NNS September 9th Episode: మనోహరి కూతురే అంజు- భాగీ చేతిలో దత్తత సర్టిఫికెట్​- అమర్​ వార్నింగ్​- మిస్సమ్మకు డౌట్-nindu noorella saavasam serial september 9th episode anjali is manohari daughter nindu noorella saavasam today episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Nns September 9th Episode: మనోహరి కూతురే అంజు- భాగీ చేతిలో దత్తత సర్టిఫికెట్​- అమర్​ వార్నింగ్​- మిస్సమ్మకు డౌట్

NNS September 9th Episode: మనోహరి కూతురే అంజు- భాగీ చేతిలో దత్తత సర్టిఫికెట్​- అమర్​ వార్నింగ్​- మిస్సమ్మకు డౌట్

Sanjiv Kumar HT Telugu
Sep 10, 2024 11:11 AM IST

Nindu Noorella Saavasam September 9th Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ సెప్టెంబర్ 9వ తేది ఎపిసోడ్‌‌లో అంజలి మనోహరి కూతురు అని తెలుస్తుంది. అంజలిని దత్త తీసుకున్న సర్టిఫికేట్ భాగీకి దొరుకుతుంది. తన వస్తువులు ముట్టుకోవద్దని అమర్ వార్నింగ్ ఇస్తాడు. అదే విషయంపై రాథోడ్‌ను అడుగుతుంది మిస్సమ్మ.

నిండు నూరేళ్ల సావాసం సీరియల్ సెప్టెంబర్ 6వ తేది ఎపిసోడ్‌
నిండు నూరేళ్ల సావాసం సీరియల్ సెప్టెంబర్ 6వ తేది ఎపిసోడ్‌

Nindu Noorella Saavasam Today Episode: నిండు నూరేళ్ల సావాసం నేటి ఎపిసోడ్‌లో (NNS 9th September Episode) రణ్​వీర్​తో పెళ్లి, తన కూతురు దుర్గను అనాథ ఆశ్రమంలో వదిలేయడం, అమర్​‌ను దక్కించుకోవడం కోసం మళ్లీ అరుంధతి జీవితంలోకి రావడం.. ఇలా తన గతం తలుచుకుంటూ అనాథాశ్రమం బయట కూర్చుని ఆలోచిస్తుంది మనోహరి.

ఉన్నట్లుండి మనోహరి దగ్గరకు వెళ్లిన అంజలి హగ్​ చేసుకుంటుంది. మనోహరి కూడా ఎమోషనల్​గా ఫీలవుతుంది. అంజలి హగ్‌ చేసుకోవడంతో మనోహరి ఏడుస్తుంది. ఈ అంజలిని పట్టుకోగానే నా కూతురు దుర్గ కూడా అంజలి లాగే ఉండి ఉంటుంది అని మనసులో అనుకుంటుంది మనోహరి. మీరు ఇక్కడ బాధగా కూర్చున్నారు. మీరు అనాథ కాదు ఆంటీ మీకు మేమంతా ఉన్నాము.. అని అంజలి చెప్తుంది.

ఓ కారణం ఉంది

దూరం నుంచి గమనిస్తున్న గుప్త నిన్ను అనాథను చేసిన నీ కన్నతల్లికి నువ్వు అనాథ కావు అంటూ భరోసా ఇస్తున్నావా బాలిక అనుకుంటాడు. తర్వాత మనోహరిని అంజలి లోపలికి తీసుకెళ్తుంది. అయినా అంజుకు మనోహరి అంటే అసలు పడదు కదా ఎందుకు లోపలికి తీసుకెళ్తుంది అనుకుంటుంది అరుంధతి. సృష్టిలో జరిగే ప్రతి చర్యకు కారణం ఉంటుంది. దీనికి ఓ కారణం ఉంది. కానీ అది ఎవ్వరికీ కనిపించడం లేదు అని గుప్త చెప్పగానే అరుంధతి చూస్తుండిపోతుంది.

రణవీర్‌ ఏడుస్తూ తన కూతురిని చూడక ఆరు సంవత్సరాలు అయిందని బాధపడుతుంటాడు. తర్వాత భాగీ బెడ్‌రూంలో ఉన్న పాత ఫైల్స్ అన్నీ సర్దుతుంటే అందులోంచి ఒక పేపర్‌ గాలికి కొట్టుకుపోయి కింద అంజు దగ్గర పడుతుంది. అది అంజును అమర్‌ అడాప్ట్‌ చేసుకున్న పేపర్‌. అది చూడగానే అమర్‌ మొత్తం గుర్తు చేసుకుంటాడు. పైనుంచి గమనిస్తున్న భాగీ షాక్‌ అవుతుంది.

తర్వాత అంజుకు ఏదో చెప్పి పంపిస్తాడు అమర్‌. కోపంగా భాగీ దగ్గరకు వెళ్తాడు అమర్‌. నా వస్తువులు ఇంకొకరు ముట్టుకుంటే నాకు నచ్చదని నీకు తెలుసు కదా మిస్సమ్మ. అయినా ఎందుకు మళ్లీ ముట్టుకుని నన్ను ఎందుకు ఇరిటేట్‌ చేస్తున్నావు అని అరుస్తాడు. అయినా నేను ఇవన్నీ.. అంటూ సర్దుతున్నాను అని చెప్పబోతుంది భాగీ. కారణం ఏదైనా సరే ఇవన్నీ నా జ్ఞాపకాలు.. నా గతం.. నేను లేనప్పుడు నాకు తెలియకుండా ముట్టుకోకు అని పేపర్‌ ఫైల్స్‌‌లో పెట్టి అమర్‌ వెళ్లిపోతాడు.

ఏమిటయ్యా లీలలు

అమర్‌ ఏదో దాస్తున్నాడని భాగీ అనుకుంటుంది. ఏం జరగబోతోందని ఆలోచిస్తూ గుప్త కంగారుపడుతుంటాడు. అనాథలుగా మొదలైన ఇద్దరి ప్రయాణం ఇటువంటి మలుపు తిరుగునని ఎన్నడూ ఊహించలేదు. తన జీవితాన్నే తన కూతురుకు ఇవ్వాలనుకుంటుంది మనోహరి. తన గత జీవితాన్ని ఎవ్వరికీ రాకూడదని కొత్త జీవితం ఇస్తున్న అరుంధతి ఒకవైపు. జగన్నాథ ఏమిటయ్యా నీ లీలలు అంటూ గుప్త ఆలోచిస్తుంటాడు.

ఇన్ని చిక్కు ముడులను విప్పే వారు ఎవరు స్వామి అని ప్రార్థిస్తుంటాడు. ఇంతలో అరుంధథి వస్తుంది. గుప్త గారు ఏమైంది మీలో మీరే మాట్లాడుకుంటున్నారు. ప్రపంచంలోని వింతలన్నీ ఇచటనే జరుగుతుంటే ఇదంతా కలయా నిజమా అని ఆలోచిస్తున్నాను బాలిక అంటాడు గుప్త. మా ఇంట్లో వింతలా? ఏమున్నాయి గుప్త గారు అని అడుగుతుంది అరుంధతి.

నీకు కన్నవారు ఎవరో తెలియదు. ఆ బాలికకు తన సోదరి ఎవరో తెలియదు. నీ బిడ్డగా పిలవబడుతున్న ఆ అంజలికి తన కన్నవారు ఎవరో తెలియదు. తనను కన్నవారికి ఈ పిల్ల పిచ్చుకే తమ బిడ్డ అని తెలియదు అంటాడు గుప్త. అంజు కన్నవాళ్లకు అంజూయే తమ కూతురని తెలియదన్నారు. అది సరే తన కన్నవాళ్లకు అంజు తెలుసా పోని. చెప్పండి గుప్త గారు తెలుసా లేదా? అంటే వాళ్లు మాకు దగ్గరలోనే ఉన్నారా? అంటుంది అరుంధతి.

సంతోషమివ్వని నిజం

అయ్యో పిచ్చి బాలిక నీ ప్రాణాలు తీసిన నీ ప్రాణ స్నేహితురాలే.. నీవు ప్రాణాలు పోసిన అంజలి కన్నతల్లి అని నీకు ఎటుల చెప్పెద. అది తెలిసినచో నువ్వు తట్టుకోగలవా? అని గుప్త మనసులో అనుకుంటుంటే అరుంధతి కోపంగా నా ప్రతి ప్రశ్నకు మీ మౌనం సమాధానం కాదు నిజం చెప్పండి అని నిలదీస్తుంది. అయితే ఆనందం ఇవ్వని నిజం తెలుసుకుని ఏం లాభం అని గుప్త చెప్తాడు.

త్వరలోనే అంజుకు నిజం తెలుస్తుందని చెప్తాడు. మరోవైపు భాగీ ఆలోచిస్తూ వెళ్లిపోతుంది రాథోడ్‌ వచ్చి పలకరించినా పలకదు. దీంతో రాథోడ్‌ తట్టి ఏమైందని అడుగుతాడు. దీంతో అడాప్ట్‌ సర్టిఫికెట్‌ గురించి భాగీ చెప్పగానే రాథోడ్‌ టెన్షన్‌ పడుతుంటాడు. రాథోడ్​ భాగీకి నిజం చెబుతాడా? అంజలినే తన కూతురు దుర్గ అని మనోహరికి ఎలా తెలుస్తుంది? అనే విషయాలు తెలియాలంటే సెప్టెంబర్​ 10న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్​ తర్వాతి ఎపిసోడ్ తప్పకుండా చూడాల్సిందే!