Fear: బాలకృష్ణ హీరోయిన్ వేదిక సస్పెన్స్ థ్రిల్లర్.. ఐదుగురు స్టార్ హీరోలతో ఫియర్ టీజర్ రిలీజ్-vedhika suspense thriller movie fear teaser released rana daggubati vijay sethupathi kiccha sudeep dileep imran hashmi ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Fear: బాలకృష్ణ హీరోయిన్ వేదిక సస్పెన్స్ థ్రిల్లర్.. ఐదుగురు స్టార్ హీరోలతో ఫియర్ టీజర్ రిలీజ్

Fear: బాలకృష్ణ హీరోయిన్ వేదిక సస్పెన్స్ థ్రిల్లర్.. ఐదుగురు స్టార్ హీరోలతో ఫియర్ టీజర్ రిలీజ్

Sanjiv Kumar HT Telugu
Sep 21, 2024 01:24 PM IST

Vedhika Fear Teaser Released By Five Heroes: బాలకృష్ణ రూలర్ సినిమాలో హీరోయిన్‌గా నటించిన వేదిక లేటెస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఫియర్. ఈ సినిమా టీజర్‌ను ఐదు భాషల్లో ఐదుగురు స్టార్ హీరోలు విడుదల చేశారు. దీంతో ఫియర్ మూవీపై బజ్ క్రియేట్ అయింది. మరి ఆ ఐదుగురు స్టార్ హీరోలు ఎవరనే వివరాల్లోకి వెళితే..

బాలకృష్ణ హీరోయిన్ వేదిక సస్పెన్స్ థ్రిల్లర్.. ఐదుగురు స్టార్ హీరోలతో ఫియర్ టీజర్ రిలీజ్
బాలకృష్ణ హీరోయిన్ వేదిక సస్పెన్స్ థ్రిల్లర్.. ఐదుగురు స్టార్ హీరోలతో ఫియర్ టీజర్ రిలీజ్

Vedhika Fear Teaser Released: విజయదశమి సినిమాతో తెలుగులో హీరోయిన్‌గా పరిచయం అయిన వేదిక రాఘవ లారెన్స్ ముని, నందమూరి బాలకృష్ణ రూలర్ సినిమాలతో తెలుగులో క్రేజ్ తెచ్చుకుంది. ఇప్పుడు ఈ హీరోయిన్ వేదిక లీడ్ రోల్‌లో నటిస్తున్న సినిమా "ఫియర్". ఈ సినిమాను దత్తాత్రేయ మీడియా బ్యానర్‌పై ప్రొడ్యూసర్ ఏఆర్ అభి నిర్మిస్తున్నారు.

స్పెషల్ రోల్

సుజాత రెడ్డి కో ప్రొడ్యూసర్‌గా వ్యవహరించిన తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ ఫియర్ మూవీని డా. హరిత గోగినేని తెరకెక్కించారు. ఇందులో అరవింద్ కృష్ణ ఓ స్పెషల్ రోల్‌లో కనిపించనున్నారు. "ఫియర్" సినిమా విడుదలకు ముందే వివిధ అంతర్జాతీయ ప్రతిష్టాత్మక ఫిలిం ఫెస్టివల్స్‌లో 60కి పైగా అవార్డ్స్‌లను గెలుచుకుని కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.

"ఫియర్" సినిమా త్వరలోనే గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 20న "ఫియర్" సినిమా తెలుగు టీజర్‌ను స్టార్ హీరో రానా, తమిళ టీజర్‌ను విజయ్ సేతుపతి, కన్నడ టీజర్‌ను కిచ్చా సుదీప్, మలయాళ టీజర్‌ను దిలీప్, హిందీ టీజర్‌ను ఇమ్రాన్ హష్మీ సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశారు.

ముందు టీమ్ నచ్చాలి

అనంతరం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో "ఫియర్" టీజర్ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేదిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. "నేను ఏ సినిమా చేయాలన్నా ముందు టీమ్ నాకు నచ్చాలి. ఫియర్ టీమ్ నాకు బాగా నచ్చింది. మిగతా లాంగ్వేజెస్ మూవీస్ కోసం నేను రెగ్యులర్‌గా ట్రావెల్ చేస్తున్నాను. అలా చెన్నై నుంచి ఇప్పుడు ఇక్కడికి వచ్చాను" అని వేదిక చెప్పింది.

"ఫియర్ టీజర్ చూశాక నా స్ట్రెస్ మొత్తం పోయింది. మనసంతా సంతోషంగా ఉంది. ఫియర్ సినిమాకు టీమ్ మొత్తం ఆల్ రౌండ్ ఎఫర్ట్ పెట్టారు. హరిత గారు మంచి ప్లానింగ్‌తో మూవీని అందరికీ నచ్చేలా రూపొందించారు. ఫిలిం మేకింగ్ పట్ల ఆమెలో ప్యాషన్ చూశాను. ఇది ఆమె ఫస్ట్ మూవీ అంటే ఎవరూ నమ్మరు. నేను ఈ సినిమాలో చేసిన రోల్ చాలా సంతృప్తిని ఇచ్చింది" అని వేదిక తెలిపింది.

మంచి బీజీఎం కావాలి

"మా మూవీ టీజర్‌ను తెలుగులో రానా గారు, తమిళంలో విజయ్ సేతుపతి గారు, హిందీలో ఇమ్రాన్ హష్మీ గారు, కన్నడలో కిచ్చా సుదీప్ గారు, మలయాళంలో దిలీప్ గారు రిలీజ్ చేశారు. వారందరికీ నా థ్యాంక్స్ చెబుతున్నా. ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్‌కు మంచి బీజీఎం కావాలి. అనూప్ గారు ఎఫెక్టివ్‌గా బీజీఎం చేశారు. అరవింద్ కృష్ణ డెడికేషన్, ప్యాషన్ నన్ను ఆకట్టుకున్నాయి" అని వేదిక పేర్కొంది.

"మా ఫియర్ మూవీకి 64 ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్ అవార్డ్స్ వచ్చాయి. మేము ఫిలిం మాత్రమే అప్లై చేశాము, అప్లై చేయని కేటగిరీస్‌లో కూడా ఆ ఫిలిం ఫెస్టివల్ వాళ్లకు నచ్చి అవార్డ్స్ ఇచ్చినవి కూడా ఉన్నాయి. మీ అందరికీ ఫియర్ సినిమా నచ్చుతుందని ఆశిస్తున్నాను" అని వేదిక తన స్పీచ్‌ను ముగించింది.