Canara Bank Apprentice Posts : కెనరా బ్యాంక్ లో 3000 అప్రెంటిస్ పోస్టులు, నేటి నుంచి రిజిస్ట్రేషన్ ప్రారంభం-canara bank recruitment 3000 apprentice posts online application process ap tg vacancies ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Canara Bank Apprentice Posts : కెనరా బ్యాంక్ లో 3000 అప్రెంటిస్ పోస్టులు, నేటి నుంచి రిజిస్ట్రేషన్ ప్రారంభం

Canara Bank Apprentice Posts : కెనరా బ్యాంక్ లో 3000 అప్రెంటిస్ పోస్టులు, నేటి నుంచి రిజిస్ట్రేషన్ ప్రారంభం

Bandaru Satyaprasad HT Telugu
Sep 21, 2024 04:27 PM IST

Canara Bank Apprentice Posts : కెనరా బ్యాంక్ లో 3000 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన అభ్యర్థులు ఇవాళ్టి నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. అక్టోబర్ 4వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. ఏపీలో 200, తెలంగాణలో 120 ఖాళీలున్నాయి.

కెనరా బ్యాంక్ లో 3000 అప్రెంటిస్ పోస్టులు, నేటి నుంచి రిజిస్ట్రేషన్ ప్రారంభం
కెనరా బ్యాంక్ లో 3000 అప్రెంటిస్ పోస్టులు, నేటి నుంచి రిజిస్ట్రేషన్ ప్రారంభం

Canara Bank Apprentice Posts : కెనరా బ్యాంక్ 3000 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. కెనరా బ్యాంక్ అప్రెంటిస్ పోస్టుల దరఖాస్తుకు నేటి(సెప్టెంబర్ 21) నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం అయ్యింది. గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు కెనరా బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ canarabank.comలో రిజిస్ట్రేషన్ లింక్ ను కనుగొనవచ్చు. అర్హత గల అభ్యర్థులు కెనరా బ్యాంక్‌లో అప్రెంటిస్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకునే ముందు అప్రెంటిస్‌షిప్ పోర్టల్, www.nats.education.gov.in లో నమోదు చేసుకోవాలి. అప్రెంటిస్‌షిప్ పోర్టల్‌లో పూర్తి ప్రొఫైల్ ఉన్న అభ్యర్థులు మాత్రమే కెనరా బ్యాంక్ అప్రెంటిస్ పోస్టుల దరఖాస్తుకు అర్హులు. NATS పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ సెప్టెంబర్ 18, 2024న ప్రారంభమైంది.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే ముందు, అభ్యర్థులు తమ ఫొటో, సంతకం, ఎడమ బొటనవేలు ముద్ర, చేతితో రాసిన డిక్లరేషన్‌ను స్కాన్ చేయాలి. ఈ వివరాలన్నీ సరిగ్గా స్కాన్ చేయాలి. స్మడ్జ్ లేదా బ్లర్ చేయకూడదు.

ముఖ్యమైన తేదీలు :

  • జాతీయ అప్రెంటిస్ పోర్టల్ రిజిస్ట్రేషన్ - సెప్టెంబర్ 18వ తేదీ నుంచి
  • కెనరా బ్యాంక్ అప్రెంటిస్ పోస్టుల రిజిస్ట్రేషన్ మొదలు -సెప్టెంబర్ 21
  • దరఖాస్తుకు చివరి తేదీ - అక్టోబర్ 4

కెనరా బ్యాంక్ అప్రెంటీస్ రిక్రూట్‌మెంట్ 2024: ఎలా దరఖాస్తు చేసుకోవాలి.

అభ్యర్థులు కెనరా బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ కోసం ఈ కింది దశలను అనుసరించండి.

  • కెనరా బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్‌ canarabank.com పై క్లిక్ చేయండి.
  • హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న కెరీర్ లింక్‌పై క్లిక్ చేయండి.
  • తదుపరి పేజీలో అందుబాటులో ఉన్న అప్రెంటిస్ లింక్‌పై క్లిక్ చేయండి.
  • రిజిస్ట్రేషన్ లింక్ అందుబాటులో ఉన్న కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
  • లింక్‌పై క్లిక్ చేసి, రిజిస్ట్రేషన్ ఐడీ, ఇతర వివరాలను నింపండి.
  • దరఖాస్తు ఫారమ్‌లో వివరాలు నింపి, దరఖాస్తు రుసుము చెల్లించండి.
  • సబ్మిట్ పై క్లిక్ చేసి, పేజీని డౌన్‌లోడ్ చేయండి.
  • తదుపరి అవసరం కోసం అప్లికేషన్ హార్డ్ కాపీని భద్రపరుచుకోండి.

జనరల్, బీసీ అభ్యర్థులందరికీ దరఖాస్తు రుసుము రూ. 500. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీటీ కేటగిరీ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంది. డెబిట్ కార్డ్‌లు (రూపే/ వీసా/ మాస్టర్ కార్డ్/ మాస్ట్రో), క్రెడిట్ కార్డ్‌లు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఐఎంపీఎస్, క్యాష్ కార్డ్‌లు లేదా మొబైల్ వాలెట్‌లను ఉపయోగించి ఫీజు చెల్లించవచ్చు. మరిన్ని వివరాల కోసం, అభ్యర్థులు కెనరా బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.

దేశం వ్యాప్తంగా 3000 అప్రెంటిస్ పోస్టులు భర్తీ చేయనున్నారు. ఏపీలో 200, తెలంగాణలో 120, కర్ణాటకలో 600 పోస్టులను భర్తీ చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు నెలవారీ రూ.15,000 స్టైఫండ్ అందిస్తారు. ఇందులో రూ. 10,500 కెనరా బ్యాంక్, రూ. 4,500 కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (డిబిటి) ద్వారా అందిస్తుంది. అప్రెంటిస్‌ లకు అదనపు అలవెన్సులు లేదా ప్రయోజనాలు ఉండవు.

అర్హతలు

అభ్యర్థులు తప్పనిసరిగా ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ పూర్తి చేయాలి. లేదా కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన సమానమైన అర్హత కలిగి ఉండాలి.

వయోపరిమితి

అభ్యర్థుల వయోపరిమితి 20-28 సంవత్సరాల మధ్య ఉండాలి. సెప్టెంబర్ 1, 1996 నుంచి సెప్టెంబర్ 1, 2004 మధ్య జన్మించి ఉండాలి.

ఎంపిక విధానం

అభ్యర్థులను మెరిట్ జాబితా ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేస్తారు. దరఖాస్తుదారులకు టెన్త్, ఇంటర్ లేదా డిప్లొమా పరీక్షలో వచ్చిన మార్కులను పరిగణనలోకి తీసుకుని మెరిట్ జాబితా తయారు చేస్తారు. రాష్ట్రాల వారీగా ఈ జాబితా సిద్ధం చేస్తారు. అనంతరం సర్టిఫికెట్ల వెరిఫికేషన్, లోకల్ లాంగ్వేజ్ ప్రావీణ్యత పరీక్ష ద్వారా ఫైనల్ లిస్ట్ ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు ఏడాది పాటు బ్యాంకింగ్ రంగంపై శిక్షణతో పాటు నెలకు రూ.15 వేల స్టైఫండ్ ఇస్తారు.

సంబంధిత కథనం