టియన్ పద్ధతిలో పెళ్లి జరిగింది. వైట్ వెడ్డింగ్ సందర్భంగా వీళ్ల లిప్ లాక్ ఫొటోలు కూడా వైరల్ అయ్యాయి.