Samantha About Marriage: ప్రేమించి, పెళ్లి చేసుకున్న సమంతతో విడిపోయిన నాగ చైతన్య రెండోసారి ఓ ఇంటివాడు కాబోతున్నాడు. త్వరలో రెండోసారి పెళ్లి పీటలు ఎక్కనున్నాడు. బోల్డ్ హీరోయిన్ శోభిత ధూళిపాళతో నాగ చైతన్య నిశ్చితార్థం గురువారం (ఆగస్ట్ 8) ఉదయం జరిగిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని నాగార్జున అధికారికంగా ప్రకటించారు.
ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో నాగ చైతన్య, శోభిత ధూళిపాళ నిశ్చితార్థం హాట్ టాపిక్ అయింది. దీంతో నాగ చైతన్య మాజీ భార్య సమంత విషయం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో గతంలో పెళ్లిపై సమంత చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దానికి సంబంధించిన వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.
అయితే, ఈ వీడియో నాగ చైతన్యతో విడిపోయాక జరిగిన ఇంటర్వ్యూకు సంబంధించినది. "మా విడాకుల అనౌన్స్‌మెంట్ వచ్చాకా.. ఈ సెపరేషన్ అంతా నడుస్తున్న సమయంలో నా ఫ్రెండ్స్, నా ఫ్యామిలీ అంతా నాకు ఒకటే చెప్పారు. నువ్ ఇంట్లో కూర్చో అంతే. ఐటమ్ సాంగ్ చేయకు. సెపరేషన్ గురించి అనౌన్స్‌మెంట్ వచ్చాక ఐటమ్ సాంగ్ చేయకు. దీనికి నువ్ నో చెప్పాలి అని అన్నారు" అని సమంత తెలిపింది.
"సాధారణంగా ప్రతిదాంట్లో నన్ను ఎంకరేజ్ చేసే ఫ్రెండ్స్, అది చేయు, ఇది చేయు, వెళ్లి సూపర్ డీలక్స్ చేయు.. కమాన్ ఛాలెంజ్‌గా తీసుకో అని చెప్పిన నా ఫ్రెండ్సే ఐటమ్ సాంగ్ చేయకు అని చెప్పారు. కానీ, నేను ఓకే.. నేను ఐటమ్ సాంగ్ చేస్తాను అని చెప్పా" అని సమంత చెప్పుకొచ్చింది.
"నేనెందుకు దాక్కోవాలి. నేనేం తప్పు చేయలేదు. నా మ్యారేజ్‌లో నేను వంద శాతం ఎఫర్ట్ పెట్టాను. కానీ, అది వర్కౌట్ కాలేదు. అలా అని నన్ను ఎందుకు తక్కువ చేసుకోవాలి. నేను ఏం చేయని దానికి నేనెందుకు ఎందుకు గిల్టీగా ఫీల్ అవ్వాలి" అని సమంత ఆ వీడియోలో పేర్కొంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇదిలా ఉంటే, నాగ చైతన్య సమంత ఏ మాయ చేశావే సినిమాతో ఒక్కటైన విషయం తెలిసిందే. ప్రేమించి పెళ్లి చేసుకున్న వీరిద్దరు నాలుగేళ్లకు విడిపోయారు. తర్వాత ఎవరి దారిలో వారు బిజీగా ఉన్నారు. ప్రస్తుతం సమంత సిటాడెల్ అనే వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రియాంక చోప్రా సిటాడెల్‌కు ప్రీక్వెల్‌గా తెరకెక్కిన సిటాడెల్ హనీ బన్నీ నవంబర్ 7 నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.
ఇదే కాకుండా సమంత బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్‌తో ఓ సినిమా చేయనుందని టాక్ వినిపిస్తోంది. అలాగే మలయాళంలో మెగాస్టార్ మమ్ముట్టితో ఓ సినిమా, తమిళంలో విజయ్‌కు జోడీగా మరో చిత్రం సమంత చేయడానికి సిద్ధంగా ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.