OTT Telugu Web Series: ఓటీటీలోకి వస్తున్న మరో ఫన్నీ తెలుగు వెబ్ సిరీస్.. ఆఫీస్ సిట్‌కామ్.. వర్త్ వెయిటింగ్ అంటూ..
OTT Telugu Web Series: ఓటీటీలోకి మరో తెలుగు ఫన్నీ వెబ్ సిరీస్ రాబోతోంది. కార్పొరేట్ ఆఫీస్ నేపథ్యంలో సాగే ఈ సిట్‌కామ్ రిలీజ్ డేట్ వాయిదా పడిందంటూ ఓ ఫన్నీ వీడియో రిలీజ్ చేసిన ఆహా వీడియో.. కొత్త స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ చేసింది.
OTT Telugu Web Series: ఆఫీస్ సిట్‌కామ్ వెబ్ సిరీస్ లకు ఈ మధ్యకాలంలో మంచి డిమాండ్ ఉంటోంది. అలా తెలుగులోనూ గతంలో అర్థమయ్యిందా అరుణ్‌కుమార్, బెంచ్ లైఫ్ లాంటి వెబ్ సిరీస్ వచ్చాయి. తాజాగా వేరే లెవెల్ ఆఫీస్ అంటూ మరో ఆఫీస్ సిట్‌కామ్ వెబ్ సిరీస్ రాబోతోంది. అయితే ఈ సిరీస్ రిలీజ్ వాయిదా పడిందంటూ ఆహా వీడియో గురువారం (నవంబర్ 21) ఓ ఫన్నీ వీడియో రిలీజ్ చేసింది.
వేరే లెవెల్ ఆఫీస్ ఓటీటీ రిలీజ్ డేట్
వేరే లెవెల్ ఆఫీస్.. ఆహా వీడియోలో రాబోతున్న ఆఫీస్ సిట్‌కామ్ వెబ్ సిరీస్. త్వరలోనే ఈ సిరీస్ రావాల్సి ఉన్నా.. తాజాగా డిసెంబర్ 12కు వాయిదా వేస్తున్నట్లు ఆహా వీడియో అనౌన్స్ చేసింది. "ఆఫీస్ లో ప్రాజెక్ట్ కి డెడ్ లైన్ ఎక్స్‌టెండ్ చేశారు.. అందుకే మా ఎపిసోడ్స్ ని కూడా.. వర్త్ వెయిటింగ్ ఆఫీస్ సిట్-కామ్ అమ్మా.. వేరే లెవెల్ ఆఫీస్ డిసెంబర్ 12 నుంచి కేవలం ఆహాలో.." అనే క్యాప్షన్ తో ఆహా ఓటీటీ ఓ వీడియో రిలీజ్ చేసింది.
అందులో ఈ వేరే లెవెల్ ఆఫీస్ సిరీస్ లోని నటీనటులు సిరీస్ రిలీజ్ డేట్ వాయిదా గురించి ఫన్నీగా రియాక్టవడం చూడొచ్చు. వేరే లెవెల్ ఆఫీస్ డేట్ పోస్ట్‌పోన్ అయిందన్నారు.. వీళ్లను అడిగి తెలుసుకుందాం అంటూ ఓ వాయిస్ మెల్లగా కెమెరా వెనుక నుంచి వస్తుంది. ఆ తర్వాత ఆ ఆఫీస్ లో పని చేసే వాళ్లు ఒక్కొక్కరినీ అడుగుతూ వెళ్తుంది.
అయితే వాళ్లు తమదైన స్టైల్లో ఒక్కొక్కరు ఒక్కో సమాధానం ఇవ్వడం నవ్వు తెప్పిస్తుంది. చివరికి వేరే లెవెల్ ఆఫీస్ రిలీజ్ వాయిదా పడిందని, కొన్నిసార్లు రావడం ఆలస్యమవుతుందేమోగానీ రావడం పక్కా అంటూ డిసెంబర్ 12 నుంచి స్ట్రీమింగ్ అవుతుందని వెల్లడించారు.
ఏంటీ వేరే లెవెల్ ఆఫీస్?
వేరే లెవెల్ ఆఫీస్ వెబ్ సిరీస్ తమిళంలో వచ్చిన వెరా మారి ఆఫీస్ సిరీస్ కు రీమేక్. గతేడాది ఆహా తమిళం ఓటీటీలోనే ఈ సిరీస్ స్ట్రీమింగ్ అయింది. ఇప్పటి వరకూ తెలుగులో వచ్చిన ఆఫీస్ సిట్‌కామ్ లలాగే ఈ వేరే లెవెల్ ఆఫీస్ కూడా ఫన్నీగా సాగిపోనున్నట్లు తెలుస్తోంది.
ఓ ఐటీ కంపెనీలో పని చేసే కొందరు ఉద్యోగుల చుట్టూ తిరిగే సరదా స్టోరీ ఇది. ఈ వేరే లెవెల్ ఆఫీస్ కు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ త్వరలోనే రాబోతున్నాయి. ఈ వెబ్ సిరీస్ డిసెంబర్ 12 నుంచి ఆహా వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.