Asur OTT: ఓటీటీలో కల్కి స్టోరీతో మైథలాజికల్ క్రైమ్ థ్రిల్లర్.. సబ్‌స్క్రిప్షన్ లేకుండా ఫ్రీగా స్ట్రీమింగ్-kalki and kali story based crime thriller asur series ott streaming on jio cinema asur 1 review asur 2 review telugu ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Asur Ott: ఓటీటీలో కల్కి స్టోరీతో మైథలాజికల్ క్రైమ్ థ్రిల్లర్.. సబ్‌స్క్రిప్షన్ లేకుండా ఫ్రీగా స్ట్రీమింగ్

Asur OTT: ఓటీటీలో కల్కి స్టోరీతో మైథలాజికల్ క్రైమ్ థ్రిల్లర్.. సబ్‌స్క్రిప్షన్ లేకుండా ఫ్రీగా స్ట్రీమింగ్

Sanjiv Kumar HT Telugu
Mar 04, 2024 11:07 AM IST

Asur Web Series OTT Streaming: ఓటీటీలో అన్నిటికంటే అతి స్పెషల్ క్రైమ్ థ్రిల్లర్ అసుర్ వెబ్ సిరీస్. రెండు సీజన్లుగా స్ట్రీమింగ్ అవుతోన్న అసుర్ కచ్చితంగా చూడాల్సిన సిరీస్. మరి దీన్ని ఎలాంటి సబ్‌స్క్రిప్షన్ లేకుండా ఫ్రీగా ఏ ఓటీటీలో చూస్తారంటే..

ఓటీటీలో కల్కి స్టోరీతో మైథలాజికల్ క్రైమ్ థ్రిల్లర్.. సబ్‌స్క్రిప్షన్ లేకుండా ఫ్రీగా స్ట్రీమింగ్
ఓటీటీలో కల్కి స్టోరీతో మైథలాజికల్ క్రైమ్ థ్రిల్లర్.. సబ్‌స్క్రిప్షన్ లేకుండా ఫ్రీగా స్ట్రీమింగ్

Asur Series Franchise OTT: ఓటీటీల హవా పెరిగేసరికి డిఫరెంట్ కంటెంట్ మూవీస్, వెబ్ సిరీస్‌లకు ఎక్కడా లేని క్రేజ్ ఏర్పడింది. ఇక క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్‌లో వచ్చే కంటెంట్‌కు అనేక మంది ప్రేక్షకులు అభిమానులే. అయితే, ఓటీటీల ఎక్కువ కావడం, వాటి వాడకం పెరిగే సరికి ఇప్పటివరకు ఎన్నో రకాల, విభిన్నమైన క్రైమ్ థ్రిల్లర్ సిరీసులు, సినిమాలు వచ్చేశాయి. కానీ వాటన్నింటిలో అన్నికంటే స్పెషల్‌గా చెప్పుకోవాల్సిన సిరీస్ ఒకటి ఉంది.

రెండు సీజన్లతో

అదే అసుర్. ఈ అసుర్ సిరీస్ మొత్తం రెండు సీజన్లతో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. సాధారణంగా క్రైమ్ థ్రిల్లర్స్ అన్ని హత్యలు, నేరాలు, ఇన్వెస్టిగేషన్, సస్పెన్స్ ఇలా ఈ అంశాల చుట్టే తిరిగుతుంటాయి. కానీ, ఈ క్రైమ్స్‌కు మైథాలజీ టాపిక్ జోడిస్తే. అంటే పురాణాల్లోని పాత్రలను కలికాలంలో చూపిస్తూ క్రైమ్ థ్రిల్లర్ తెరకెక్కిస్తే.. వేరే లెవెల్‌లో ఉంటుంది. దానికి తగినట్లుగా స్క్రీన్ ప్లే, ఎంగేజ్ చేసే సీన్స్, ఊహించని ట్విస్టులు, నటీనటులు పర్ఫామెన్స్ ఇలా అన్ని ఫర్ఫెక్ట్‌గా మ్యాచ్ అయిన సిరీసే అసుర్.

మూడేళ్లకు సీక్వెల్

అసుర్ మొదటి సీజన్ (Asur: Welcome To Your Dark Side) 2020 సంవత్సరంలో వూట్ అనే ఓటీటీలో విడుదలై సంచనలం సృష్టించింది. మైథలాజికల్ సైకో క్రైమ్ థ్రిల్లర్‌గా వచ్చిన అసుర్ మొదటి సీజన్ అప్పట్లో భారీ విజయం అందుకుంది. దాంతో తర్వాత వచ్చే సీజన్‌పై అంతకుమించి అంచనాలు పెరిగిపోయాయి. దానికి తగినట్లే ఆ అంచనాలకు మించి మూడేళ్లకు అసుర్‌కు సీక్వెల్ అసుర్ 2 వచ్చింది.

అసుర్ నటీనటులు

"అసుర్ 2: రైజ్ ఆఫ్ ది డార్క్ సైడ్" (Asur 2: Rise Of The Dark Side) టైటిల్‌తో గతేడాది జూన్ 1న ఓటీటీలో విడుదలైన ఈ రెండో సీజన్ కూడా మంచి సక్సెస్ అందుకుంది. అసుర్ రెండు సీజన్స్‌కి డైరెక్టర్ ఓని సేన్ దర్శకత్వం వహించాడు. ఇందులో అర్షద్ వార్సి, బరున్ సోబ్టీ, అనుప్రియ గోయెంకా (పోటుగాడు సినిమా హీరోయిన్), విశేష్ బన్సాల్, ఆమీ వాఘ్, అభిషేక్ చౌహాన్, రిధి డోగ్రా (జవాన్, టైగర్ 3 ఫేమ్), మెయాంగ్ చాంగ్, అథర్వ విశ్వకర్మ తదితరులు నటించి అలరించారు.

అసుర్ స్టోరీ

అసుర్ కథలోకి వెళితే.. తాను కలి అని చెప్పుకునే శుభ్ జోషి ప్రస్తుతం లోకంలోని మంచి వాళ్లను, సామాజిక వేత్తలను టార్గెట్ చేస్తూ చంపేస్తుంటాడు. అతను కలి అని, లోకంలో మంచిపై చెడు రాజ్యం ఏలుతుంటే దాన్ని అడ్డుకోడానికి కల్కి వస్తాడని, అప్పుడు అతన్ని చంపి దేవతలపై పగ తీర్చుకోవాలని అనుకుంటాడు శుభ్ జోషి. ఈ క్రమంలో పలువురిని చంపుతూ ఫోరెన్సిక్ ఎక్స్‌పర్ట్ నిఖిల్ నాయర్‌కు డెడ్ బాడీల లొకేషన్స్ షేర్ చేస్తూ సవాల్ చేస్తాడు.

అసుర్ హైలెట్స్-ఓటీటీ

మరి ఆ డెడ్ బాడీలు ఎవరివి, వాళ్లను అతను ఎందుకు చంపుతున్నాడు, అతని మోటీవ్ ఏంటీ ఈ క్రమంలో సీబీఐ ఆఫీసర్ రాజ్ పుత్ ధనుంజయ్ అకా డీజే, నిఖిల్ నాయర్ ఏం కోల్పోయారు, ఈ ఇద్దరికి శుభ్ జోషికి ఉన్న గతం ఏంటీ అనే తదితర థ్రిల్లింగ్ సీన్స్, ఏమాత్రం ఊహించని ట్విస్టులతో ఆద్యంతం ఎంగేజ్ చేస్తుంది అసుర్ సిరీస్ ఫ్రాంఛైజీ. ధర్మరాజ్ భట్ అదిరిపోయే బీజీఎమ్‌తో ఉత్కంఠ కలిగించే అసుర్ సిరీస్ రెండు సీజన్స్ జియో సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. అందులో ఎలాంటి సబ్‌స్క్రిప్షన్ లేకుండా ఫ్రీగా చూసేయొచ్చు.

Whats_app_banner