Samantha Rana OTT: నేరుగా ఓటీటీలోకి వచ్చిన సమంత రానా సినిమా.. 8 ఏళ్లకు తెలుగులో స్ట్రీమింగ్.. ఎక్కడంటే?-samantha rana daggubati movie bangalore days ott streaming in telugu on amazon prime bangalore days telugu version ott ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Samantha Rana Ott: నేరుగా ఓటీటీలోకి వచ్చిన సమంత రానా సినిమా.. 8 ఏళ్లకు తెలుగులో స్ట్రీమింగ్.. ఎక్కడంటే?

Samantha Rana OTT: నేరుగా ఓటీటీలోకి వచ్చిన సమంత రానా సినిమా.. 8 ఏళ్లకు తెలుగులో స్ట్రీమింగ్.. ఎక్కడంటే?

Sanjiv Kumar HT Telugu
Aug 21, 2024 10:24 AM IST

Samantha Rana Bangalore Days OTT Streaming In Telugu: స్టార్ హీరోయిన్ సమంత, దగ్గుబాటి రానా కలిసి నటించిన లవ్ స్టోరీ సినిమా బెంగళూరు డేస్. మలయాళ సూపర్ హిట్ మూవీకి తమిళంలో రీమేక్ అయిన ఈ మూవీ ఎనిమిదేళ్లకు తెలుగులోకి వచ్చేసింది. అది కూడా నేరుగా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

నేరుగా ఓటీటీలోకి వచ్చిన సమంత రానా సినిమా.. 8 ఏళ్లకు తెలుగులో స్ట్రీమింగ్.. ఎక్కడంటే?
నేరుగా ఓటీటీలోకి వచ్చిన సమంత రానా సినిమా.. 8 ఏళ్లకు తెలుగులో స్ట్రీమింగ్.. ఎక్కడంటే?

Samantha Rana Bangalore Days OTT Release In Telugu: ప్రస్తుతం ఓటీటీలో వచ్చే సినిమాలకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. వివిధ భాషల్లో తెరకెక్కిన సినిమాలు సైతం తెలుగులో డబ్ అవుతున్నాయి. అలాగే రీమేక్ కూడా అవుతున్నాయి. ఓటీటీలు వచ్చాక థియేటర్లలో విడుదల కానీ చిత్రాలు సైతం ఓటీటీల బాట పడుతున్నాయి.

నేరుగా ఓటీటీలో

అలా ఎనిమిదేళ్ల క్రితం తమిళంలో రీమేక్ అయిన సినిమానే ఇప్పుడు తెలుగు భాషలోకి వచ్చేసింది. అది కూడా థియేటర్లలో విడుదల కాకుండా నేరుగా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఆ సినిమా మరేదో కాదు బెంగళూరు డేస్. 2014లో మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్ కావడమే కాకుండా సెన్సేషన్ క్రియేట్ చేసిన మూవీ బెంగళూరు డేస్.

దుల్కర్ సల్మాన్-ఫహాద్ ఫాజిల్

మలయాళ బెంగళూరు డేస్ సినిమాలో సీతారామం హీరో దుల్కర్ సల్మాన్, పుష్ప విలన్ ఫహాద్ ఫాజిల్, నజ్రియా నజీమ్, పార్వతి తిరువోతు, నివిన్ పౌలీ వంటి స్టార్ నటీనటులు ప్రధాన పాత్రలు పోషించారు. అప్పుడు 2014లో సూపర్ హిట్ అయిన ఈ బెంగళూరు డేస్ సినిమాను 2016లో తమిళంలో రీమేక్ చేశారు.

సమంత-రానా-ఆర్య

బెంగళూరు డేస్ తమిళ రీమేక్‌లో స్టార్ హీరోయిన్ సమంత, టాలీవుడ్ హల్క్ దగ్గుబాటి రానా, తమిళ హీరో ఆర్య, హీరోయిన్ శ్రీదివ్య, పాపులర్ నటుడు బాబీ సింహా, హాట్ బ్యూటి లక్ష్మీ రాయ్ మెయిన్ లీడ్ రోల్స్ చేశారు. అంతేకాకుండా ఇందులో సమంత, రానా జోడి కట్టడం విశేషం. రానా, సమంత నటించిన తొలి సినిమా కూడా ఇదే. వీరిద్దరి ఇదివరకు ఎందులోను కలిసి నటించలేదు.

తమిళంలో రీమేక్ చేసి

అసలు రానా, సమంత కలిసి ఓ సినిమాలో నటించరానే విషయం దాదాపుగా ఎవరికీ తెలియదు. ఇలాంటి ప్రత్యేకతలు ఉన్న ఈ బెంగళూరు డేస్ తమిళ రీమేక్ సినిమాను తెలుగులో కూడా థియేటర్లలో రిలీజ్ చేద్దామనుకున్నారు. కానీ, అది అప్పట్లో పలు కారణాలతో ఎందుకో కుదర్లేదు. దాంతో అప్పటి నుంచి తమిళ వెర్షన్ మాత్రమే ఉంది.

ఎనిమిదేళ్లకు తెలుగులో

అలాంటి బెంగళూరు డేస్ సినిమా దాదాపుగా ఎనిమిదేళ్లకు తెలుగులోకి వచ్చేసింది. అది కూడా నేరుగా ఓటీటీలో రిలీజ్ చేశారు. తమిళంలో రీమేక్ అయిన ఈ మలయాళ బెంగళూరు డేస్ సినిమాను తెలుగులో డబ్ చేసి ఓటీటీలో డిజిటల్ ప్రీమియర్‌కు తీసుకొచ్చారు. ఈ విషయాన్ని తాజాగా అధికారికంగా ప్రకటించారు. ఈ మూవీ అదే బెంగళూరు డేస్ టైటిల్‌తో ఓటీటీలో అందుబాటులో ఉంది.

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో

బెంగళూరు డేస్ తెలుగు వెర్షన్ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. దీన్ని చూడాలంటే మాత్రం సబ్‌స్క్రిప్షన్ ఉండాల్సిందే. అయితే, బెంగళూరు డేస్ మలయాళ వెర్షన్ మాత్రం చూడాలంటే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీలోకి వెళ్లాల్సిందే. కానీ, దీనికి మాత్రం ఎలాంటి సబ్‌స్క్రిప్షన్ అవసరం లేదు. హాట్‌స్టార్‌లో మలయాళ వెర్షన్‌ను ఫ్రీగా చూడొచ్చు.