Fear Trailer: హీరో మాధవన్‌ను థ్రిల్ చేసిన సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ.. వేదిక ద్విపాత్రాభినయం.. ఫియర్ ట్రైలర్ రిలీజ్!
Vedhika Fear Trailer Released By Madhavan: హీరోయిన్ వేదిక నటించిన తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఫియర్ ట్రైలర్‌ను హీరో మాధవన్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఫియర్ ట్రైలర్ ఆయన్ను థ్రిల్‌కు గురిచేసినట్లు తెలిపారు. ఈ సినిమాలో వేదిక డ్యుయల్ రోల్‌లో నటిస్తున్నట్లు ట్రైలర్ ద్వారా తెలుస్తోంది.
Hero Madhavan Released Fear Movie Trailer: ముని, రూలర్ సినిమాలతోపాటు యక్షిణి, మెంటల్‌హుడ్ వంటి ఓటీటీ వెబ్ సిరీస్‌లతో అట్రాక్ట్ చేసింది హీరోయిన్ వేదిక. తెలుగులో సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా వస్తోన్న ఫియర్ మూవీలో వేదిక మెయిన్ లీడ్ రోల్ చేసింది.
ఫియర్ నటీనటులు
ఫియర్ సినిమాలో వేదికతోపాటు అరవింద్ కృష్ణ, జేపీ ( జయప్రకాష్ ), పవిత్ర లొకేష్, అనీష్ కురువిల్ల, సాయాజి షిండే, సత్య కృష్ణ, సాహితి దాసరి, షాని తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఫియర్ మూవీని దత్తాత్రేయ మీడియా బ్యానర్‌పై డా. వంకి పెంచలయ్య, ఏఆర్ అభి నిర్మాతలుగా, సుజాత రెడ్డి కో ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు.
70కిపైగా ఇంటర్నేషనల్ అవార్డ్స్
సస్పెన్స్ థ్రిల్లర్ కథతో తెరకెక్కిన ఫియర్ మూవీని దర్శకురాలు డా. హరిత గోగినేని తెరకెక్కించారు. కాగా "ఫియర్" సినిమా విడుదలకు ముందే వివిధ అంతర్జాతీయ ప్రతిష్టాత్మక ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో 70కి పైగా అవార్డ్స్‌లను గెల్చుకోవడం విశేషంగా మారింది. దీంతో ఈ సినిమాపై బజ్ క్రియేట్ అవుతోంది. ఫియర్ సినిమాను డిసెంబర్ 14న గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు.
ఫియర్ ట్రైలర్ రిలీజ్
ఈ నేపథ్యంలో ఇటీవల ఫియర్ ట్రైలర్‌ను విడుదల చేశారు. తమిళ, తెలుగు పాపులర్ హీరో మాధవన్ ఫియర్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన మాధవన్ ఫియర్ ట్రైలర్ రిలీజ్ చేయడం హ్యాపీగా ఉందన్నారు. అలాగే, ఫియర్ ట్రైలర్ థ్రిల్ చేసిందని మాధవన్ చెప్పారు. అనంతరం ఫియర్ మూవీ టీమ్‌కు తన బెస్ట్ విషెస్ అందించారు మాధవన్.
ఎవరో వెంటాడుతున్నట్లుగా
ఇక ఫియర్ ట్రైలర్ ఎలా ఉందో చూస్తే.. సింధు (వేదిక)ను చిన్నప్పటి నుంచి మానసిక సమస్యలు వేధిస్తుంటాయి. ఎవరో తనను వెండాతున్నట్లుగా భయపడుతుంటుంది. కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఎంత ధైర్యం చెప్పినా సింధును ఈ ఫియర్ వదలదు. ఆమె జీవితంలో కొన్ని ఘటనల తర్వాత చికిత్స కోసం ఆస్పత్రిలో చేర్పిస్తారు.
డ్యుయల్ రోల్‌లో వేదిక
సింధును వెంటాడుతున్న ఆ బూచోడు ఎవరు, ఆమెను ఎందుకు భయపెడుతున్నాడు అనేది ట్రైలర్‌లో ఆసక్తి కలిగించింది. ట్రైలర్ చివరలో నాయికను ద్విపాత్రాభినయంలో చూపించడం థ్రిల్ చేసింది. సింధు పాత్రలో భయపడే అమ్మాయిగా వేదిక ది బెస్ట్ పర్‌ఫార్మెన్స్ చేసింది. అయితే, ఇలాంటి నేపథ్యంలో ఎన్నో సినిమాలు వచ్చాయి. మరి బ్యూటిఫుల్ వేదిక డ్యుయల్ రోల్‌లో నటించిన ఫియర్ ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.
వేదిక కంటే ముందు
ఇదిలా ఉంటే, ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఫియర్ మూవీ గురించి డైరెక్టర్ హరిత గోగినేని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు. ఫియర్ మూవీకి వేదిక కంటే ముందు ఇతర హీరోయిన్స్‌ను అనుకున్నారని ఆమె చెప్పారు. అయితే, ఆ హీరోయిన్స్ డేట్స్ ఏడాదిపాటు కుదరకపోయేసరికి, అంత టైమ్ ఎదురుచూడలేక వేదికని ఓకే చేసుకున్నట్లు హరిత గోగినేని తెలిపారు.
హారర్ సినిమాల్లో నటించడం
ముని, కాంచన 3 వంటి మూవీస్‌లో వేదిక బాగా నటించడం, హారర్ సినిమాల్లో నటించిన వేదిక తమ సస్పెన్స్ థ్రిల్లర్ కథకు పర్ఫెక్ట్ యాప్ట్ అనుకుని ఆమెను సంప్రదించినట్లు డైరెక్టర్ హరిత గోగినేని చెప్పుకొచ్చారు. కథ విన్న తర్వాత వేదిక వెంటనే ఓకే చెప్పినట్లు, డైరెక్టర్ అనుకున్న కథలో వేదికను ఊహించుకుంటే ఆమె పర్ఫెక్ట్ అనిపించినట్లు హరిత గోగినేని వెల్లడించారు.