Special Trains: రైల్వే గుడ్‌న్యూస్... తిరుప‌తి-శ్రీకాకుళం, సికింద్రాబాద్‌-కొల్లం మ‌ధ్య నాలుగు ప్ర‌త్యేక రైళ్లు-railway good news four separate trains between tirupati srikakulam and secunderabadkollam ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Special Trains: రైల్వే గుడ్‌న్యూస్... తిరుప‌తి-శ్రీకాకుళం, సికింద్రాబాద్‌-కొల్లం మ‌ధ్య నాలుగు ప్ర‌త్యేక రైళ్లు

Special Trains: రైల్వే గుడ్‌న్యూస్... తిరుప‌తి-శ్రీకాకుళం, సికింద్రాబాద్‌-కొల్లం మ‌ధ్య నాలుగు ప్ర‌త్యేక రైళ్లు

HT Telugu Desk HT Telugu
Sep 13, 2024 10:51 AM IST

Special Trains: ప్ర‌యాణికుల‌కు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడానికి, దసరా, దీపావళి, ఛత్ పండుగ సీజన్‌లో ప్రయాణీకుల అదనపు రద్దీని క్లియర్ చేయడానికి తిరుపతి-శ్రీకాకుళం రోడ్-తిరుపతి, సికింద్రాబాద్‌-కొల్లం-సికింద్రాబాద్‌ మధ్య నాలుగు ప్రత్యేక రైళ్లను నడపాలని రైల్వే నిర్ణయించింది.

రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌- పండుగ సీజన్ దృష్ట్యాప్రత్యేక రైళ్లు
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌- పండుగ సీజన్ దృష్ట్యాప్రత్యేక రైళ్లు

Special Trains: దసరా, దీపావళి పండుగల సమీపిస్తుండటంతో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక రైళ్లను ప్రకటించారు.

తిరుపతి నుండి బ‌య‌లుదేరే తిరుపతి-శ్రీకాకుళం రోడ్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ (07442) రైలు అక్టోబ‌ర్ 6 నుండి న‌వంబ‌ర్ 10 వ‌ర‌కు (ఆదివారాలు) అందుబాటులో ఉంటుంది. తిరుప‌తిలో ప్ర‌తి ఆదివారం సాయంత్రం 5:10 గంటలకు బయలుదేరుతుంది. ఇది మరుసటి రోజు ఉద‌యం 7:55 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది.

అక్క‌డ నుంచి ఉద‌యం 7:57 గంటలకు బ‌య‌లుదేరి, పెందుర్తి ఉద‌యం 8:40 గంటలకు చేరుకుంటుంది. అక్క‌డ నుంచి ఉద‌యం 8:42 గంటలకు బయలుదేరి, కొత్తవలస ఉద‌యం 9:48 గంటలకు చేరుకుంటుంది. అక్క‌డ నుంచి ఉద‌యం 9:50 గంటలకు బయలుదేరి, విజయనగరం ఉద‌యం 10:10 గంటలకు చేరుకుంటుంది.

అక్క‌డ నుంచి ఉద‌యం 10:20 గంటలకు బయలుదేరి, చీపురుపల్లి ఉద‌యం 10:45 గంటలకు చేరుకుంటుంది. అక్క‌డ నుంచి 10:47 గంటలకు బయలుదేరి, శ్రీకాకుళం రోడ్డుకు మ‌ధ్యాహ్నం 12.15 గంటలకు చేరుకుంటుంది. మొత్తం ఆరు ట్రిప్పులు ఉంటాయి.

శ్రీకాకుళం రోడ్‌లో బ‌య‌లుదేరే శ్రీకాకుళం రోడ్-తిరుపతి స్పెషల్ ఎక్స్‌ప్రెస్ (07443) రైలు అక్టోబ‌ర్ 7 నుండి న‌వంబ‌ర్ 11 వ‌ర‌కు (సోమవారాలు) అందుబాటులో ఉంటుంది. శ్రీకాకుళం రోడ్‌లోప్ర‌తి సోమవారం మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు బయలుదేరుతుంది. ఈ రైలు చీపురుపల్లికి మ‌ధ్యాహ్నం 3:30 గంటలకు చేరుకుంటుంది.

అక్క‌డ నుంచి మ‌ధ్యాహ్నం 3:32 గంటలకు బయలుదేరి, విజయనగరం సాయంత్రం 4:15 గంటలకు చేరుకుంటుంది. అక్క‌డ నుంచి సాయంత్రం 4:25 గంటలకు బయలుదేరి, కొత్తవలస సాయంత్రం 4:58 గంటలకు చేరుకుంటుంది. అక్క‌డ నుంచి సాయంత్రం 5 గంటలకు బయలుదేరుతుంది. పెందుర్తి సాయంత్రం 5:08 గంటలకు చేరుకుని, అక్క‌డ నుంచి సాయంత్రం 5:10 గంటలకు బ‌య‌లుదేరుతుంది. దువ్వాడ సాయంత్రం 6:02 గంటలకు చేరుకుంటుంది. అక్క‌డ నుంచి సాయంత్రం 6:07 గంటలకు బయలుదేరి, మరుసటి రోజు ఉద‌యం 8:20 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది. మొత్తం ఆరు ట్రిప్పులు ఉంటాయి.

తిరుపతి, శ్రీకాకుళం రోడ్‌ స్టేషన్ల మధ్య రేణిగుంట, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, తుని, అనకాపల్లి, దువ్వాడ, పెందుర్తి, కొత్తవలస, విజయనగరం, చీపురుపల్లి స్టాప్‌లు ఉంటాయి. ఈ రైలుకు సెకెండ్ ఏసీ- 1, థ‌ర్డ్ ఏసీ- 2, స్లీప‌ర్ క్లాస్- 13, జ‌న‌ర‌ల్ సెకండ్ క్లాస్- 6, సెకండ్ క్లాస్ ల‌గేజ్ క‌మ్ సిట్టింగ్ కోచ్‌, దివ్యాంగు- 2 కోచ్‌లు ఉంటాయి. ఈ ప్రత్యేక రైళ్ల సేవలను ప్రజలు వినియోగించుకోవాలని వాల్తేర్ డివిజ‌న్ ఎస్‌డీసీఎం కే. సందీప్ తెలిపారు.

రెండు ప్ర‌త్యేక రైళ్ల‌ను పొడిగింపు

దసరా, దీపావళి, ఛత్ పండుగ సీజన్‌లో ప్రయాణీకుల అదనపు రద్దీని క్లియర్ చేయడానికి సికింద్రాబాద్‌-కొల్లం-సికింద్రాబాద్‌ ప్రత్యేక రైళ్లను నడపాలని రైల్వే నిర్ణయించింది. సికింద్రాబాద్‌ నుండి బ‌య‌లుదేరే సికింద్రాబాద్‌-కొల్లం స్పెషల్ ఎక్స్‌ప్రెస్ (07193) రైలు సెప్టెంబ‌ర్ నుంచి నవంబ‌ర్ 27 వ‌ర‌కు (బుధ‌వారం) అందుబాటులో ఉంటుంది. మొత్తం 12 ట్రిప్పులు ఉంటాయి. కొల్లంలో బ‌య‌లుదేరే కొల్లం-సికింద్రాబాద్‌ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ (07194) రైలు సెప్టెంబ‌ర్ నుంచి నవంబ‌ర్ 29 వ‌ర‌కు (శుక్ర‌వారం) అందుబాటులో ఉంటుంది. మొత్తం 12 ట్రిప్పులు ఉంటాయి.

వెయిటింగ్ లిస్ట్ ప్రయాణికుల అదనపు రద్దీని క్లియర్ చేయడానికి, ఈస్ట్ కోస్ట్ రైల్వేలోని వాల్తేర్‌ డివిజన్ అదనపు విస్టాడోమ్ కోచ్, థ‌ర్డ్ ఏసీ ఎకానమీ కోచ్‌లను విశాఖపట్నం-కిరండూల్-విశాఖపట్నం రైలుకు జోడించాలని నిర్ణయించింది. విశాఖపట్నం-కిరండూల్ (08551) రైలు సెప్టెంబ‌ర్ 14, 21, 28 తేదీల్లో శ‌నివారాల్లో అదనపు విస్టాడోమ్ కోచ్‌ను జోడిస్తారు.

సెప్టెంబ‌ర్ 15, 22, 29 తేదీల్లో ఆదివారాల్లో అదనపు థ‌ర్డ్ ఏసీ ఎకాన‌మీ కోచ్‌ను జోడిస్తారు. కిరండూల్-విశాఖపట్నం (08552) రైలుకు సెప్టెంబ‌ర్ 15, 22, 29 తేదీల్లో శ‌నివారాల్లో అదనపు విస్టాడోమ్ కోచ్‌ను జోడిస్తారు. సెప్టెంబ‌ర్ 16, 23, 30 తేదీల్లో ఆదివారాల్లో అదనపు థ‌ర్డ్ ఏసీ ఎకాన‌మీ కోచ్‌ను జోడిస్తారు. .

(జ‌గ‌దీశ్వ‌ర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)