Karthika Deeapam 2 November 25: శౌర్య కొత్త పిలుపు.. అవాక్కైన కార్తీక్.. శివన్నారాయణ మీటింగ్ ప్లాన్-karthika deeapam 2 today november 25th episode karthik deepa surprises with shourya and shivanarayana plans meeting ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Karthika Deeapam 2 November 25: శౌర్య కొత్త పిలుపు.. అవాక్కైన కార్తీక్.. శివన్నారాయణ మీటింగ్ ప్లాన్

Karthika Deeapam 2 November 25: శౌర్య కొత్త పిలుపు.. అవాక్కైన కార్తీక్.. శివన్నారాయణ మీటింగ్ ప్లాన్

Chatakonda Krishna Prakash HT Telugu
Nov 25, 2024 07:26 AM IST

Karthika Deeapam 2 Today November 23 Episode: కార్తీక దీపం 2 నేటి ఎపిసోడ్‍లో.. కార్తీక్‍ను శౌర్య కొత్తగా పిలుస్తుంది. దీంతో కార్తీక్‍, దీప ఆశ్చర్యపోతారు. కాంచన, అనసూయ మధ్య కూడా పిలుపు మారుతుంది. శివన్నారాయణ మీడింగ్ నిర్వహించాలని ప్లాన్ చేస్తాడు. నేటి ఎపిసోడ్‍లో పూర్తిగా ఏం జరిగిందో ఇక్కడ చూడండి.

Karthika Deeapam 2 November 25: శౌర్య కొత్త పిలుపు.. అవాక్కైన కార్తీక్.. శివనారాయణ మీటింగ్ ప్లాన్
Karthika Deeapam 2 November 25: శౌర్య కొత్త పిలుపు.. అవాక్కైన కార్తీక్.. శివనారాయణ మీటింగ్ ప్లాన్

కార్తీక దీపం 2 నేటి (నవంబర్ 25) ఎపిసోడ్‍లో ఏం జరిగిందంటే.. దాసు తనకు అసలు విషయం చెప్పకపోయే సరికి కాశీ ఆలోచిస్తాడు. దీంతో మామయ్య సరిగా అర్థం కారని కాశీ భార్య దిల్లు అంటుంది. “మా నాన్న పైకి కనిపించేంత తేలికైన మనిషి కాదు దిల్లు. చాలా లోతైన మనిషి” అని కాశీ అంటాడు. అంత లోతుగా ఆలోచించాల్సిన అవసరం మామయ్యకు ఏముంటుందని దిల్లు అంటుంది. నాన్న ఎవరినో వెతుకుతున్నారని, ఆయనతో నాన్న గత జీవితానికి సంబంధం ఉంటుందని కాశీ అంటాడు. ఎప్పుడూ చేతిలో ఓ డ్రాయింగ్ ఉంటుందని అంటాడు.

శివన్నారాయణకు బాధ చెప్పుకున్న సుమిత్రి

రెస్టారెంట్‍లో గొడవ సమయంలో కార్తీక్‍ను కొట్టబోతే దీప అడ్డుకున్న విషయాన్ని శివన్నారాయణ మళ్లీ తలుచుకుంటాడు. ఆ విషయాన్నే ఆలోచిస్తుంటాడు. ఇంతలో ఆయన దగ్గరికి సుమిత్రి వచ్చి బాధపడుతుంది. కార్తీక్‍కు దీపతో పెళ్లయిన దగ్గరి నుంచి రాత్రివేళ కూడా జ్యోత్స్న రూమ్‍లో లైట్ వెలుగుతూనే ఉంటుందని చెబుతుంది. జ్యోత్స్న నిద్రపోకుండా బాధపడుతోందని, ఏదో ఒకటి చేయాలని అడుగుతుంది. కోరుకున్న వాడిని చేసుకునే అదృష్టం జ్యోత్స్నకు లేకుండా పోయిందని, త్వరగా వేరే సంబంధం చూసి ఫారిన్‍కు పంపాలని, అలా అయితే ఇక్కడి విషయాలు మర్చిపోతుందని అనుకుంటున్నానని శివన్నారాయణను సుమిత్రి అడుగుతుంది. అయితే జ్యోత్స్న తన ఇష్టం అంటోందని, ఏం చేయాలో అర్థం కావడం లేదని బాధపడుతుంది.

మీటింగ్ పెట్టాలని శివన్నారాయణ ప్లాన్

విశ్వనాథ్ సంబంధం వద్దనుకున్నంత మాత్రనా నీ కూతురికి పెళ్లే జరగదని అనుకుంటున్నావా అని సుమిత్రితో శివన్నారాయణ చెబుతాడు. తాను కూడా జ్యోత్స్న గురించి ఆలోచిస్తున్నా, ఏం చేసినా ఆమెకు మంచి జరగడంతో పాటు కుటుంబ గౌరవం పెరగాలని అంటాడు. అయితే జ్యోత్స్న ఎప్పుడు ఏం చేస్తుందోనని భయం అని సుమిత్రి అంటే.. తాను ఓ నిర్ణయం తీసుకున్నానని శివన్నారాయణ అంటాడు. దశరథను పిలిచి.. రేపు ఆఫీస్‍లో బోర్డ్ మీటింగ్ ఉందని, అందరికీ మెయిల్ పంపాలని అడుగుతాడు. ఏంటి సడెన్‍గా అని దశరథ అంటే.. కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందని శివన్నారాయణ చెబుతాడు. ఇంకా ఆలస్యం చేయకుండా అందరికీ సమాచారం పంపాలని అంటాడు. నాన్న నీతో ఏమైనా చెప్పారా అని సుమిత్రిని దశరథ్ అడుగుతాడు. ఏమీ చెప్పలేదని, తానే జ్యోత్స్న గురించి చెప్పానని సుమిత్రి అంటుంది. జ్యోత్స్నకు ఈ మీటింగ్‍కు సంబంధం ఏంటని దశరథ్ ఆలోచిస్తాడు.

కార్తీక్, దీప కోసం కాంచన ప్రణాళిక

డైనింగ్ టేబుల్ వద్దకు కార్తీక్ వస్తాడు. మిగిలిన వారిని కూడా పిలిస్తే కలిసి తిందామని దీపతో కార్తీక్ అంటాడు. కాంచన, అనసూయ ముందుగానే తినేశారని దీప అంటుంది. శౌర్యను కూడా పక్కకు తీసుకొచ్చి తినిపిస్తుంటూ మాటలు చెబుతుంటారు కాంచన, అనసూయ. అక్కడి నుంచే కార్తీక్, దీపను చూస్తుంటారు. అమ్మానాన్నలతో భోజనం చేసే దాన్ని కదా అని శౌర్య అంటే.. వాళ్లద్దరికీ స్పేస్ ఇవ్వాలని కాంచన చెబుతుంది. స్పేస్ ఇస్తే ఏమవుతుందని శౌర్య అడుగుతుంది.

కలిసి భోజనం చేద్దామని కార్తీక్ అడిగితే తర్వాత తింటానని దీప అంటుంది. ఈ మాటతో అనసూయ నొచ్చుకుంటుంది. దీప మనసు మారదా అంటూ శౌర్యతో అనసూయ అంటుంది. కార్తీక్‍కు పోలమారడంతో తలపై కొట్టేందుకు ప్రయత్నించి ఆగిపోతుందని దీప.

అమ్మగారు అని పిలవొద్దు

తనను అమ్మ అని పిలవొద్దని, చెల్లి అనాలని అనసూయతో కాంచన అంటుంది. నా కొడుకు కంటే నీ కొడుకు పెద్దోడు అని అంటుంది. మీ స్థాయికి నన్ను అక్కా అంటే బాగోదమ్మా అని అనసూయ చెబుతుంది. నేను పిలుస్తానంటే నీకేమైంది అని కాంచన అంటుంది. నీ మేనకోడులు నా ఇంటి కోడలు అయినప్పుడు ఇద్దరిదీ ఒకే స్థాయి అని చెబుతుంది. చెల్లి అనలేనని అనసూయ అంటే.. చెల్లెమ్మ అని అయినా పిలవాలని అడుగుతుంది. దీంతో చెల్లెమ్మా అని కాంచనను అనసూయ అంటుంది.

కలిసి భోజనం చేసిన కార్తీక్, దీప

నా పుట్టిన రోజున చాలా వంటలు చాలా చేసినట్టున్నావ్, అయినా బాగోలేవని దీపతో కార్తీక్ అంటాడు. దీంతో కాంచన, అనసూయ, శౌర్య కూడా ఆశ్చర్యపోతారు. ఏం తగ్గిందని దీప అడిగితే.. ప్రేమ తగ్గిందని కార్తీక్ అంటాడు. ఎవరూ లేనట్టు ఒంటరిగా తినాల్సి వస్తుందని ఫీల్ అవుతాడు. మనసు సంతోషంగా లేనప్పుడు కూరలో ఉప్పు ఉన్నా లేకున్నా ఒకటే అని అంటాడు. దీంతో దీపనే కార్తీక్‍తో కలిసి తినేందుకు కూర్చుంటుంది. దీంతో తమ ప్లాన్ వర్కౌట్ అవడంతో కాంచన, అనసూయ సంతోషిస్తారు. కార్తీక్ కూడా సంతోషంగా నవ్వుకుంటాడు. ఇద్దరూ కలిసి తింటారు.

కార్తీక్, దీప ఇద్దరూ వంటల గురించి, రుచి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. దీంతో భార్యభర్తలు మాట్లాడుకుంటున్నట్టు లేదని, రెస్టారెంట్ ఓనర్, చెఫ్ మాట్లాడుకుంటున్నట్టు ఉందని కాంచన అంటుంది. చెఫ్ అంటే వంట కుక్కా చెల్లెమ్మ అని అనసూయ అంటే.. అదే వంటలక్క అంటూ బదులిస్తుందని కాంచన. మంచి వంటలు వండినందుకు దీపకు థ్యాంక్స్ చెబుతాడు కార్తీక్. దీంతో మొగుడుపెళ్లాళ్లా మారిపోయారని అనసూయ అంటుంది. వంటలు అద్భుతంగా ఉన్నాయని కార్తీక్.. అంటే దీప సిగ్గుపడుతుంది. దీంతో అనసూయ సంతోషిస్తుంది. కార్తీక్ పుట్టిన రోజున వాళ్లను సంతోషంగా ఉంచాలనుకుంటే.. వాళ్లిద్దరూ కలిసి తమను సంతోషంగా ఉంచుతున్నారని కాంచన అంటుంది.

కార్తీక్‍ను నాన్న అని పిలవొద్దన్న శౌర్య

ఈ సంతోషం ఇలాగే ఉండాలంటే ఓ పని చేయాలని కాంచన అంటుంది. అమ్మానాన్న కలిసి ఉండాలంటే నువ్వో పని చేయాలని శౌర్యకు చెబుతుంది. కార్తీక్‍ను నాన్న అని పిలవొద్దని అంటుంది. నాన్న అని కాకుండా కార్తీక్ అని పిలవాలని అంటుంది. ఎందుకని శౌర్య ప్రశ్నిస్తుంది. గీత వాళ్ల అమ్మానాన్న లాగే.. మీ అమ్మానాన్న కలిసి ఉండాలని లేదా అని కాంచన అడిగితే.. ఉంది అని శౌర్య చెబుతుంది. నువ్వు మీ నాన్నను కార్తీక్ అని పిలవాలని శౌర్యతో కాంచన అంటుంది. దీప చెప్పినట్టుగా అంటుంది. కార్తీక్‍ను కార్తీక్ అని పిలవాలని, ఈ విషయం ఎవరికీ చెప్పకూడదని శౌర్యతో చెబుతుంది. ఎవరి ప్లేట్ వారే కడుక్కోవాలని కార్తీక్ అంటాడు. మరోసారి దీపకు థ్యాంక్స్ చెబుతాడు కార్తీక్.

మీ అన్నయ్య రన్నింగ్ చేయిస్తున్నాడు

మేడ మీదికి వెళ్లి నడుస్తూ దీపతో కబుర్లు చెప్పొచ్చు కదా అని కార్తీక్‍తో కాంచన అంటుంది. “దీంతో మీ అన్నయ్య రన్నింగ్ చేయిస్తున్నాడు. మామయ్య మెయిల్ చేశాడు. రేపు బోర్డు మెంబర్లతో మీటింగ్ ఉందంట” అని కార్తీక్ అంటాడు. నువ్వు వెళ్లాలా అని కాంచన అంటే.. సీఈవోను కదా తప్పకుండా వెళ్లాలి అని అంటాడు కార్తీక్.

కార్తీక్‍కు దీప సలహా

కానీ ఇష్టం లేదని, ఇంత జరిగిన తర్వాత కలిసి వ్యాపారం చేయడం కష్టమని కార్తీక్ చెబుతాడు. సొంతంగా వ్యాపారం చేయాలనుకుంటున్నానని కార్తీక్ అంటే.. వాళ్లు చెప్పిన తర్వాత మీ మనసుకు నచ్చినదని చేయాలని కాంచన సూచిస్తుంది. అయితే, మీ మనసుకు నచ్చినది కాదని, మీ తాతయ్య మనసుకు నచ్చింది చేయాలని, అప్పుడు ఆయన మనసు ప్రశాంతం ఉంటుందని కార్తీక్‍కు దీప సలహా ఇస్తుంది. ఎంతైనా మీరూమీరు బంధువులు కదా, ఎప్పటికైనా కలవాల్సిందే కదా అని దీప అంటుంది. 

శౌర్య పిలుపుతో అవాక్కైన కార్తీక్, దీప

కార్తీక్‍ను నాన్న అని కాకుండా కార్తీక్ అని శౌర్య పిలుస్తుంది. దీంతో కార్తీక్ అని పిలుస్తుందేంటని దీప ఆశ్చర్యపోతుంది. కార్తీక్ కూడా అవాక్కవుతాడు. “కార్తీక్ ఏంటీ రౌడీ” అంటూ అంటాడు. కార్తీక్ అంటే కార్తీకే అని శౌర్య అంటుంది. రేపు నేను స్కూల్‍కు వెళ్లాలి, ఎవరు తీసుకుకెళతారు, అమ్మ తీసుకెళుతుందా కార్తీక్ అని శౌర్య అంటుంది. “దీనికేమైంది.. నాన్న అని పిలువడం మానేసి.. కార్తీక్ అని పిలుస్తుందేంటి. దీప అలా పిలవమందా. దీప ముందు అడిగితే బాగోదులే” అని మనసులో కార్తీక్ అనుకుంటాడు. మీటింగ్ ఉందని కార్తీక్ అంటే.. దారిలోనే కదా కాంచన చెబుతుంది.

సీక్రెట్ మీషన్ నడుస్తోందా

ఏమంటావ్ అక్కా అని అనసూయతో కాంచన అంటుంది. నువ్వన్నది కరెక్టే చెల్లెమ్మ అని అనసూయ బదులిస్తుంది. వీరిద్దరూ కూడా కొత్తగా పిలుచుకోవడంతో దీప మళ్లీ ఆశ్చర్యపోతుంది. “రౌడీ ఏమో కార్తీక్ అంటుంది. అమ్మ ఏమో అనసూయను అక్కా అంటోంది. అనసూయ ఏమో చెల్లెమ్మ అంటుంది. ఇదంతా చూస్తుంటే ఏదో సీక్రెట్ మిషన్ నడుస్తున్నట్టు అనిపిస్తుంది. ఎవరినీ అడగకుండా సైలెంట్‍గా ఏం చేయబోతున్నారో పరిశీలించడం మంచిది” అని మనసులో అనుకుంటాడు కార్తీక్. శౌర్య కూడా కార్తీక్ అర్థమైందా అని అంటుంది. కొత్త పిలుపులతో దీప అలా చూస్తుంటుంది.

కాంచనను చెల్లెమ్మ అని అంటున్నావేంటనే అనసూయను దీప ప్రశ్నిస్తుంది. నేనే అలా పిలవాలని చెప్పానని, తనకు అభ్యంతరం లేదనని కాంచన అంటుంది. ఇవి పిలుపు కాదని, బంధాలు అని, దేవుడు నీ వల్ల దేవుడు ముడివేసిన బంధాలు అని దీపతో అనసూయ చెబుతుంది. పుట్టిన బిడ్డను తల్లి అమ్మా అనొద్దని అంటే ఎంత అసహ్యంగా ఉంటుందో, తాళి కట్టిన భర్తను పరాయి వాడిలా చూసినా అంతే అసహ్యంగా ఉంటుందని దీపకు హితబోధ చేస్తుంది అనసూయ. నలుగురితో బంధాలు కలుపుకొని ముందుకు సాగని పెద్దలు చెప్పిన మాటను పాటిస్తున్నామని, నువ్వు కూడా అలాగే చేయాలని దీపతో అనసూయ అంటుంది. శౌర్యను కూడా అలా పిలవాలని మీరు చెప్పి ఉంటారని దీప అనుకుంటుంది. “మీరేమో మేమిద్దరం ఒకటి అవడం గురించి ఆలోచిస్తున్నారు. కానీ నేను మళ్లీ రెండు కుటుంబాలు ఎప్పుడు ఒక్కటవుతాయా అని ఆలోచిస్తున్నా. రేపు ఏదో మీటింగ్ ఉందని కార్తీక్ బాబు చెప్పారు కదా” అని దీప అనుకుంటుంది. నన్ను పెళ్లి చేసుకున్నారని కార్తీక్‍పై వాళ్లు కోపంగా ఉన్నారని, రేపు మీటింగ్‍లో ఏం గొడవ జరుగుతుందో అని మనసులో అనుకుంటుంది దీప. దీంతో కార్తీక దీపం 2 నేటి (నవంబర్ 25) ఎపిసోడ్ ముగిసింది.

Whats_app_banner