Duvvada Srinivas: శ్రీకాకుళంలోని దువ్వాడ నివాసం దగ్గర హైడ్రామా.. 10 రోజులుగా వాణి నిరసన-hydrama near duvvada srinivas residence in srikakulam ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Duvvada Srinivas: శ్రీకాకుళంలోని దువ్వాడ నివాసం దగ్గర హైడ్రామా.. 10 రోజులుగా వాణి నిరసన

Duvvada Srinivas: శ్రీకాకుళంలోని దువ్వాడ నివాసం దగ్గర హైడ్రామా.. 10 రోజులుగా వాణి నిరసన

Basani Shiva Kumar HT Telugu
Aug 17, 2024 01:30 PM IST

Duvvada Srinivas: దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ ఇష్యూ రోజుకో మలుపు తీరుగుతోంది. తాజాగా శ్రీకాకుళంలోని ఆయన ఇంటి వద్ద హైడ్రామా నెలకొంది. శ్రీనివాస్, వాణి పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. దీంతో టెన్షన్ వాతావరణం ఏర్పడింది.

దువ్వాడ శ్రీనివాస్
దువ్వాడ శ్రీనివాస్

శ్రీకాకుళంలోని దువ్వాడ శ్రీనివాస్ నివాసం దగ్గర హైడ్రామా నెలకొంది. 10 రోజులుగా వాణి నిరసన కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో.. దువ్వాడ వాణికి నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు వచ్చారు. నోటీసులు తీసుకునేందుకు వాణి నిరాకరించారు. ముందు దువ్వాడ శ్రీనివాస్‌కు నోటీసులు ఇవ్వాలని వాణి డిమాండ్ చేశారు. అయితే.. తన నివాసంలోకి చొరబడ్డారని వాణిపై దువ్వాడ శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత తనపై దాడి చేశారని దువ్వాడ శ్రీనివాస్‌పై వాణి ఫిర్యాదు చేశారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

వివాదం ఏంటీ..

దువ్వాడ శ్రీనివాస్ టెక్కలిలో నివాసముంటున్న ఇంటి ముందు ఆయన కుమార్తెలు, భార్య వాణి ఈనెల 8న నిరసనకు దిగారు. ఇప్పటికీ వారి నిరసన కొనసాగుతోంది. ఇటీవల నిర్మించిన ఆ ఇంట్లో దువ్వాడ శ్రీనివాస్.. దివ్వెల మాధురి అనే మరో మహిళతో ఉంటున్నారని వాణి, దువ్వాడ కుమార్తెలు ఆరోపిస్తున్నారు. దువ్వాడ శ్రీనివాస్ తమ ఇంటికి రావాలని వారు కోరుతున్నారు. చాలా రోజులుగా వాణీ, శ్రీనివాస్ మధ్య గొడవలు నడుస్తున్నాయి. ఒక దశలో దువ్వాడపై ఎన్నికల్లో పోటీ చేసేందుకు వాణి సిద్ధపడ్డారు.

ఎవరీ దివ్వెల మాధురి..

దువ్వాడ శ్రీనివాస్ తనకు ఫ్రెండ్ అని దివ్వెల మాధురి చెబుతున్నారు. తాను సూసైడ్ చేసుకోవాల్సిన పరిస్థితుల్లో దువ్వాడ అండగా ఉన్నారని మాధురి చెప్పారు. 2022లో తనను వైసీపీలోకి ఆహ్వానించింది దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణీనే అని మాధురి స్పష్టం చేస్తున్నారు. తాను తన సొంద డబ్బుతో మూడంతస్తుల భవనం కొన్నానని.. అందులో దువ్వాడ శ్రీనివాస్ ఉంటున్నారనేది అవాస్తవం అని స్పష్టం చేశారు. అయితే.. ఈ ఎపీసోడ్‌లోకి మాధురి భర్త ఎంట్రీ ఇచ్చారు. ఎవరెన్ని చెప్పినా.. తాను ఆమెకు అండగా ఉంటానని స్పష్టం చేశారు.

పొలిటికల్ రచ్చ..

వాణీ, మాధురి, దువ్వాడ శ్రీనివాస్ ఇష్యూ పొలిటికల్ టర్న్ తీసుకుంది. వీరి వ్యవహారంలో గత ప్రభుత్వంలో సలహాదారుగా పనిచేసిన సజ్జల రామకృష్ణారెడ్డి ప్రమేయం ఉందని వార్తలు వచ్చాయి. అయితే.. దీనిపై వైసీపీ సీరియస్ అయ్యింది. భార్యాభర్తల గొడవను రాజకీయం చేస్తున్నారని టీడీపీపై ఆరోపణలు చేసింది. మరోవైపు వీరి సమస్యను పరిష్కరించేందుకు లాయర్లు చర్చలు జరిపినట్టు వార్తలు వచ్చాయి. అటు కుటుంబ సభ్యులు కూడా వివాదం సద్దుమణిగేలా చేయడానికి ప్రయత్నాలు చేశారు. కానీ.. ఫలితం లేకుండా పోయింది. వాణి ఆందోళన చేస్తూనే ఉంది.

Whats_app_banner