KMC Warangal : కాకతీయ మెడికల్ కాలేజీలో ఉద్యోగాలు.. నెలకు జీతం ఎంతో తెలుసా!-kakatiya medical college jobs notification released ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Kmc Warangal : కాకతీయ మెడికల్ కాలేజీలో ఉద్యోగాలు.. నెలకు జీతం ఎంతో తెలుసా!

KMC Warangal : కాకతీయ మెడికల్ కాలేజీలో ఉద్యోగాలు.. నెలకు జీతం ఎంతో తెలుసా!

Basani Shiva Kumar HT Telugu
Sep 26, 2024 12:23 PM IST

KMC Warangal : వరంగల్ నగరంలోని కాకతీయ మెడికల్ కాలేజీలో వివిధ విభాగాల్లో పోస్టులు భర్తీ చేయనున్నారు. దీనికి సంబంధించి కేఎంసీ వరంగల్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈనెల 27వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. వివరాల కోసం ప్రిన్సిపల్ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.

కాకతీయ మెడికల్ కాలేజీలో ఉద్యోగాలు
కాకతీయ మెడికల్ కాలేజీలో ఉద్యోగాలు (KMC)

కాకతీయ మెడికల్ కాలేజీలో వివిధ విభాగాల్లో కాంట్రాక్ట్ పద్ధతిలో 68 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్, 4 సీఏసీఎస్ ఆర్ఎంవో పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు.. ప్రన్సిపల్ డాక్టర్ రాంకుమార్ రెడ్డి వెల్లడించారు. అర్హులు సంబంధింత సర్టిఫికెట్లతో.. ఈనెల 27వ తేదీ నుంచి ఆక్టోబర్ 3వ తేదీ లోపు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రిన్సిపల్ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.

నోటిఫికేషన్ పూర్తి వివరాలు..

అసిస్టెంట్ ప్రొఫెసర్లకు నెలకు జీతం రూ.1,25,000 ఉంటుంది.

సీఏసీఎస్ ఆర్ఎంవోలకు నెల జీతం రూ.52,000 ఉంటుంది.

అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారి వయసు 64 ఏళ్లు మించకూడదు.

సీఏసీఎస్ ఆర్ఎంవో అభ్యర్థుల వయస్సు నోటిఫికేషన్ విడుదల చేసే నాటికి 45 సంవత్సరాలు మించొద్దు.

ఎంపికైన వారికి ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం ఇస్తారు.

అపాయింట్‌మెంట్ లెటర్ ఇచ్చిన తర్వాతి రోజే విధుల్లో చేరాలి.

విధుల్లో చేరిన వారికి ఏడాదికి 15 సెలవులు ఉంటాయి.

ఈ పోస్టులను కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేస్తారు.

రెగ్యులర్ రిక్రూట్‌మెంట్ జరిగిన వెంటనే వీరిని టర్మినేట్ చేస్తారు.

ఎంపికైన వారు విధుల్లో చేరేటప్పుడు ఒరిజినల్ సర్టిఫికెట్లు సబ్‌మిట్ చేయాలి.

దరఖాస్తు ఫాం, ఇతర వివరాలకు https://www.kmcwgl.com/ వెబ్‌సైటన్‌ను చూడొచ్చు.

త్వరలో 612 పోస్టుల భర్తీ..

తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖలో 612 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్‌ విడుదల కానుంది. ఇప్పటికే ఈ పోస్టుల భర్తీకి వైద్య, ఆరోగ్య, ఆర్థిక శాఖలు అనుమతి ఇచ్చాయి. వైద్య, ఆరోగ్యసేవల రిక్రూట్‌మెంట్‌ బోర్డు భర్తీ ప్రక్రియను చేపట్టనుంది. తెలంగాణలోని వైద్య విధాన పరిషత్‌ ఆసుపత్రుల్లో వైద్యుల పోస్టులు భారీగా ఖాళీ ఉన్న నేపథ్యంలో.. మరో 1600 మెడికల్‌ ఆఫీస ర్‌(స్పెషలిస్ట్‌) పోస్టులను మంజూరు చేయాలని కోరుతూ.. వైద్య, ఆరోగ్యశాఖ ఆర్థికశాఖకు ప్రతిపాదనలు పంపింది.

ఇటీవలే నోటిఫికేషన్..

తెలంగాణ వైద్యారోగ్య శాఖ నుంచి ఇటీవలే ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయింది. 633 ఫార్మాసిస్టు గ్రేడ్‌ 2 పోస్టులను భర్తీకి ప్రకటన ఇచ్చారు. ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి అక్టోబర్ 05వ తేదీ నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఆన్‌లైన్ దరఖాస్తులకు అక్టోబర్ 21వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. అక్టోబర్ 23, 24 తేదీల్లో ఆన్ లైన్ దరఖాస్తులను ఎడిట్ చేసుకోవచ్చు. ఈ పోస్టులకు సంబంధించిన రాత పరీక్షలు నవంబర్ 30వ తేదీన జరుగుతాయి. https://mhsrb.telangana.gov.in/ వెబ్ సైట్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.

Whats_app_banner