Indian 2 Box Office: ఘోరంగా పతనమైన ఇండియన్ 2 కలెక్షన్స్.. సింగిల్ డిజిట్‌కే పరిమితం.. కానీ, తమిళంలో రికార్డ్
Indian 2 Worldwide Box Office Collection Day 4: శంకర్, కమల్ హాసన్ కాంబినేషన్‌లో మరోసారి తెరకెక్కిన ఇండియన్ 2 సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోరమైన టాక్ తెచ్చుకుంటుంది. నాలుగో రోజు అయిన సోమవారం భారతీయుడు 2 కలెక్షన్స్ ఘోరంగా పతనం అయ్యాయి.
Indian 2 Box Office Collection: కమల్ హాసన్ సేనాపతి పాత్రలో మరోసారి నటించిన సినిమా ఇండియన్ 2. కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ ఎస్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా జూలై 12న విడుదలైంది. రిలీజ్ డే నుంచి బాక్సాఫీస్ వద్ద దారుణమైన ఫలితాలను చవిచూస్తోంది భారతీయుడు 2 మూవీ.
నెగెటివ్ రివ్యూలు
ఇక తాజాగా ఇండియన్ 2 సినిమాకు మండే ఎఫెక్ట్ గట్టిగా పడింది. నాలుగో రోజు అయిన సోమవారం నాడు భారతీయుడు 2కి కలెక్షన్స్ ఘోరంగా పతనం అయ్యాయి. దీంతో మండే పరీక్షను పాస్ కాలేకపోయింది ఇండియన్ 2 సినిమా. సాధారణంగా స్టార్ హీరోల సినిమాలు శుక్రవారం భారీ ఓపెనింగ్స్ సాధించి వీకెండ్‌లో అదే జోరును కొనసాగిస్తాయి. కానీ నెగెటివ్ రివ్యూల కారణంగా సోమవారం మాత్రం క్రాష్ అవుతాయి.
చాలా తగ్గిన వసూళ్లు
ఇప్పుడు ఇండియన్ 2 సినిమాకు కూడా అదే పరిస్థితి ఎదురైంది. ఇండియన్ 2 వసూళ్లు మొదటి సోమవారం సింగిల్ డిజిట్‌కు పడిపోయాయి. నాలుగో రోజున ఇండియాలో భారతీయుడు 2కి రూ. 3.2 కోట్ల కలెక్షన్స్ మాత్రమే వచ్చాయి. అంటే, రిలీజ్ డేతో పోల్చుకుంటే నాలుగో రోజున ఏకంగా 79.15 శాతం వసూళ్లు పడిపోయాయి. అలాగే సోమవారం వసూళ్లు ఆదివారంతో పోలిస్తే చాలా తగ్గాయి.
నాలుగు రోజుల కలెక్షన్స్
ఇక ఈ 3.2 కోట్లల్లో తమిళనాడు నుంచి రూ. 2 కోట్లు, హిందీ నుంచి రూ. 35 లక్షలు, తెలుగు నుంచి రూ. 85 లక్షలు మాత్రమే కలెక్ట్ అయ్యాయి. నాలుగు రోజుల్లో ఇండియాలో భారతీయుడు 2 సినిమాకు రూ. 62.17 కోట్లు వచ్చాయి. వాటిలో తమిళం నుంచి రూ. 43.55 కోట్లు, హిందీ నుంచి రూ. 4.35 కోట్లు, తెలుగు నుంచి 14.37 కోట్లుగా ఉన్నాయి.
అత్యధిక గ్రాసర్‌గా
అయితే, ఇండియన్ 2 సినిమా వరల్డ్ వైడ్‌గా నాలుగు రోజుల్లో రూ. 120 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. దీంతో 2024లోనే అత్యధిక గ్రాస్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా రికార్డ్ తెచ్చుకోవడంలో లీడింగ్‌లో ఉంది. ఇక ఈ సినిమాకు ఐదో రోజున ఇండియాలో రూ. 25 లక్షల వరకు కలెక్షన్స్ వస్తాయని సాక్నిక్ సంస్థ అంచనా వేసింది. ఇప్పటివరకు అయిన బుకింగ్స్ పరంగా ఈ అంచనా వేసింది. మధ్యాహ్నాం, ఈవెనింగ్, నైట్ షోలతో మరింత పెరిగే అవకాశం ఉంది.
అతి తక్కువగా హిందీ వాటా
ఇండియన్ 2 చిత్రానికి మూడవ రోజు రూ .15.35 కోట్ల వసూళ్లు రాగా.. రెండో రోజు అయిన శనివారం రూ .18.2 కోట్లు వచ్చాయి. ఇక మొదటి రోజు ఇండియాలో రూ. 25.6 కోట్లు కలెక్షన్స్‌తో ప్రారంభించింది భారతీయుడు 2 సినిమా. కలెక్షన్లలో ఎక్కువ భాగం తమిళ మార్కెట్ నుంచి రాగా తర్వాత తెలుగులో ఎక్కువగా వస్తున్నాయి. ఇక అతి తక్కువగా హిందీ వెర్షన్ (హిందుస్తానీ 2) నుంచి వాటా వస్తోంది.