Jawahar Navodaya Admissions : జవహర్ నవోదయ సెలక్షన్ ఎగ్జామ్, దరఖాస్తు గడువు సెప్టెంబర్ 23 వరకు పొడిగింపు-jawahar navodaya vidyalaya selection test vi class admission application last date extended sep 23th ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Jawahar Navodaya Admissions : జవహర్ నవోదయ సెలక్షన్ ఎగ్జామ్, దరఖాస్తు గడువు సెప్టెంబర్ 23 వరకు పొడిగింపు

Jawahar Navodaya Admissions : జవహర్ నవోదయ సెలక్షన్ ఎగ్జామ్, దరఖాస్తు గడువు సెప్టెంబర్ 23 వరకు పొడిగింపు

Bandaru Satyaprasad HT Telugu
Sep 17, 2024 04:47 PM IST

Jawahar Navodaya Admissions : నవోదయ విద్యాలయ సమితి (NVS) 6వ తరగతి ప్రవేశాల కోసం జవహర్ నవోదయ విద్యాలయ సెలక్షన్ ఎగ్జామ్ కు దరఖాస్తు చేయడానికి చివరి తేదీని పొడిగించింది. అర్హులైన విద్యార్థులు సెప్టెంబర్ 23వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏపీలో 15, తెలంగాణలో 9 జవహర్ నవోదయ విద్యాలయాలు ఉన్నాయి.

జవహర్ నవోదయ సెలక్షన్ ఎగ్జామ్, దరఖాస్తు గడువు సెప్టెంబర్ 23 వరకు పొడిగింపు
జవహర్ నవోదయ సెలక్షన్ ఎగ్జామ్, దరఖాస్తు గడువు సెప్టెంబర్ 23 వరకు పొడిగింపు

Jawahar Navodaya Admissions : దేశ వ్యాప్తంగా ఉన్న 653 జవహర్‌ నవోదయ విద్యాలయాలలో 6వ తరగతి అడ్మిషన్లకు సంబంధించి 'జవహర్ నవోదయ విద్యాలయ సెలక్షన్ ఎగ్జామ్-2025' దరఖాస్తు గడువు పొడిగించినట్లు నవోదయ విద్యాలయ సమితి ప్రకటించింది. నవోదయ పరీక్ష 2025 జనవరి 18న నిర్వహిస్తారు. రిజల్ట్స్ మార్చి నెలలో విడుదల చేస్తారు. విద్యార్థులు దరఖాస్తు ఫారమ్‌లను సెప్టెంబర్ 23, 2024 వరకు సమర్పించవచ్చు. గతంలో దరఖాస్తు గడువు సెప్టెంబర్ 16 వరకు నిర్ణయించారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు సంబంధించిన అడ్మిషన్ ఫారమ్‌లను navodaya.gov.inలో సబ్మిట్ చేయాలి. ఈ మేరకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ ప్రకటన చేసింది. ఏపీలో 15, తెలంగాణలో 9 జవహర్ నవోదయ విద్యాలయాలు ఉన్నాయి.

దరఖాస్తుకు అవసరమయ్యే పత్రాలు

  • విద్యార్థి ఫొటో
  • విద్యార్థి, తల్లిదండ్రుల సంతకాలు
  • ఆధార్ వివరాలు, రెసిడెన్స్ సర్టిఫికేట్
  • 5వ తరగతి వరకు చదివిన పాఠశాల ప్రధానోపాధ్యాయుడు విద్యార్థి వివరాలను ధృవీకరించిన సర్టిఫికేట్.

మే 1, 2013కు ముందు, జులై 31, 2015 తర్వాత జన్మించని అభ్యర్థులు దరఖాస్తుకు అనర్హులు. ఈ రెండు తేదీలతో సహా..వీటి మధ్యలో జన్మించిన వారు జేఎన్వీ 6వ తరగతి ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏ జిల్లా విద్యార్థి ఆ జిల్లాలోని జేఎన్వీకి మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.

ఏపీ, తెలంగాణలో పరీక్ష ఎప్పుడంటే?

జేఎన్వీ పరీక్ష-2024 ను రెండు దశల్లో నిర్వహిస్తారు. వచ్చే ఏడాది జనవరి 18, ఏప్రిల్ 12న పరీక్షలు నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్, అసోం, అరుణాచల్ ప్రదేశ్ (దిబాంగ్ వ్యాలీ, తవాంగ్ జిల్లాలు మినహా), బీహార్, ఛత్తీస్‌గఢ్, గోవా, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్ (చంబా, కిన్నౌర్, మండి, సిర్మౌర్, కులు మినహా), లాహౌల్, స్పితీ, సిమ్లా జిల్లాలు, జమ్మూ కాశ్మీర్ (జమ్మూ-I, జమ్మూ-II, సాంబాకు మాత్రమే), జార్ఖండ్, కేరళ, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మణిపూర్, ఒడిశా, పంజాబ్, రాజస్థాన్, త్రిపుర, తెలంగాణ, ఉత్తర ప్రదేశ్ , ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్ (డార్జిలింగ్ మినహా), అండమాన్ నికోబార్ దీవులు, చండీగఢ్, దాదర్ నగర్ హవేలీ, డామన్ డయ్యూ, ఢిల్లీ, లక్షద్వీప్, పుదుచ్చేరి అభ్యర్థులకు జనవరి 18న పరీక్ష జరుగుతుంది.

ఏప్రిల్ 12న పరీక్ష జమ్ము కశ్మీర్‌లో (జమ్మూ-1, జమ్మూ-II & సాంబా మినహా), మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్‌లోని దిబాంగ్ వ్యాలీ, తవాంగ్ జిల్లాల్లో జరుగుతుంది. పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్ జిల్లాలో చంబా, కిన్నౌర్, మండి, సిర్మౌర్, కులు, లాహౌల్, స్పితి , హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లా, యూటీ లడఖ్‌లోని లేహ్,కార్గిల్ జిల్లాలకు ఏప్రిల్ 12న పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్షలో 100 మార్కులకు 80 ప్రశ్నలు ఉంటాయి.

JNVST 2024 దరఖాస్తు కోసం డైరెక్ట్ లింక్ ఇదే : https://cbseitms.rcil.gov.in/nvs/

ఈ పరీక్షలో ఎంపికైన విద్యార్థులకు 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఉచిత విద్య అందిస్తారు. బాలబాలికలకు వేర్వేరుగా వసతి సౌకర్యాలు ఉంటుంది. 2024-25 విద్యా సంవత్సరంలో ఆయా జిల్లాల్లోని ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన స్కూళ్లలో 5వ తరగతి చదువుతుండాలి. రాత పరీక్షలో వచ్చిన మార్కులు ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేస్తారు.

సంబంధిత కథనం