AP Dasara Holidays 2024 : ఏపీలో ఈసారి 10 రోజులపాటు దసరా సెలవులు - ఎప్పట్నుంచంటే..!
ఏపీలో దసరా సెలవులు రాబోతున్నాయి. అక్టోబర్ 4వ తేదీ నుంచి విద్యాసంస్థలకు హాలీ డేస్ ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 13వ తేదీవ తేదీతో ఈ సెలవులు ముగుస్తాయి. అంటే ఈసారి మొత్తం 10 రోజులు సెలవులు రానున్నాయి. ఇక తెలంగాణలో చూస్తే 13 రోజులు సెలవులు ప్రకటించారు.
త్వరలోనే దసరా సందండి మొదలుకాబోతుంది. ఇప్పటికే సొంత ఊర్లు, పట్టణాలకు వెళ్లేందుకు ప్రజలు సిద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగా ఇప్పటికే రైల్వేశాఖ ప్రత్యేక రైళ్లను కూడా ప్రకటించింది. సొంత ప్రాంతాలకు వెళ్లేందుకు ముందస్తుగానే టికెట్లను బుకింగ్ చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. అయితే దసరా వచ్చిందంటే స్కూల్స్, కాలేజీలకు భారీగానే సెలవులు వస్తాయి.
మొత్తం 10 రోజులు…
ఈ ఏడాది ఏపీలో చూస్తే మొత్తం 10 రోజులు సెలవులు రానున్నాయి. విద్యాశాఖ ప్రకటించిన అకడమిక్ క్యాలెండర్ ప్రకారం అక్టోబర్ 4వ తేదీ నుంచి సెలవులు ప్రారంభమవుతాయి. అక్టోబర్ 13వ తేదీతో ముగుస్తాయి. ఇక అక్టోబర్ 2వ తేదీన గాంధీ జయంతి ఉంది. ఈ రోజు కూడా సెలవు ఉంటుంది. మధ్యలో మూడో తేదీ మినహాయిస్తే… అక్టోబర్ 13వ తేదీ వరకు హాలీ డేస్ ఉంటాయి. తిరిగి అక్టోబర్ 14వ తేదీన అంటే సోమవారం స్కూళ్లు, కాలేజీలు పునఃప్రారంభమవుతాయి. అయితే 3వ తేదీన కూడా సర్కార్ సెలవు ఇస్తే… 13 రోజుల పాటు హాలీ డేస్ వస్తాయి. దసరా సెలవులపై ఏపీ సర్కార్ నుంచి అధికారికంగా ప్రకటన రానుంది.
ఇక వచ్చే అక్టోబర్ నెలలోనే దీపావళి పండగ కూడా రాబోతుంది. అక్టోబర్ 31వ తేదీన దీపావళి ఉండటంతో ఆ రోజు రాష్ట్రంలోని అన్ని స్కూల్స్, కాలేజీలకు సెలవు ఉండనుంది. ఇక మైనారిటీ విద్యా సంస్థలకు క్రిస్మస్ సెలవులు డిసెంబరు 22 నుంచి 29 వరకు ఇవ్వనున్నారు. సంకాంత్రి సెలవులు చూస్తే… 2025 జనవరి 10 నుంచి 19 వరకు ఉంటాయి. మైనారిటీ విద్యా సంస్థలకు మాత్రం జనవరి 11 నుంచి 15 వరకు సెలవులు ఇవ్వనున్నారు.
తెలంగాణలో 13 రోజులు:
తెలంగాణలోని స్కూళ్లకు వరుసగా 13 రోజులు సెలవులు రానున్నాయి. అక్టోబర్ 2వ తేదీ నుంచి 14వ తేదీ వరకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. దీంతో అక్టోబర్ 15వ తేదీన పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతితో సెలవులు ప్రారంభం కానున్నాయి. ఆ తర్వాత నుంచి బతుకమ్మ, దసరా సెలవులు ఉంటాయని విద్యాశాఖ అధికారులు వివరించారు.
కొన్ని ప్రైవేట్ పాఠశాలలు అక్టోబర్ 1వ తేదీ నుంచి సెలవులు ఇస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించాయి. మళ్లీ అక్టోబర్ 15వ పునః ప్రారంభం ఉంటుందని విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం పంపాయి. వరుసగా 13 రోజులు సెలవులు రావడంతో విద్యార్థులు ఎగిరి గంతేస్తున్నారు. ఊర్లకు వెళ్లడానికి సిద్ధం అవుతున్నారు.
తెలంగాణ ప్రభుత్వం మే 25న 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్‌ను విడుదల చేసింది. అక్టోబర్ 2 నుంచి 14వ తేదీ వరకు దసరా సెలవులు, డిసెంబర్ 23 నుంచి 27 వరకు క్రిస్మస్ సెలవులు, జనవరి 13 నుంచి 17వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు ప్రకటించారు. 2025, ఏప్రిల్ 23వ తేదీ వరకు పాఠశాలలు కొనసాగనున్నాయి. 2025 ఫిబ్రవరి 28వ తేదీ లోపు పదో తరగతి ప్రి ఫైనల్ పరీక్షలు నిర్వహించనున్నారు. 2025 మార్చిలో పదో తరగతి వార్షిక పరీక్షలు నిర్వహించనున్నారు.
సంబంధిత కథనం