Canara Bank recruitment: కెనరా బ్యాంక్ లో అప్రెంటిస్ రిక్రూట్మెంట్; 3000 పోస్ట్ లు, అర్హత ఎనీ డిగ్రీ-canara bank to recruit for 3000 apprentice posts registration begins sept 21 ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Canara Bank Recruitment: కెనరా బ్యాంక్ లో అప్రెంటిస్ రిక్రూట్మెంట్; 3000 పోస్ట్ లు, అర్హత ఎనీ డిగ్రీ

Canara Bank recruitment: కెనరా బ్యాంక్ లో అప్రెంటిస్ రిక్రూట్మెంట్; 3000 పోస్ట్ లు, అర్హత ఎనీ డిగ్రీ

Sudarshan V HT Telugu
Sep 20, 2024 02:34 PM IST

కెనరా బ్యాంక్ లో మరో భారీ రిక్రూట్మెంట్ కు తెర లేచింది. మొత్తం 3000 అప్రెంటిస్ పోస్ట్ లను భర్తీ చేయడానికి కెనరా బ్యాంక్ నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు 2024 సెప్టెంబర్ 21వ తేదీ నుంచి కెనరా బ్యాంక్ అధికారిక వెబ్ సైట్ canarabank.com ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.

కెనరా బ్యాంక్ లో అప్రెంటిస్ రిక్రూట్మెంట్
కెనరా బ్యాంక్ లో అప్రెంటిస్ రిక్రూట్మెంట్ (Pradeep Gaur/ Mint)

కెనరా బ్యాంక్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హులైన అభ్యర్థులు కెనరా బ్యాంక్ అధికారిక వెబ్ సైట్ canarabank.com ద్వారా ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్ మెంట్ డ్రైవ్ ద్వారా సంస్థలో 3000 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

లాస్ట్ డేట్ అక్టోబర్ 4..

కెనరా బ్యాంక్ లో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులకు ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు సెప్టెంబర్ 21వ తేదీ నుంచి అక్టోబర్ 4వ తేదీ వరకు కెనరా బ్యాంక్ అధికారిక వెబ్ సైట్ canarabank.com ద్వారా ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే, అర్హత కలిగిన అభ్యర్థులు బ్యాంకులో అప్రెంటిస్ షిప్ కోసం దరఖాస్తు చేయడానికి ముందు అప్రెంటిస్ షిప్ పోర్టల్ www.nats.education.gov.in లో నమోదు చేసుకోవాలి. అప్రెంటిస్ షిప్ పోర్టల్ లో 100% పూర్తి ప్రొఫైల్ ఉన్న అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

అర్హత

కెనరా బ్యాంక్ లో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టు (Apprentice posts) లకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు భారత ప్రభుత్వం గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా విభాగంలో డిగ్రీ (గ్రాడ్యుయేషన్) లేదా కేంద్ర ప్రభుత్వం గుర్తించిన ఏదైనా తత్సమాన అర్హత కలిగి ఉండాలి. వయోపరిమితి అర్హత తేదీ నాటికి 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. అంటే అభ్యర్థులు 01.09.1996 నుంచి 01.09.2004 మధ్య జన్మించి ఉండాలి (రెండు రోజులు కలిపి).

ఎంపిక ప్రక్రియ

అర్హత పరీక్షలో సాధించిన మార్కులు/ శాతం ఆధారంగా రాష్ట్రాల వారీగా మెరిట్ జాబితాను రూపొందిస్తారు. ఆన్ లైన్ దరఖాస్తు సమయంలో అభ్యర్థి సమర్పించిన సమాచారం ఆధారంగా మాత్రమే మెరిట్ జాబితాను రూపొందిస్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రక్రియ సమయంలో సర్టిఫికెట్ల పరిశీలన, స్థానిక భాషలో సామర్ధ్యం పరీక్ష నిర్వహిస్తారు..

దరఖాస్తు ఫీజు

Canara Bank పోస్ట్ లకు అప్లై చేయడానికిి అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ.500 చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది. డెబిట్ కార్డులు (రూపే/ వీసా/ మాస్టర్ కార్డ్/ మాస్ట్రో), క్రెడిట్ కార్డులు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఐఎంపీఎస్, క్యాష్ కార్డులు లేదా మొబైల్ వ్యాలెట్ల ద్వారా అప్లికేషన్ ఫీజు చెల్లించవచ్చు. మరిన్ని వివరాలకు అభ్యర్థులు కెనరా బ్యాంక్ అధికారిక వెబ్సైట్ ను చూడవచ్చు.