Ordnance Factory Apprentice : ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో 361 ఖాళీలు, ఈ నెల 25న సంగారెడ్డి ఐటీఐలో అప్రెంటిస్ మేళా నిర్వహణ
Ordnance Factory Apprentice : మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ లో 361 ట్రేడ్ అప్రెంటీస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 25న సంగారెడ్డి ఐటీఐ కాలేజీలో నిర్వహించి ట్రేడ్ అప్రెంటిస్ మేళాకు హాజరుకావాలని ఆ కాలేజీ ప్రిన్సిపాల్ తెలిపారు.
![ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో 361 ఖాళీలు, ఈ నెల 25న సంగారెడ్డి ఐటీఐలో అప్రెంటిస్ మేళా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో 361 ఖాళీలు, ఈ నెల 25న సంగారెడ్డి ఐటీఐలో అప్రెంటిస్ మేళా](https://images.hindustantimes.com/telugu/img/2024/09/24/400x225/jobs_1727197057859_1727197057989.webp)
Ordnance Factory Apprentice : ఐటీఐ పూర్తి చేసి ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతీయువకులకు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెదక్ (OFMK) మంచి అవకాశాన్ని కల్పించింది. ఈ పరిశ్రమ సంగారెడ్డి జిల్లా కంది మండలం ఎద్దుమైలారంలో ఉంది. సంగారెడ్డిలోని ఐటీఐలో ఈ నెల 25 న ట్రేడ్ అప్రెంటిస్ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ రాజేశ్వర్ తెలిపారు. ఇక్కడ అప్రెంటిస్ పూర్తి చేసిన వారికీ మంచి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుందన్నారు.
ఆసక్తి ఉన్న అభ్యర్థులు 25 సెప్టెంబర్ 2024 ఉదయం 8:30 గంటలకు ఇంటర్వ్యూకు హాజరు కావాలని తెలిపారు. ఈ ఎంపిక ప్రక్రియ సంగారెడ్డి గవర్నమెంట్ ITI ప్రాంగణంలో నిర్వహించనున్నారు. ఈ ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులు 10వ తరగతి సర్టిఫికేట్, ITI ట్రేడ్ పాస్ సర్టిఫికెట్, కుల ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డుతో పాటు 3 పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు వెంట తీసుకరావాలని సూచించారు.
మొత్తం 361 పోస్టులు
ఈ అప్రెంటిస్ మేళాలో మొత్తం 361 మందిని ఎంపిక చేయాలనీ అధికారులు సూచించారు. ఈ నియామక ప్రక్రియలో ఎలక్ట్రిషియన్ పోస్టులు 36, ఎలక్ట్రానిక్ మెకానిక్ 20, ఫిట్టర్ (జనరల్) 103, ఫౌండ్రీమాన్ 10 వంటి విభాగాల్లో పోస్టులు ఉన్నాయి. ఇతర విభాగాల్లో మాచినిస్ట్ 30, మిల్రైట్ 15, మౌల్డర్ 4, గ్రైండర్ 8, హీట్ ట్రీట్‌మెంట్ 2, స్టెనోగ్రాఫర్ & సెక్రెటరీ అసిస్టెంట్ 3 ఖాళీలు ఉన్నాయి. అదనంగా, పెయింటర్ 3, టర్నర్ 15, డ్రాఫ్ట్స్‌మన్ (సివిల్) 2, వెల్డర్ (G&E) 30, మోటార్ మెకానిక్ 3, డీజిల్ మెకానిక్ 3, COPA అప్రెంటిస్ 17, 10వ తరగతి ఉతీర్ణత సాధించిన వారికీ అన్ని ట్రేడ్ లలో కలిపి మొత్తం 50 ఖాళీలు ఉన్నాయి.
ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆయుధ కర్మాగారంలో అప్రెంటిస్ చేసే అవకాశాన్ని అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలి. అభ్యర్థులు అవసరమైన ధ్రువ పత్రాలను తీసుకొని, మేళాకు సకాలంలో చేరుకోవాలి. ఇక్కడ అప్రెంటిస్ విజయవంతంగా పూర్తి చేస్తే మంచి ఉద్యోగాలు సాధించే అవకాశం ఉంటుంది.
పటాన్ చెరు ఐటీఐలో అడ్మిషన్ల దరఖాస్తులు
పటాన్ చెరు ప్రభుత్వ ఐటీఐలో అడ్మిషన్ ల నోటిఫికేషన్ జారీ చేసినట్లు ఐటీఐ ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు తెలిపారు. ఐటీఐ అడ్మిషన్ ల కోసం అభ్యర్థులు సెప్టెంబర్ 23 నుంచి 28 వరకు ఆన్లైన్ లో దరఖాస్తులు చేసుకోవాలని తెలిపారు. ఆసక్తి గల వారు పదో తరగతి సర్టిఫికెట్, టీసీ, ఆధార్ తో ఫోటో స్కాన్ చేసి అప్లోడ్ చేయాలని తెలిపారు. వాక్ ఇన్ అడ్మిషన్ కోసం ఈ నెల 25 నుంచి 28 వరకు ఉదయం 11 గంటల లోపు ప్రభుత్వ, ప్రైవేట్ ఐటిఐ లో వారి ఒరిజినల్ సర్టిఫికెట్ తీసుకొని హాజరు కావాలని తెలిపారు. ఆసక్తి గల వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు తెలిపారు.
సంబంధిత కథనం