JNVST 6, 9th Class Results 2024 : నవోదయ విద్యాలయ(JNVST) 6, 9వ తరగతుల ప్రవేశ పరీక్ష ఫలితాలు(JNV Results) విడుదలయ్యాయి. దేశవ్యాప్తంగా 649 జవహర్ నవోదయ విద్యాలయాల్లో ప్రవేశాలకు గత ఏడాది నవంబర్ 4న పరీక్షలు నిర్వహించారు. ఏపీలో 15, తెలంగాణలో 9 జవహర్ నవోదయ విద్యాలయాలు ఉన్నాయి. ఈ ప్రవేశాల్లో గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు 75 శాతం సీట్లు, 25 శాతం సీట్లు పట్టణ ప్రాంత విద్యార్థులకు కేటాయిస్తారు. ప్రతీ ఏటా 6, 9వ తరగతుల ప్రవేశాలకు పరీక్షలు నిర్వహించి విద్యార్థులను ఎంపిక చేస్తారు. ఈ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులకు 6 నుంచి 12వ తరగతి వరకు ఉచిత విద్య అందిస్తారు.
నవోదయ విద్యాలయ సమితి 6, 9వ తరగతికి సంబంధించిన జేఎన్వీఎస్టీ ఫలితాలు(JNVST Results) వెలువడ్డాయి. 6వ తరగతి, 9వ తరగతిలో ప్రవేశాలకు జవహర్ నవోదయ విద్యాలయ ఎంపిక పరీక్షకు హాజరైన విద్యార్థులు ఎన్వీఎస్ అధికారిక వెబ్‌సైట్ navodaya.gov.inలో ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. 6వ తరగతిలో ప్రవేశానికి జేఎన్వీ ఎంపిక పరీక్ష రెండు దశల్లో నిర్వహించారు. మొదటి పరీక్షను గతేడాది నవంబర్ 4న నిర్వహించగా, రెండో దశ పరీక్షను జనవరి 20న నిర్వహించారు. ఇక 9వ తరగతిలో ప్రవేశానికి ఎంపిక పరీక్షను ఫిబ్రవరి 10న నిర్వహించారు.
Step 1 : JNVST 6, 9వ తరగతి ఫలితాలను కోసం navodaya.gov.inలో అధికారిక వెబ్ సైట్‌ని సందర్శించండి.
Step 2 : హోమ్ పేజీలో JNVST 6వ తరగతి, 9వ తరగతి ఫలితాల లింక్‌పై క్లిక్ చేయండి.
Step 3 : విద్యార్థుల లాగిన్ వివరాలను నమోదు చేసి, సబ్మిట్ క్లిక్ చేయండి.
Step 4 : విద్యార్థి ఫలితాల జాబితా స్క్రీన్ పై కనిపిస్తుంది.
Step 5 : ఈ ఫలితాన్ని తనిఖీ చేసుకుని, పేజీని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
నవోదయ విద్యాలయ సమితి (NVS) బోధనేతర సిబ్బంది పోస్టులను భర్తీ చేయనుంది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా మొత్తం 1377 పోస్ట్ లను భర్తీ చేస్తున్నారు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఎన్టీఏ (NTA) అధికారిక వెబ్ సైట్ exams.nta.ac.in/nvs ద్వారా అప్లై చేసుకోవచ్చు.
వివిధ పోస్టుల కింద 1377 నాన్ టీచింగ్ ఖాళీల భర్తీ చేస్తున్నారు. అవి ఈ కింది విధంగా ఉన్నాయి.
అర్హతలు, ఇతర సంబంధిత సమాచారం తెలుసుకోవడానికి ఆసక్తిగల అభ్యర్థులు navodaya.gov.in వెబ్ సైట్ ను సందర్శించవచ్చు.