DRDO Recruitment: డీఆర్డీఓలో అప్రెంటిస్ పోస్ట్ ల భర్తీ; పోస్ట్ ల సంఖ్య, విద్యార్హతలు.. ఇతర వివరాలు
DRDO Recruitment 2024: డీఆర్డీఓ నుంచి మరో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వెలువడింది. సంస్థలో అప్రెంటిస్ పోస్టులకు భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ ను జారీ చేసింది. పోస్ట్ ల సంఖ్య, విద్యార్హతలు.. ఇతర వివరాలను అభ్యర్థులు ఇక్కడ తెలుసుకోవచ్చు.
DRDO Recruitment 2024: డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హులైన అభ్యర్థులు డీఆర్డీఓ (DRDO) అధికారిక వెబ్సైట్ drdo.gov.in ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్ మెంట్ డ్రైవ్ ద్వారా సంస్థలో 200 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. సెప్టెంబర్ 24న ప్రారంభమైన రిజిస్ట్రేషన్ ప్రక్రియ పత్రికలో ప్రకటన వెలువడిన 21 రోజుల తర్వాత ముగుస్తుంది. అర్హత, ఎంపిక విధానం, ఇతర వివరాల కోసం కింద చదవండి.
ఖాళీల వివరాలు
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్: 40 పోస్టులు
టెక్నీషియన్ అప్రెంటిస్ (డిప్లొమా): 40 పోస్టులు
ట్రేడ్ అప్రెంటిస్ ఐటీఐ ఉత్తీర్ణత (ఎన్సీవీటీ/ ఎస్సీవీటీ అఫిలియేషన్): 120 పోస్టులు
అర్హత ప్రమాణాలు
విద్యార్హతలు
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్: బీఈ/బీటెక్ (ఈసీఈ, ఈఈఈ, సీఎస్ ఈ, మెకానికల్, కెమికల్)
టెక్నీషియన్ అప్రెంటిస్ (డిప్లొమా): డిప్లొమా ఇన్ (ఈసీఈ, ఈఈఈ, సీఎస్ ఈ, మెకానికల్, కెమికల్)
ట్రేడ్ అప్రెంటిస్ ఐటీఐ ఉత్తీర్ణత (ఎన్ సీవీటీ/ ఎస్సీవీటీ అనుబంధం): ఫిట్టర్, వెల్డర్, టర్నర్, మెషినిస్ట్, మెకానిక్-డీజిల్, ఎలక్ట్రానిక్స్-మెకానిక్, ఎలక్ట్రీషియన్, కోపా (కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్)
వయోపరిమితి
ఆగస్టు 1, 2024 నాటికి 18 ఏళ్ల లోపు ఉండాలి.
అర్హత పరీక్షలు
(2022, 2023, 2024 సంవత్సరాల్లో గ్రాడ్యుయేట్, డిప్లొమా, ఐటీఐ ట్రేడ్ అప్రెంటీస్) పూర్తి చేసిన రెగ్యులర్ అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
ఎంపిక విధానం
డాక్యుమెంట్ల సంతృప్తికరమైన వెరిఫికేషన్ కు లోబడి అకడమిక్ మెరిట్/ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులకు దరఖాస్తులో పేర్కొన్న ఈ-మెయిల్ ద్వారా సమాచారం అందిస్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్/జాయినింగ్ సమయంలో అభ్యర్థులు డాక్యుమెంట్ల ఒరిజినల్, సెల్ఫ్ అటెస్టెడ్ కాపీలను తీసుకురావాల్సి ఉంటుంది.
ఇతర వివరాలు
బీఈ/ B.Tech/ డిప్లొమా అభ్యర్థులు, ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్ లు నాట్స్ 2.0 పోర్టల్ https://nats.education.gov.in లేదా https://apprenticeshipindia.org నమోదు చేసుకోవడం తప్పనిసరి. మరిన్ని వివరాలకు అభ్యర్థులు డీఆర్డీవో అధికారిక వెబ్సైట్ ను చూడవచ్చు.