RRC NCR Apprentice: రైల్వే రిక్రూట్మెంట్ సెల్ అప్రెంటిస్ ఉద్యోగాలు; అర్హత ఐటీఐ మాత్రమే-rrc ncr apprentice recruitment 2024 apply for 1679 posts at rrcpryjorg ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Rrc Ncr Apprentice: రైల్వే రిక్రూట్మెంట్ సెల్ అప్రెంటిస్ ఉద్యోగాలు; అర్హత ఐటీఐ మాత్రమే

RRC NCR Apprentice: రైల్వే రిక్రూట్మెంట్ సెల్ అప్రెంటిస్ ఉద్యోగాలు; అర్హత ఐటీఐ మాత్రమే

Sudarshan V HT Telugu
Sep 17, 2024 09:04 PM IST

నార్త్ సెంట్రల్ రైల్వే అప్రెంటిస్ పోస్ట్ ల భర్తీకి రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా నార్త్ సెంట్రల్ రైల్వేలోని 1,679 అప్రెంటిస్ పోస్ట్ లను భర్తీ చేయనున్నారు.

ఆర్ఆర్సీ లో అప్రెంటిస్ రిక్రూట్మెంట్
ఆర్ఆర్సీ లో అప్రెంటిస్ రిక్రూట్మెంట్ (HT file)

రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నార్త్ సెంట్రల్ రైల్వే (railway) లో అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హులైన అభ్యర్థులు ఆర్ఆర్సీ ఎన్సీఆర్ అధికారిక వెబ్సైట్ rrcpryj.org ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్ మెంట్ (recruitment) డ్రైవ్ ద్వారా సంస్థలో 1679 పోస్టులను భర్తీ చేయనున్నారు.

లాస్ట్ డేట్, విద్యార్హతలు

నార్త్ సెంట్రల్ రైల్వేలో అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తు చేయడానికి చివరి తేదీ- 2024 అక్టోబర్ 15. గుర్తింపు పొందిన బోర్డు నుంచి కనీసం 50 శాతం మార్కులతో ఎస్ఎస్సీ/ మెట్రిక్యులేషన్/ 10వ తరగతి పరీక్ష లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే, గుర్తింపు పొందిన సంస్థ నుంచి సంబంధిత ట్రేడ్ లో ఐటీఐ పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థుల వయస్సు 15/10/2024 నాటికి 15 ఏళ్లు నిండి ఉండాలి. అలాగే, 15/10/2024 నాటికి 24 ఏళ్లు మించి ఉండకూడదు.

ఎంపిక విధానం

మెట్రిక్యులేషన్ (కనీసం 50% మార్కులతో) పాస్ అయి ఉండాలి. ఐటీఐ పరీక్షలో కూడా ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 10వ తరగతి, ఐటీఐ రెండింటిలోనూ దరఖాస్తుదారులు సాధించిన మార్కుల శాతాన్ని సగటున తీసుకొని, రెండింటికీ సమాన వెయిటేజీ ఇస్తూ మెరిట్ జాబితా రూపొందిస్తారు. ఇలా షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులను డాక్యుమెంట్/ సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు పిలుస్తారు.

దరఖాస్తు ఫీజు

అప్రెంటిస్ పోస్ట్ లకు అప్లై చేసే జనరల్ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ.100/ చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ/మహిళా అభ్యర్థులు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ మొదలైన వాటిని ఉపయోగించి ఆన్ లైన్ లో చెల్లింపు చేయవచ్చు.

ఇతర వివరాలు

చెల్లుబాటు అయ్యే వ్యక్తిగత ఇమెయిల్ ఐడి లేని దరఖాస్తుదారులు ఆన్ లైన్ దరఖాస్తును సబ్మిట్ చేయడానికి ముందు ఒక వ్యక్తిగత ఈ మెయిల్ ఐడీని ఏర్పాటు చేసుకోవాలి. సెలక్షన్ ప్రక్రియ ముగిసే వరకు ఆ ఇమెయిల్ ఐడీ యాక్టివ్ గా ఉండాలి. ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు ఆధార్ నంబర్ / మార్కులు / సీజీపీఏ / డివిజన్లు / వర్క్ షాప్ లు / ట్రేడ్ ప్రాధాన్యతలు వంటి వ్యక్తిగత వివరాలను చాలా జాగ్రత్తగా నింపాల్సి ఉంటుంది, ఎందుకంటే ఆన్ లైన్ దరఖాస్తులో దరఖాస్తుదారుడు నింపిన సమాచారం ఆధారంగా మాత్రమే కంప్యూటరైజ్డ్ మెరిట్ జాబితా తయారు చేస్తారు.