Railway Information : రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సికింద్రాబాద్ - శ్రీకాకుళం రోడ్ మధ్య రెండు ఏసీ స్పెషల్ రైళ్లు-two ac special trains between secunderabad and srikakulam road ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Railway Information : రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సికింద్రాబాద్ - శ్రీకాకుళం రోడ్ మధ్య రెండు ఏసీ స్పెషల్ రైళ్లు

Railway Information : రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సికింద్రాబాద్ - శ్రీకాకుళం రోడ్ మధ్య రెండు ఏసీ స్పెషల్ రైళ్లు

HT Telugu Desk HT Telugu
Sep 15, 2024 03:15 PM IST

Railway Information : దసరా, దీపావళి, ఛత్ పండుగల సీజన్‌లో ప్రయాణీకుల అదనపు రద్దీని క్లియర్ చేయడానికి.. ఇండియన్ రైల్వే సికింద్రాబాద్ - శ్రీకాకుళం రోడ్ - సికింద్రాబాద్ మధ్య రెండు ప్రత్యేక రైళ్లను నడుపుతుంది. వాల్తేర్ డివిజన్‌లో భద్రతా పనుల కారణంగా ఆరు రైళ్లను రీషెడ్యూల్, షార్ట్ టెర్మినేషన్ చేశారు.

సికింద్రాబాద్ - శ్రీకాకుళం రోడ్ మధ్య రెండు ఏసీ స్పెషల్ రైళ్లు
సికింద్రాబాద్ - శ్రీకాకుళం రోడ్ మధ్య రెండు ఏసీ స్పెషల్ రైళ్లు

సికింద్రాబాద్ - శ్రీకాకుళం రోడ్ ఏసీ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ (07487) రైలు.. అక్టోబర్ 2 నుండి నవంబర్ 6 వరకు ప్రతి బుధవారం నాడు రాత్రి 7:40 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరుతుంది. మరుసటి రోజు ఉదయం 9:10 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. అక్కడ నుంచి ఉదయం 9:12 గంటలకు బయలుదేరి ఉదయం 9:53 గంటలకు పెందుర్తి చేరుకుంటుంది. అక్కడ నుంచి ఉదయం 9:55 గంటలకు బయలుదేరి ఉదయం 10:05 గంటలకు కొత్తవలస చేరుకుంటుంది. అక్కడ నుంచి ఉదయం 10:07 గంటలకు బయలుదేరి ఉదయం 10:30 గంటలకు విజయనగరం చేరుకుంటుంది. అక్కడ నుంచి ఉదయం 10:40 గంటలకు బయలుదేరి ఉదయం 11:00 గంటలకు చీపురుపల్లి చేరుకుంటుంది. 11:02 గంటలకు బయలుదేరి, శ్రీకాకుళం రోడ్డుకు మధ్యాహ్నం 12:00 గంటలకు చేరుకుంటుంది. మొత్తం ఆరు ట్రిప్పులు ఉంటుంది.

శ్రీకాకుళం రోడ్ - సికింద్రాబాద్ ఏసీ స్పెషల్ ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ (07488) రైలు అక్టోబర్ 3 నుండి నవంబర్ 7 వరకు.. ప్రతి గురువారం శ్రీకాకుళం రోడ్‌లో సాయంత్రం 5:00 గంటలకు బయలుదేరుతుంది. ఈ రైలు చీపురుపల్లికి సాయంత్రం 5:33 గంటలకు చేరుకుని, అక్కడ నుండి 5:35 గంటలకు బయలుదేరుతుంది. విజయనగరం సాయంత్రం 6:00 గంటలకు చేరుకుంటుంది. అక్కడ నుండి సాయంత్రం 6:10 గంటలకు బయలుదేరి, కొత్తవలస సాయంత్రం 6:35 గంటలకు చేరుకుంటుంది. అక్కడ నుంచి సాయంత్రం 6:37 గంటలకు బయలుదేరి పెందుర్తికి సాయంత్రం 6:45 గంటలకు చేరుకుంటుంది. అక్కడ నుంచి సాయంత్రం 6:47 గంటలకు బయలు దేరి రాత్రి 7:33 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. అక్కడ నుంచి రాత్రి 7:35 గంటలకు బయలుదేరి శుక్రవారం ఉదయం 9:50 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. మొత్తం ఆరు ట్రిప్పులు ఉంటాయి.

ఈ రెండు ప్రత్యేక రైళ్లకు సికింద్రాబాద్- శ్రీకాకుళం రోడ్ స్టేషన్ల మధ్య నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, ఎలమంచిలి, అనకాపల్లి, దువ్వాడ, పెందుర్తి, కొత్తవలస, విజయనగరం, చీపురుపల్లిలో స్టాప్‌లు ఉన్నాయి. ఈ రైళ్లలో థర్డ్ ఏసీ కోచ్‌లు-17, మోటార్ కార్-02 కోచ్‌లు ఉన్నాయి. ఈ ప్రత్యేక రైళ్ల సేవలను ప్రజలు వినియోగించుకోవాలని.. వాల్తేర్ డివిజన్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కె. సందీప్ కోరారు

రైళ్లు రీ షెడ్యూల్, షార్ట్ టెర్మినేషన్..

సెప్టెంబర్ 16, 19, 21 తేదీల్లో వాల్తేర్ డివిజన్‌లోని పుండి - నౌపడ సెక్షన్‌లో భద్రతా పనుల దృష్ట్యా.. పలు రైలు సర్వీసులపై ప్రభావం పడనుంది.

పుదుచ్చేరి - భువనేశ్వర్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (12897) రైలు సెప్టెంబర్ 18న సాయంత్రం 6:50 గంటలకు బదులుగా 2:45 గంటల ఆలస్యంగా, రాత్రి 9.35 గంటలకు పుదుచ్చేరి నుండి బయలుదేరే విధంగా రీషెడ్యూల్ చేశారు.

కేఎస్ఆర్ బెంగళూరు - భువనేశ్వర్ ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ (18464) రైలు సెప్టెంబర్ 18, 20 తేదీల్లో మధ్యాహ్నం 1:40 గంటలకు బదులుగా 3:00 గంటలు ఆలస్యంగా, సాయంత్రం 4:10 గంటలకు కేఎస్ఆర్ బెంళూరు నుండి బయలుదేరే విధంగా రీషెడ్యూల్ చేశారు.

నాలుగు రైళ్లు షార్ట్ టెర్మినేషన్..

1. రూర్కెలా నుండి బయలుదేరే రూర్కెలా-గుణపూర్ రాజ్య రాణి ఎక్స్‌ప్రెస్ (18117) రైలు పలాసలో షార్ట్ టర్మినేట్ చేయనున్నారు.

2. గుణుపూర్ -రూర్కెలా రాజ్య రాణి ఎక్స్‌ప్రెస్ (18118) రైలు సెప్టెంబర్ 16న గుణుపూర్‌కు బదులుగా పలాస నుండి బయలుదేరుతుంది.

3. విశాఖపట్నం నుండి బయలుదేరే విశాఖపట్నం - పలాస ఎంఈఎంయూ (07470) రైలు సెప్టెంబర్ 19, 21 తేదీల్లో శ్రీకాకుళం రోడ్డులో షార్ట్ టర్మినేట్ చేస్తారు.

4. పలాస - విశాఖపట్నం ఎంఈఎంయూ (07471) రైలు సెప్టెంబర్ 19, 21 తేదీల్లో పలాసకు బదులుగా శ్రీకాకుళం రోడ్ నుండి బయలుదేరుతుంది. ప్రజలు మార్పులను గమనించి తదనుగుణంగా ప్రయాణాలు చేసుకోవాలని వాల్తేర్ డివిజన్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కే. సందీప్ సూచించారు.

(రిపోర్టింగ్- జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)