Suicide in Bus: తిరుపతిలో విషాదం, ఆర్టీసీ బస్సుల్లో ఆత్మహత్య చేసుకున్న యువకుడు..
Suicide in Bus: తిరుపతిలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న యువకుడు బస్సు సీలింగ్ రాడ్డుకు ఉరేసుకున్నాడు. బస్సుల్లో ముగ్గురు ప్రయాణికులు మాత్రమే ఉండటంతో ఆత్మహత్య చేసుకోవడాన్ని ఎవరు గుర్తించలేదు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Suicide in Bus: ఏం కష్టం వచ్చిందో కానీ కదులుతున్న బస్సులో యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తిరుపతి జిల్లాలో చోటుచేసుకుంద. బస్సులో ప్రయాణికుల ఎక్కువగా లేకపోవడంతో వెనుక సీట్లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆదివారం ఉదయం రేణిగుంట ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. మృతి చెందిన యువకుడికి సంబంధించిన ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
నడిచే బస్సులో యువకుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తిరుపతి జిల్లాలో చోటు చేసుకుంది. ఆదివారం ఉదయం సుమారు 27 ఏళ్ల వయసున్న యువకుడు ఏర్పేడు మండలం మేర్లపాక వద్ద శ్రీకాళహస్తి-తిరుపతి ఆర్డినరీ ఆర్టీసీ బస్సు ఎక్కి తిరుపతి వెళ్లేందుకు టికెట్ కొనుగోలు చేశాడు.
ఆ సమయంలో బస్సులో డ్రైవర్, కండక్టర్‌తో పాటు మరో ముగ్గురు ప్రయాణికులు మాత్రమే ఉన్నారు. అప్పటికే బస్సులో ఉన్న వారంతా ముందు సీట్లలో కూర్చున్నారు. మేర్లపాకలో ఎక్కిన యువకుడు వెనక్కి వెళ్లి కూర్చు న్నాడు. బస్సు గుత్తివారిపల్లె సమీపంలోకి చేరుకునే సమయానికి కండక్టర్ వెనక్కి తిరిగి చూడడంతో ఆత్మహత్మ వెలుగు చూసింది.
బస్సు మధ్యలో నిలబడి ప్రయాణించే వారు పట్టుకునే ఇనుప కడ్డీకి యువ కుడు ఉరేసుకున్నాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో వారు వచ్చి పరిశీలించారు. మృతుడు తన వెంట తెచ్చుకున్న ప్లాస్టిక్ వైరుతో ఆత్మహత్యకు పాల్పడినట్లు గుర్తించారు. మృతి చెందిన యువకుడికి సంబంధించిన ఎలాంటి వివరాలు లభించలేదు. బస్సు ఎక్కిన తర్వాత అనంతపురానికి వెళ్లాలని చెప్ప డంతో ఆ ప్రాంతానికి సంబంధించినవాడు కావచ్చని భావిస్తున్నారు. ఒంటిపై బ్లూ టీషర్ట్, నలుపు రంగు ప్యాంటు ధరించాడని పోలీసులు తెలిపారు. రేణిగుంట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.