AP ITI Counselling : ఐటీఐల్లో ప్రవేశాలకు రెండో విడత కౌన్సిలింగ్‌, దరఖాస్తులకు జులై 24 చివ‌రి తేదీ-amaravati ap iti colleges admissions second counselling dates announced july 24th last ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Iti Counselling : ఐటీఐల్లో ప్రవేశాలకు రెండో విడత కౌన్సిలింగ్‌, దరఖాస్తులకు జులై 24 చివ‌రి తేదీ

AP ITI Counselling : ఐటీఐల్లో ప్రవేశాలకు రెండో విడత కౌన్సిలింగ్‌, దరఖాస్తులకు జులై 24 చివ‌రి తేదీ

HT Telugu Desk HT Telugu
Jul 01, 2024 05:24 PM IST

AP ITI Counselling : రాష్ట్రంలోని ఐటీఐ కాలేజీల్లో రెండో విడత కౌన్సెలింగ్ కు ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించింది. దరఖాస్తులకు జులై 24 చివరి తేదీ అని అడ్మిష‌న్ల క‌న్వీన‌ర్ తెలిపారు.

ఐటీఐల్లో ప్రవేశాలకు రెండో విడత కౌన్సిలింగ్‌, దరఖాస్తులకు జులై 24 చివ‌రి తేదీ
ఐటీఐల్లో ప్రవేశాలకు రెండో విడత కౌన్సిలింగ్‌, దరఖాస్తులకు జులై 24 చివ‌రి తేదీ

AP ITI Counselling : రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐ కాలేజీల్లో రెండో విడ‌త అడ్మిష‌న్లకు ప్రభుత్వం ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తుంది. 2024 విద్యా సంవ‌త్సరం ప్రవేశాల‌కు సంబంధించి రెండో విడ‌త కౌన్సెలింగ్‌కు ద‌ర‌ఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు అడ్మిష‌న్ల క‌న్వీన‌ర్ జె.శ్రీ‌కాంత్ తెలిపారు. ద‌ర‌ఖాస్తు చేసుకునేంద‌ుకు జులై 24న‌ ఆఖ‌రు తేదీ అని తెలిపారు.

ఐటీఐ ప్రవేశాల్లో ఖాళీగా ఉన్న సీట్లను రెండో విడ‌త‌లో భ‌ర్తీ చేయ‌నున్నారు. అభ్యర్థులు ఏ ఐటీఐలో చేరాల‌నుకుంటున్నారో అదే ఐటీఐలో ద‌ర‌ఖాస్తులు న‌మోదు చేసుకోవాల్సి ఉంటుంది. అనంత‌రం ఆయా జిల్లాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐల్లో ఎక్కడో ఒక చోట దర‌ఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ధ్రువీక‌ర‌ణ పత్రాల‌ను ప‌రిశీల‌న ఉంటుంది. ఏ ఐటీఐలో ధ్రువీక‌ర‌ణ ప‌త్రాలు ప‌రిశీల‌న చేస్తామ‌నేది, ఆయా జిల్లాల్లో ప్రక‌ట‌న చేస్తారు.

ధ్రువీక‌ర‌ణ ప‌త్రాలు ప‌రిశీల‌న పూర్తి చేసిన అభ్యర్థులు మాత్రమే కౌన్సెలింగ్‌లో పాల్గొనేందుకు అర్హుల‌వుతారు. జులై 27, 28 తేదీల్లో ప్రభుత్వ ఐటీఐల‌కు, 29, 30 తేదీల్లో ప్రైవేట్ ఐటీఐల‌కు సంబంధించి ద‌ర‌ఖాస్తు చేసుకున్న ఐటీఐల్లో మాత్రమే కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. ధ్రువీక‌ర‌ణ ప‌త్రాల ప‌రిశీల‌న చేయించుకోలేని వారి పేర్లు మెరిట్ లిస్టులో క‌నిపించ‌వ‌ని అడ్మిష‌న్ల క‌న్వీన‌ర్ జె.శ్రీ‌కాంత్ తెలిపారు. అభ్యర్థులు ఈ విష‌యంలో అశ్రద్ధ చేయ‌రాద‌ని, అప్రమ‌త్తంగా ఉండాల‌ని సూచించారు.

ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐల్లో ఫిట్టర్‌, ఎల‌క్ట్రీషియ‌న్‌, వెల్డర్‌, ప్లంబ‌ర్‌, పెయింట‌ర్ జ‌న‌ర‌ల్, మెషినిస్ట్ గ్రైండ‌ర్‌, డ్రాఫ్టస్‌మెన్ సివిల్‌, మోటార్ మెకానిక్‌, స్టెనోగ్రఫీ, కార్పెంట‌ర్, ఇన్ట్స్రుమెంట్ మెకానిక్‌, ఎల‌క్ట్రోప్లేట‌ర్‌, కంప్యూట‌ర్ హార్డ్‌వేర్ అండ్ నెట్‌వ‌ర్క్ నిర్వహ‌ణ‌ త‌దిత‌ర ట్రేడ్‌లు అందుబాటులో ఉన్నాయి. ఈ ట్రేడుల్లో చేరేందుకు ఎనిమిదో, ప‌దో త‌ర‌గ‌తి అర్హత క‌లిగి ఉండాలి. ద‌ర‌ఖాస్తు చేయాల‌నుకునే అభ్యర్థుల వయ‌స్సు 14 సంవ‌త్సరాలు కంటే త‌క్కువ‌, 25 సంవ‌త్సరాలు కంటే ఎక్కువ వ‌య‌స్సు ఉండ‌కూడ‌దు. అయితే రిజ‌ర్వ్ చేసిన కేట‌గిరీలు, మ‌హిళ అభ్యర్థుల నుండి ద‌ర‌ఖాస్తుదారుల‌కు వ‌య‌స్సు స‌డ‌లింపు ఉంటుంది.

ద‌ర‌ఖాస్తుతో ఆధార్‌, ప‌దో త‌ర‌గ‌తి మార్కులు జాబితా జ‌త చేయాలి. అలాగే ధ్రువ‌ప‌త్రాల ప‌రిశీల‌న‌కు ఎనిమిదో, ప‌దో త‌ర‌గ‌తి మార్కుల జాబితా, కుల ధ్రువీక‌ర‌ణ ప‌త్రం, ఆదాయ ధ్రువీక‌ర‌ణ ప‌త్రం వంటివి ఒరిజన‌ల్ ధ్రువ‌ప్రతాలు, ఆధార్ కార్డు లేదా పాన్ కార్డు, నివాస ధ్రువీక‌ర‌ణ ప‌త్రం, మెడిక‌ల్ స‌ర్టిఫికేట్‌ త‌దిత‌ర స‌ర్టిఫికేట్లు త‌ప్పనిస‌రిగా తీసుకెళ్లాలి. ద‌ర‌ఖాస్తు ఫీజు జ‌న‌ర‌ల్ కేట‌గిరీ అభ్యర్థుల‌కు రూ.250, ఎస్‌సీ, ఎస్‌టీ, ఓబీసీ కేట‌గిరీ అభ్య‌ర్థుల‌కు రూ.150 ఉంటుంది.

జ‌గదీశ్వర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు

Whats_app_banner

సంబంధిత కథనం