NVST Class 6 Admissions 2025: జవహర్ నవోదయలో 6వ తరగతి ప్రవేశాల రిజిస్ట్రేషన్ ప్రారంభం
జవహర్ నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతి ప్రవేశాలకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. జవహర్ నవోదయ విద్యాలయ సెలక్షన్ టెస్ట్ (JNVST) కు దరఖాస్తు చేయాలనుకునే తల్లిదండ్రులు navodaya.gov.in వెబ్ సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఈ టెస్ట్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న నవోదయ స్కూల్స్ లో 6వ తరగతి ప్రవేశం కల్పిస్తారు.
Navodaya Vidyalaya: దేశవ్యాప్తంగా ఉన్న నవోదయ స్కూల్స్ లో 6వ తరగతిలో ప్రవేశాల కోసం నవోదయ విద్యాలయ సమితి జవహర్ నవోదయ విద్యాలయ సెలక్షన్ టెస్ట్ (JNVST) నిర్వహిస్తుంది. 2025 సంవత్సరానికి గానూ నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతి ప్రవేశాలకు నవోదయ విద్యాలయ సమితి నోటిఫికేషన్ విడుదల చేసింది.
లాస్ట్ డేట్ సెప్టెంబర్ 16
నవోదయ విద్యాలయ సమితి 6వ తరగతి అడ్మిషన్ 2025 రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించింది. జవహర్ నవోదయ విద్యాలయ సెలక్షన్ టెస్ట్ కు దరఖాస్తు చేయాలనుకునే తల్లిదండ్రులు, సంరక్షకులు, విద్యార్థులు ఎన్వీఎస్ అధికారిక వెబ్సైట్ navodaya.gov.in ద్వారా అప్లై చేసుకోవచ్చు. జవహర్ నవోదయ విద్యాలయ సెలక్షన్ టెస్ట్ కు దరఖాస్తు చేయడానికి చివరి తేదీ 16 సెప్టెంబర్ 2024. మిగతా తేదీలను తర్వాత తెలియజేస్తామని నవోదయ విద్యాలయ సమితి ప్రకటించింది.
అవసరమైన డాక్యుమెంట్స్
జేఎన్వీఎస్టీ క్లాస్ 6 అడ్మిషన్ 2025 కు దరఖాస్తు చేయడానికి ముందు ఈ కింద పేర్కొన్న డాక్యుమెంట్స్ ను సిద్ధంగా ఉంచుకోండి.
- నిర్దేశిత ఫార్మాట్లో అభ్యర్థి వివరాలను పేర్కొంటూ హెడ్ మాస్టర్ ధృవీకరించిన సర్టిఫికేట్
- పాస్ పోర్ట్ ఫోటోగ్రాఫ్
- ఆధార్ వివరాలు / నివాస ధృవీకరణ పత్రం
- తల్లిదండ్రుల సంతకం
వయో పరిమితి
ఒక జిల్లాలో ఐదో తరగతి చదువుతున్న అభ్యర్థి అదే జిల్లాలో జేఎన్వీలో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవచ్చు. అడ్మిషన్ కోరుకునే అభ్యర్థి 01-05-2013కు ముందు, 31-07-2015 తర్వాత (రెండు తేదీలు కలిపి) జన్మించి ఉండాలి. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి విద్యార్థులు, తల్లిదండ్రులు లేదా సంరక్షకులు ఈ క్రింది దశలను అనుసరించవచ్చు.
ఆన్ లైన్ లో ఇలా అప్లై చేసుకోండి..
- ముందుగా ఎన్విఎస్ అధికారిక వెబ్సైట్ navodaya.gov.in ను ఓపెన్ చేయాలి.
- హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న జెఎన్విఎస్టి క్లాస్ 6 అడ్మిషన్ 2025 రిజిస్ట్రేషన్ లింక్ పై క్లిక్ చేయండి.
- రిజిస్ట్రేషన్ వివరాలను నమోదు చేయండి.
- అన్ని వివరాలు నమోదు చేసిన తర్వాత సబ్మిట్ పై క్లిక్
చేయండి.
- ఖాతాలో లాగిన్ అవ్వండి.
- అప్లికేషన్ ఫీజు చెల్లించండి.
- తదుపరి అవసరాల కోసం హార్డ్ కాపీని భద్రపర్చుకోండి.
సెలక్షన్ ప్రక్రియ
2025-26 విద్యాసంవత్సరానికి జేఎన్వీల్లో ఆరో తరగతిలో ప్రవేశానికి జేఎన్వీ సెలక్షన్ టెస్ట్ రెండు దశల్లో జరుగుతుంది. మొదటి పరీక్ష జనవరి 18, 2025 ఉదయం 11.30 గంటలకు, రెండో పరీక్ష 2025 ఏప్రిల్ 12న ఉదయం 11.30 గంటలకు జరుగుతుంది. ఈ రెండు పరీక్షలు ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 01.30 గంటల వరకు.. అంటే రెండు గంటల వ్యవధితో ఉంటాయి. వీటిలో కేవలం ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలతో 3 విభాగాలు ఉంటాయి. 100 మార్కులకు మొత్తం 80 ప్రశ్నలు ఉంటాయి. మరిన్ని వివరాలకు అభ్యర్థులు ఎన్వీఎస్ అధికారిక వెబ్సైట్ను చూడవచ్చు.