TG DSC Recruitment 2024: తెలంగాణ డిఎస్సీ పరీక్షలు షెడ్యూల్ ప్రకారం రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. విద్యార్ధులు, నిరుద్యోగుల ఆందోళన నేపథ్యంలో పరీక్షల నిర్వహణపై గత కొద్ది రోజులుగా గందరగోళం నెలకొంది. టెట్ నిర్వహణ, డిఎస్సీ ప్రిపరేషన్ వ్యవధి సరిపోవడం లేదంటూ అభ్యర్థులు పరీక్షలు వాయిదా వేయాలంటూ గత కొద్ది రోజులుగా ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పరీక్షలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని ప్రభుత్వం ఇప్పటికే తేల్చి చెప్పింది.
తెలంగాణలో ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి నిర్వహిస్తున్న డిఎస్సీ పరీక్షలు గురువారం జూలై 18 నుంచి ప్రారంభం కానున్నాయి. ఆన్లైన్‌లో పరీక్షలు జరుగనున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా 11,062 పోస్టుల భర్తీకి 2.79 లక్షల దరఖాస్తులు అందాయి. ఆన్లైన్ పరీక్షలు జూలై 8 నుంచి ప్రారంభమై ఆగస్టు 5వ తేదీ వరకు జరుగుతాయి. మంగళవారం సాయంత్రానికి 2,40,727 మంది హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకున్నారు.
తెలంగాణ వ్యాప్తంగా 14 జిల్లాల్లో 56 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. డిఎస్సీ పరీక్షలు రోజుకు రెండు విడతల్లో నిర్వహిస్తారు. హాల్‌టిక్కెట్లలో తప్పులు పడ్డాయంటూ పెద్ద సంఖ్యలో తెలంగాణ పాఠశాల విద్యాశాఖ కార్యాలయానికి విద్యార్ధులు వస్తుడటంతో వాటిని సరిచేసి ఆన్‌లైన్ అందుబాటులో ఉంచనున్నట్లు అధికారులు ప్రకటించారు.
తెలంగాణ డీఎస్సీ పరీక్షల నిర్వహణపై విద్యార్ధులు, నిరుద్యోగుల ఆందోళన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వ పెద్దలు కీలక వ్యాఖ్యలు చేశారు. కోచింగ్ సెంటర్లు విద్యార్ధుల్ని రెచ్చగొడుతున్నాయని సిఎం రేవంత్ ఆరోపించారు. షెడ్యూల్ ప్రకారం పరీక్షలు జరగకపోతే నిజమైన అభ్యర్థులకు నష్టం జరుగుతుందన్నారు.
తెలంగాణలో 19 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు గుర్తించినట్టు డిప్యూటీ సిఎం భట్టి ప్రకటించారు. అందుకే త్వరగా నోటిఫికేషన్ ఇచ్చి ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టామని, ఈ నెల 11న హాల్ టికెట్లు విడుదల చేశామని తెలిపారు. ఇప్పటికే 2 లక్షల 5 వేల మంది హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకున్నారని, ఉద్యోగార్థులకు ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు.
గత ఏడాది నుంచి విద్యార్థులు డీఎస్సీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారు. ఇంకా పరీక్షలు ఆలస్యం చేయడం సరికాదని జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు డీఎస్సీ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించామన్నారు. గత పదేళ్లలో గ్రూప్-1 నిర్వహించ లేదని గ్రూప్ -2 ఇప్పటికే మూడు సార్లు వాయిదా పడింది. పరీక్షలు అన్ని సార్లు వాయిదా వేయడం సరికాదు. ఉద్యోగాలను త్వరగా భర్తీ చేయాలన్నదే మా ప్రభుత్వ లక్ష్యమన్నారు "
పరీక్షలు వాయిదా వేయాలని కొద్దిరోజులుగా నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. టెట్, డిఎస్సీ మధ్య గ్యాప్ లేకపోవడంతో వాయిదా కోరుతూ ఆందోళనలు చేశారు. మరోవైపు పరీక్షల వాయిదా వేసేందుకు ప్రభుత్వం ససేమిరా అంది. ఇదే చివరి డీఎస్సీ కాదని, త్వరలో మరో డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. జూలై 18 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా డీఎస్పీ పరీక్షలు నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖ ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది.
డిఎస్సీ హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకున్న కొందరు అభ్యర్థులకు ఒకే రోజు రెండు పరీక్షలు ఉంటే... ఉదయం ఒక జిల్లాలో, మధ్యాహ్నం మరొక జిల్లాలో పరీక్ష కేంద్రం హాల్ టికెట్లో దర్శనమిచ్చింది. దీంతో అభ్యర్థుల్లో గందరగోళం నెలకొంది. ఈ విషయం తెలుసుతున్న పాఠశాల విద్యాశాఖ అధికారులు కీలక ప్రకటన చేసింది. ఒకే రోజు రెండు పరీక్షలు ఉంటే ఒకే పరీక్షా కేంద్రంలో రాసుకోవచ్చని తెలిపింది. అలాంటి వారికి మళ్లీ హాల్ టికెట్లను జారీ చేస్తామని తెలిపింది.
తెలంగాణలో మొత్తం 11,062 టీచర్ల పోస్టుల భర్తీకి ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 2,79,966 మంది అభ్యర్థులు అప్లై చేసుకున్నారు. జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు డీఎస్సీ పరీక్షలు నిర్వహించనున్నారు. నిర్ణయించిన తేదీల్లో రోజుకు రెండు షిఫ్టుల చొప్పున పరీక్షలు నిర్వహిస్తారు. ఈసారి ఆన్ లైన్ విధానంలో డీఎస్సీ పరీక్షలు జరగనున్నాయి. ఇప్పటి వరకు హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోనివారు పాఠశాల విద్యాశఆఖ వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకువచ్చని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ తెలిపారు. మొత్తం 11,062 ఉపాధ్యాయ పోస్టుల్లో 2,629 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉండగా, 727 భాషా పండితులు, 182 పీఈటీలు, 6,508 ఎస్జీటీలు, స్పెషల్ ఎడ్యుకేషన్ 220 స్కూల్ అసిస్టెంట్లు, 796 ఎస్జీటీ పోస్టులను ఈ నోటిఫికేషన్ లో భర్తీ చేస్తున్నారు.
సంబంధిత కథనం