Uruku Patela: హీరోను చంపేందుకు ప్రయత్నించే హీరోయిన్- కామెడీ సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఉరుకు పటేల
Tejus Kancherla Uruku Patela Trailer Released: హుషారు ఫేమ్ తేజస్ కంచెర్ల హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ఉరుకు పటేల. కామెడీ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఉరుకు పటేల ట్రైలర్ తాజాగా ఇవాళ (ఆగస్ట్ 26) విడుదలైంది. ట్రైలర్ ఫన్నీగాసాగుతూ ఆఖరిలో వచ్చే ట్విస్ట్ ఆకట్టుకునేలా ఉంది.
Uruku Patela Trailer Out: హుషారు వంటి వైవిధ్యమైన చిత్రంతో ప్రేక్షకులను మెప్పించిన యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్టర్ తేజస్ కంచెర్ల హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ఉరుకు పటేల. ‘గెట్ ఉరికిఫైడ్’ అనేది సినిమా ట్యాగ్ లైన్. లీడ్ ఎడ్జ్ పిక్చర్స్ బ్యానర్‌పై కంచర్ల బాల భాను ఈ సినిమాను నిర్మించారు.
పట్నం పిల్లా సాంగ్
ఉరుకు పటేల సినిమాకు వివేక్ రెడ్డి దర్శకత్వం వహించారు. సెప్టెంబర్ 7న ఈ సినిమాను గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు. దీంతో సినిమా ప్రమోషన్స్ చాలా క్రితమే స్టార్ట్ చేశారు. సన్నీ కూరపాటి సినిమాటోగ్రఫీ అందించిన ఈ సినిమాకు ప్రవీణ్ లక్కరాజు సంగీతాన్ని సమకూర్చారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, ‘పట్నం పిల్లా..’, ‘ఓరి మాయలోడా..’ సాంగ్‌లకు ప్రేక్షకుల నుంచి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది.
ఉరుకు పటేల ట్రైలర్
ఈ క్రమంలో సోమవారం (ఆగస్ట్ 26) నాడు ఉరుకు పటేల మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్. ఈ ట్రైలర్‌ను గమనిస్తే.. హీరోకి పెళ్లి వయసు వచ్చినా పెళ్లి కావటం లేదని బాధ ఎక్కువ అవుతుంటుంది. అందుకు కారణం.. తనేమీ చదువుకోడు. కానీ, బాగా చదువుకున్న అమ్మాయినే పెళ్లి చేసుకోవాలనుకుంటాడు హీరో.
చదువుకున్న అమ్మాయిలు
దాంతో అతని ఆశలకు తగ్గట్టే ఓ అందమైన అమ్మాయి, అది కూడా డాక్టర్ అయిన హీరోయిన్ అతన్ని ప్రేమిస్తుంది. చాలా మంది చదువుకున్న అమ్మాయిలకు నచ్చని హీరోని హీరోయిన్ మాత్రం ఎందుకు ప్రేమించిందా! అనేది చాలా మందిలో ఉండే ప్రశ్న. కానీ.. కథలో అసలు ట్విస్ట్ అక్కడే ఉన్నట్లు ట్రైలర్ ద్వారా మనకు తెలుస్తోంది.
భయపడిపోయిన హీరో
చదువుకోని హీరోను హీరోయిన్ ఎందుకు ప్రేమించిందా అనే డౌట్ వచ్చే సమయంలోనే హీరోయిన్‌లో మరో కోణం బయటకు వస్తుంది. ఆ దెబ్బకు హీరో భయపడతాడు.. ఏం చేయాలో తెలియక పారిపోవాలనుకుంటాడు.. ఇంతకీ హీరోయిన్ ఏం చేసింది.. ఆమెను చూసి హీరో ఎందుకు భయపడ్డాడు.. చివరకు ఏమైందనేది తెలుసుకోవాలంటే సెప్టెంబర్ 7న రిలీజ్ కాబోతున్న సినిమాను చూడాల్సిందేనంటున్నారు దర్శక నిర్మాతలు.
హీరోను చంపాలని
ఉరుకు పటేల సినిమా విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కినట్లు తెలుస్తోంది. సర్పంచ్ కొడుకు అయిన హీరో అల్లర చిల్లరగా తిరుగుతుంటాడు. అందుకే ఏ చదువుకున్న అమ్మాయి కూడా హీరోను ప్రేమించదు. కానీ, డాక్టర్ అయిన హీరోయిన్ మాత్రం హీరోను ప్రేమిస్తుంది. అయితే, హీరోను చంపాలని హీరోయిన్ ప్రయత్నించినట్లు ట్రైలర్‌లో చూపించారు.
కారణం ఇదేనా
హీరోయిన్ ఓ డాక్టర్ కాబట్టి ఏదైనా ప్రయోగానికైనా, లేదా మెడిసిన్‌కు కావాల్సిన అంశాలు హీరోలో ఉండి, అందుకే కథానాయకుడిని చంపాలని హీరోయిన్ ట్రై చేసినట్లుగా ట్రైలర్ ద్వారా ఊహించవచ్చు. ట్రైలర్‌లో తేజస్, చమ్మక్ చంద్ర మధ్య కామెడీ బాగానే వర్కౌట్ అయినట్లు తెలుస్తోంది. అంలాగే తండ్రికొడుకుల మధ్య రిలేషన్‌ను ఫ్రెండ్లీగా చూపించారు.