KNRUHS Admissions 2024 : బీడీఎస్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ - ఇవాళ్టి నుంచి రిజిస్ట్రేషన్లు-kaloji narayana rao health university has released the notification for admission in to bds courses ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Knruhs Admissions 2024 : బీడీఎస్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ - ఇవాళ్టి నుంచి రిజిస్ట్రేషన్లు

KNRUHS Admissions 2024 : బీడీఎస్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ - ఇవాళ్టి నుంచి రిజిస్ట్రేషన్లు

Maheshwaram Mahendra Chary HT Telugu
Aug 04, 2024 01:35 PM IST

Kaloji health University Admissions:బీడీఎస్‌ కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్శిటీ వివరాలను పేర్కొంది. ఇవాళ్టి నుంచే ఆన్ లైన్ రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు.

బీడీఎస్ ప్రవేశాలు 2024
బీడీఎస్ ప్రవేశాలు 2024

Kaloji Narayana Rao health University :కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం నుంచి అడ్మిషన్ల నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా బీడీఎస్‌, ఎంబీబీఎస్ కోర్సుల్లో ప్రవేశాలను కల్పిస్తారు. వైద్య కళాశాల్లో కన్వీనర్‌((కాంపీటెంట్)) కోటా సీట్లను భర్తీ చేస్తారు. నీట్ 2024లో అర్హత సాధించిన అభ్యర్థులు అప్లికేషన్ చేసుకోవచ్చు. https://www.knruhs.telangana.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి ప్రాసెస్ పూర్తి చేయాలి.

హెల్త్ వర్శిటీ షెడ్యూల్ ప్రకారం…. ఆగస్టు 3వ తేదీన నోటిఫికేషన్ విడుదలైంది. ఇవాళ్టి (ఆగస్టు) నుంచి ఆన్ లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సంబంధింత సర్టిఫికెట్లను స్కాన్ చేసి అప్ లోడ్ చేయటం తప్పనిసరి. ఆగస్టు 13వ తేదీతో ఈ గడువు ముగుస్తుంది.

ధ్రువపత్రాల పరిశీలన తర్వాత… ప్రొవిజనల్ మెరిట్ జాబితాను ప్రకటిస్తారు. తరగతులతో నిర్వహణతో పాటు మరిన్ని వివరాలను త్వరలోనే విడుదల చేస్తామని షెడ్యూల్ పేర్కొన్నారు. https://www.knruhs.telangana.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి తాజా వివరాలను తెలుసుకోవచ్చని సూచించారు.

అభ్యర్థులకు ఏమైనా ఇబ్బందులు ఉంటే 9392685856, 9059672216 నెంబర్లను సంప్రదించవచ్చు. tsmedadm2024@gmail. com మెయిల్ ద్వారా కూడా సమస్యలను చేరవయవచ్చు. అభ్యర్థులు రిజిస్ట్రేషన్ కోసం రూ.3500 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.2900 చెల్లించాలి. 

అప్ లోడ్ చేయాల్సినవి…

  • నీట్ యూజీ ర్యాంక్ కార్డు - 2024
  • పదో తరగతి మార్కుల మెమో
  • ఇంటర్ మార్కుల మెమో
  • స్టడీ సర్టిఫికెట్లు
  • టీసీ
  • కుల ధ్రువీకరణ పత్రం
  • ఆధార్ కార్డు
  • లేటెస్ట్ పాస్ ఫొటోలు
  • అభ్యర్థి సంతకాన్ని కూడా అప్ లోడ్ చేయాలి.

మరోవైపు పీజీ డెంటల్‌ సీట్ల భర్తీకి కూడా నోటిఫికేషన్ జారీ అయింది. నీట్‌-ఎండీఎస్‌-2024 పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇవి కూడా ఇవాళ్టి నుంచే ప్రారంభం కానున్నాయి. ఆగస్టు 8వ తేదీతో ఈ గడువు పూర్తి అవుతుంది. https://tsmds.tsche.in వెబ్ సైట్ లోకి ప్రాసెస్ పూర్తి చేసుకోవచ్చు.

Whats_app_banner