Hyderabad ECIL Trade Apprentice : హైదరాబాద్ ఈసీఐఎల్ లో 437 ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులు, ఇలా దరఖాస్తు చేసుకోండి
Hyderabad ECIL Trade Apprentice : హైదరాబాద్ లోని ఈసీఐఎల్ లో 437 ట్రేడ్ అప్రెంటిస్ షిప్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించారు. అర్హులైన ఐటీఐ అభ్యర్థులు ఈ నెల 29లోపు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు ముందుగా నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్ లో అప్రెంటిస్ గా నమోదు చేసుకోవాలి.
Hyderabad ECIL Trade Apprentice : హైదరాబాద్ లోని కేంద్ర ప్రభుత్వం సంస్థ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్) ఏడాది ట్రేడ్ అప్రెంటిస్ షిప్ శిక్షణకు అర్హులైన ఐటీఐ అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 437 ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఐటీఐ పాస్ అయిన అభ్యర్థులు సెప్టెంబర్ 29వ తేదీలోగా ఆన్‌లైన్‌లో https://www.ecil.co.in/jobs.html దరఖాస్తు చేసుకోవచ్చు.
వయస్సు
అభ్యర్థులు 31.10.2024 నాటికి 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉండకూడదు. గరిష్ట వయోపరిమితి జనరల్ అభ్యర్థులకు 25 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 28 సంవత్సరాలు, ఎస్సీ/ఎస్టీలకు 30 సంవత్సరాలు, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు అదనంగా 10 సంవత్సరాల వయస్సులో సడలింపు ఇస్తారు.
అప్రెంటిస్‌షిప్ వ్యవధి
- అప్రెంటిస్‌షిప్ శిక్షణాకాలం ఒక సంవత్సరం మాత్రమే ఉంటుంది. 01 నవంబర్, 2024 నుంచి శిక్షణ ప్రారంభమవుతుంది.
అర్హత
- అభ్యర్థులు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ పాస్ సర్టిఫికేట్ అంటే NCVT సర్టిఫికేట్ కలిగి ఉండాలి.
ఎంపిక విధానం ఇలా
- ఐటీఐ మార్కుల మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
- 70% సీట్లు ప్రభుత్వ ఐటీఐ విద్యార్థులకు, 30% సీట్లు ప్రైవేట్ ఐటీఐ విద్యార్థులకు కేటాయిస్తారు.
- 07.10.2024 నుంచి 09.10.2024 వరకు ఒరిజినల్ డాక్యుమెంట్ల వెరిఫికేషన్ చేస్తారు.
డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎక్కడ
ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, కార్పొరేట్ లెర్నింగ్ & డెవలప్‌మెంట్ సెంటర్, నలంద కాంప్లెక్స్, TIFR రోడ్, ఈసీఐఎల్, హైదరాబాద్ – 500 062. ఫోన్ నెం.: 040 2718 6454/2279
ట్రేడ్ అప్రెంటీస్ పోస్టులకు ఎలా దరఖాస్తు చేయాలి?
- తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో నివసిస్తున్న అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
- STEP 1 : అవసరమైన విద్యార్హత కలిగి ఉన్న అభ్యర్థులు నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్ www.apprenticeshipindia.gov.in
- లో ముందుగా నమోదు చేసుకోవాలి.
- STEP 2 : పైన పేర్కొన్న పోర్టల్‌లో నమోదు చేసుకున్న తర్వాత అభ్యర్థులు ఈసీఐఎల్ వెబ్‌సైట్ www.ecil.co.in ద్వారా ఆన్‌లైన్ దరఖాస్తును సమర్పించాలి.
- ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ 13.09.2024 నుంచి ప్రారంభం అయ్యింది. దరఖాస్తుకు సెప్టెంబర్ 29 చివరి తేదీ.
ట్రేడ్ ఖాళీల వివరాలు ఇలా
ట్రేడ్ అప్రెంటిస్ మొత్తం ఖాళీలు : 437 (UR- 175; EWS- 44, OBC- 120, SC- 65, ST- 33)
1. ఎలక్ట్రానిక్స్ మెకానిక్- 162
2. ఎలక్ట్రీషియన్- 70
3. ఫిట్టర్- 70
4. మెకానిక్ (ఆర్ అండ్ ఏసీ)- 17
5. టర్నర్- 17
6. మెషినిస్ట్- 17
7. మెషినిస్ట్(గ్రైండర్)- 13
8. సీఓపీఏ- 45
9. వెల్డర్- 22
10. పెయింటర్- 4
సంబంధిత కథనం