రాహుల్ గాంధీ దాడి చేశారు.. పోలీసులకు బీజేపీ ఎంపీల ఫిర్యాదు-bjp mps reach police station to file complaint against rahul gandhi for alleged assault ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  రాహుల్ గాంధీ దాడి చేశారు.. పోలీసులకు బీజేపీ ఎంపీల ఫిర్యాదు

రాహుల్ గాంధీ దాడి చేశారు.. పోలీసులకు బీజేపీ ఎంపీల ఫిర్యాదు

HT Telugu Desk HT Telugu
Dec 19, 2024 03:01 PM IST

పార్లమెంట్ ఆవరణలో బీజేపీ ఎంపీ ప్రతాప్ సారంగిపై రాహుల్ గాంధీ దాడి చేశారని బీజేపీ ఎంపీ బన్సూరి స్వరాజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

న్యూఢిల్లీ: న్యూఢిల్లీలోని పార్లమెంట్ కాంప్లెక్స్ వద్ద ఇండియా బ్లాక్ మరియు NDA ఎంపీల మధ్య ఘర్షణలో గాయపడి RML ఆసుపత్రిలో చేరిన బీజేపీ ఎంపీ ముఖేష్ రాజ్‌పుత్‌ను కేంద్ర మంత్రులు శివరాజ్ చౌహాన్ మరియు ప్రహ్లాద్ జోషి పరామర్శించారు.
న్యూఢిల్లీ: న్యూఢిల్లీలోని పార్లమెంట్ కాంప్లెక్స్ వద్ద ఇండియా బ్లాక్ మరియు NDA ఎంపీల మధ్య ఘర్షణలో గాయపడి RML ఆసుపత్రిలో చేరిన బీజేపీ ఎంపీ ముఖేష్ రాజ్‌పుత్‌ను కేంద్ర మంత్రులు శివరాజ్ చౌహాన్ మరియు ప్రహ్లాద్ జోషి పరామర్శించారు. (PTI)

న్యూఢిల్లీ, డిసెంబర్ 19: పార్లమెంట్ ఆవరణలో బీజేపీ ఎంపీ ప్రతాప్ సారంగిపై దాడి కేసులో రాహుల్ గాంధీపై ఫిర్యాదు చేసేందుకు భారతీయ జనతా పార్టీ ఎంపీలు బన్సూరి స్వరాజ్, అనురాగ్ ఠాకూర్ పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు.

పార్లమెంటులో ఆందోళనల మధ్య ఇద్దరు బీజేపీ ఎంపీలు ప్రతాప్ సారంగి, ముఖేష్ రాజ్ పుత్ గాయపడ్డారు. ఇద్దరు ఎంపీలను హుటాహుటిన ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రిలో చేర్పించారు.

ఇరువురి తలకు గాయాలు కావడంతో వారిని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)లో చేర్చినట్లు మెడికల్ సూపరింటెండెంట్ అజయ్ శుక్లా తెలిపారు. ప్రతాప్ సారంగి గాయాలపై ఆయన మాట్లాడుతూ సారంగికి తీవ్ర రక్తస్రావం జరుగుతోందన్నారు. పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ప్రతాప్ సారంగికి తీవ్ర రక్తస్రావం కావడంతో తీవ్ర గాయాలయ్యాయని, అతడికి కుట్లు పడ్డాయని తెలిపారు.

ముఖేష్ రాజ్ పుత్ గురించి ఆయన మాట్లాడుతూ.. ఎంపీ ఇప్పటికే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారన్నారు. ‘ముఖేష్ రాజ్ పుత్ అపస్మారక స్థితిలోకి వెళ్లారు. ప్రస్తుతం, అతను స్పృహలోకి వచ్చారు. కానీ ఆయన ఆందోళనకు గురయ్యారు. ఆయన బీపీ పెరిగింది' అని తెలిపారు.

తాను మెట్లపై నిలబడి ఉండగా మరో పార్లమెంటు సభ్యుడు తనపై పడటంతో తలకు గాయమైందని సారంగి పేర్కొన్నారు. 'నాపై పడిన పార్లమెంటు సభ్యుడిని రాహుల్ గాంధీ తోసేశారు, ఆ తర్వాత నేను కింద పడిపోయాను. నేను మెట్ల దగ్గర నిల్చున్నప్పుడు రాహుల్ గాంధీ వచ్చి ఓ ఎంపీని తోసేశారు.’ అని విలేకరులకు తెలిపారు.

ఈ ఆరోపణలపై స్పందించిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తాను పార్లమెంటులోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్నానని, ఇతర ఎంపీలు అడ్డుకున్నారని ఆరోపించారు. పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గేను కూడా తోసేశారని ఆరోపించారు.

"ఇది మీ కెమెరాలో ఉండొచ్చు. నేను పార్లమెంటు ప్రవేశ ద్వారం గుండా లోపలికి వెళ్లడానికి ప్రయత్నిస్తున్నాను, కానీ బిజెపి ఎంపిలు నన్ను ఆపడానికి, నెట్టడానికి, బెదిరించడానికి ప్రయత్నించారు. దీని వల్ల మాపై ఎలాంటి ప్రభావం పడదు' అని రాహుల్ గాంధీ అన్నారు.

‘కానీ ఇది ప్రవేశ ద్వారం, లోపలికి వెళ్లే హక్కు మాకుంది. బీజేపీ ఎంపీలు మమ్మల్ని లోపలికి వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు..’ అని వివరించారు.

బీజేపీ ఎంపీలు భౌతిక దాడికి పాల్పడ్డారని ఆరోపిస్తూ ఖర్గే లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. 2024 డిసెంబర్ 17న రాజ్యసభలో కేంద్ర హోం మంత్రి చేసిన ప్రసంగంలో అంబేడ్కర్‌పై చేసిన అవమానకర వ్యాఖ్యలకు నిరసనగా తాము నిరసన ర్యాలీ చేపట్టినట్లు ఖర్గే బిర్లాకు రాసిన లేఖలో పేర్కొన్నారు.

‘మా ఎంపీలతో కలిసి ప్రవేశ ద్వారానికి చేరుకోగానే బీజేపీ ఎంపీలు నన్ను తోసేశారు. ఆ తర్వాత బ్యాలెన్స్ కోల్పోయి ప్రవేశ ద్వారం ముందు నేలపై కూర్చోవాల్సి వచ్చింది. ఇప్పటికే శస్త్రచికిత్స చేయించుకున్న నా మోకాళ్లకు గాయమైంది' అని ఖర్గే తన లేఖలో పేర్కొన్నారు. (ఏఎన్ఐ)

Whats_app_banner