ANR 100 Film Festival: 31 సిటీల్లో ఏఎన్నార్ 100 ఫిల్మ్ ఫెస్టివల్ సెలబ్రేషన్స్.. 4Kలో 10 సినిమాల ప్రదర్శన.. అవి ఏవంటే?-anr 100 film festival celebrations in 31 cities nagarjuna says akkineni nageswara rao 10 movies release with 4k version ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Anr 100 Film Festival: 31 సిటీల్లో ఏఎన్నార్ 100 ఫిల్మ్ ఫెస్టివల్ సెలబ్రేషన్స్.. 4kలో 10 సినిమాల ప్రదర్శన.. అవి ఏవంటే?

ANR 100 Film Festival: 31 సిటీల్లో ఏఎన్నార్ 100 ఫిల్మ్ ఫెస్టివల్ సెలబ్రేషన్స్.. 4Kలో 10 సినిమాల ప్రదర్శన.. అవి ఏవంటే?

Sanjiv Kumar HT Telugu
Sep 21, 2024 11:33 AM IST

ANR 100 Film Festival Celebrations In 31 Cities: నట సామ్రాట్, పద్మవిభూషణ్ అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి సందర్భంగా ఏఎన్నార్ 100 ఫిల్మ్ ఫెస్టివల్ సెలబ్రేషన్స్‌ను 31 నగరాల్లో నిర్వహించనున్నట్లు నాగార్జున తెలిపారు. అలాగే ఏఎన్నార్ పది సినిమా సినిమాలను 4కేలో ప్రదర్శించనున్నారు.

31 సిటీల్లో ఏఎన్నార్ 100 ఫిల్మ్ ఫెస్టివల్ సెలబ్రేషన్స్.. 4Kలో 10 సినిమాల ప్రదర్శన.. అవి ఏవంటే?
31 సిటీల్లో ఏఎన్నార్ 100 ఫిల్మ్ ఫెస్టివల్ సెలబ్రేషన్స్.. 4Kలో 10 సినిమాల ప్రదర్శన.. అవి ఏవంటే?

ANR 10 Movies In 100 Years Of Celebrations: తన నటనతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు నటసామ్రాట్, పద్మవిభూషణ్ అక్కినేని నాగేశ్వరరావు. ఆయన శత జయంతి వేడుకలను ఈ సంవత్సరం చాలా గ్రాండ్‌గా నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన విశేషాలను నాగార్జున తెలిపారు.

నేషనల్ ఫిల్మ్ ఆర్కైవ్ ఆఫ్ ఇండియా (NFDC)తో కలిసి ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్ ‘ANR 100-కింగ్ ఆఫ్ ది సిల్వర్ స్క్రీన్’ ఫిల్మ్ ఫెస్టివల్‌ని నిర్వహిస్తోంది. అభిమానులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఏఎన్నార్ ఐకానిక్ ఫిలిం 'దేవదాసు' స్క్రీనింగ్‌తో ఈ ఫెస్టివల్ గ్రాండ్‌గా ప్రారంభమైంది. ఈ సినిమాతో కలిపి ఏఎన్నార్ 100 ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఆయన మాస్టర్ పీస్ పది సినిమాలను ప్రదర్శించనున్నారు.

ఏఎన్నార్ 100 ఇయర్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో 'దేవదాసు' (1953), 'మిస్సమ్మ' (1955) 'మాయాబజార్' (1957), 'భార్య భర్తలు' (1961), 'గుండమ్మ కథ' (1962), 'డాక్టర్ చక్రవర్తి' (1964), 'సుడిగుండాలు' (1968), 'ప్రేమ్ నగర్' (1971), 'ప్రేమాభిషేకం' (1981) 'మనం' (2014) సహా ANR ల్యాండ్‌మార్క్ మూవీస్‌ను దేశవ్యాప్తంగా అంటే 31 నగరాల్లో ప్రదర్శించనున్నారు.

ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్, అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా ఈ 10 మాస్టర్ పీస్ మూవీ ప్రింట్‌లను 4Kలో పునరుద్ధరించడానికి చొరవ తీసుకున్నాయి. అద్భుతమైన క్యాలిటీలో ఈ క్లాసిక్స్‌ని ప్రేక్షకులు ఆస్వాదించేందుకు మొగ్గు చూపుతున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్‌లో కింగ్ నాగార్జున అనేక విశేషాలు చెప్పారు.

"అందరికీ నమస్కారం. నాన్నగారు నవ్వుతూ మాకు జీవితాన్ని నేర్పించారు. అందుకే ఆయన పేరు తలచుకుంటే నవ్వుతూనే ఉంటాం. శివేంద్ర గారికి థాంక్స్. దేవదాస్‌తో పాటు మరికొన్ని సినిమాలు చూడబోతున్నారు. వాళ్లు చేసిన బ్లాక్ అండ్ వైట్ ప్రింట్స్ అద్భుతంగా ఉన్నాయి. ఆడియన్స్‌కి వండర్‌ఫుల్ ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది" అని నాగార్జున తెలిపారు.

"31 సిటీల్లో ఈ ఫెస్టివల్ చేస్తున్నారు. నార్త్‌లో ఫెంటాస్టిక్ రెస్పాన్స్ వస్తుందని శివేంద్ర చెప్పడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. గోవా ఇంటర్‌నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో నాన్న గారి పేరు మీద ఒక చాప్టర్ చేస్తున్నారు. ఈ విషయంలో చాలా హ్యాపీగా ఉంది. పోస్ట్ మాస్టర్ జనరల్ బీఎస్ రెడ్డి గారికి థాంక్ యూ. ఈ శత జయంతి రోజున నాన్న గారి స్టాంప్ రిలీజ్ చేయడం చాలా అనందంగా ఉంది" అని నాగ్ చెప్పారు.

"ఈ వేడుకకు వచ్చిన అందరికీ పేరు పేరునా థాంక్ యూ సో మచ్. శత జయంతిని పురస్కరించుకొని రెండు తెలుగు రాష్ట్రాల్లో నాన్న గారి సీనియర్ అభిమానులు రక్తదానం, అన్నదానం లాంటి మంచి కార్యక్రమలు చేశారు. వారందరికీ థాంక్ యు వెరీ మచ్. మీ ప్రేమ అభిమానం మర్చిపోలేనేది" అని అభిమానులకు కృతజ్ఞతలలు తెలిపారు నాగార్జున.

"ప్రతి రెండేళ్లకు ఏఎన్ఆర్ అవార్డ్ ఇస్తున్నాం. ఈ ఏడాది ఏఎన్ఆర్ అవార్డ్ చిరంజీవి గారికి ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. ఈ విషయం చెప్పగానే చిరంజీవి గారు చాలా ఎమోషనల్ అయి హాగ్ చేసుకొని ఆయన శత జయంతి ఏడాదిలో ఇవ్వడం చాలా ఆనందంగా ఉందన్నారు. దీనికి కంటే పెద్ద అవార్డ్ లేదన్నారు. అమితాబ్ బచ్చన్ గారు ఈ ఆవార్డ్ ప్రధానం చేస్తారు. అక్టోబర్ 28న ఈ ఫంక్షన్ చేస్తున్నాం" అని నాగార్జున చెప్పుకొచ్చారు.