నవంబర్ 22, నేటి రాశి ఫలాలు- ఈ రాశుల వారికి కొత్త పరిచయాలు మేలు చేస్తాయి
Today rasi phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ 22.11.2024 శుక్రవారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.
రాశిఫలాలు (నేటి రాశిఫలాలు) 22-11-2024
వారం : శుక్రవారం,తిథి: బ.సప్తమి, నక్షత్రం: ఆశ్లేష,
మాసం:కార్తీకము, ఆయనము:దక్షిణాయనం, సంవత్సరం: శ్రీ క్రోధినామ సంవత్సరం
మేషం:
ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. పనులు విజయవంతమవుతాయి. అందాల్సిన సొమ్ము అందుతుంది. ఉద్యోగులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వ్యాపారులకు కలసివస్తుంది. ఒత్తిడులు పెరుగుతాయి. పొదుపును పాటించండి. రాజకీయనాయకులకు అనుకూలం. కళాకారులకు గుర్తింపు లభిస్తుంది.
వృషభం:
పనుల్లో పురోగతి కనిపిస్తుంది. వ్యయ సూచన. మాటలపై అదుపు అవసరం. యుక్తితో అనుకున్నది సాధించగలరు. వాహన యోగం ఉంది. శుభకార్య యత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగులకు పై అధికారుల ప్రోత్సాహం లభిస్తుంది. నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది. చేసిన పనికి గుర్తింపు లభిస్తుంది.
మిథునం:
సంఘంలో గుర్తింపు లభిస్తుంది. సమయానికి సొమ్ము చేతికి అందుతుంది. అవసరాలు గట్టెక్కుతాయి. ఖర్చును అదుపు చేసుకోవాలి. వ్యాపారులకు లాభసూచన. వ్యయప్రయాసలు అధికం. కుటుంబసభ్యుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. ఉద్యోగులు ప్రశంసలు అందుకుంటారు.
కర్కాటకం:
ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. ఆహారవిహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. మాట తూలవద్దు. ఓర్పుతో సమస్యలను పరిష్కరించుకోవచ్చు. ఆర్థిక సమస్యల పరిష్కారానికి మీరు చేపట్టిన చర్యలు ఫలితాన్ని ఇస్తాయి. స్థిరాస్తి కొనుగోలు యత్నాలు చేస్తారు. అప్రమత్తంగా ఉండాలి.
సింహం:
శుభసమాచారం అందుకుంటారు. అనుకోని విధంగా డబ్బు చేతికి అందుతుంది. భూములు కొనుగోలు యత్నం చేస్తారు. వివాదాలు పరిష్కారమవుతాయి. ఉద్యోగులకు అనుకూలమైన రోజు. కొత్తవారితో పరిచయాలు కలుగుతాయి. రాజకీయ వేత్తలకు కలసివస్తుంది. కళాకారులు, క్రీడాకారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది.
కన్య:
బంధుమిత్రులతో వివాదాలు తలెత్తవచ్చు. ఓర్పుగా ఉండండి. మాట అదుపులో ఉంచుకోండి. శుభకార్య యత్నాలు చేస్తారు. విద్యార్థులకు, నిరుద్యోగులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. సమస్యలు తీరతాయి. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం లభిస్తుంది.
తుల:
అనుకూలమైన రోజు. సమస్యలు తీరతాయి. సొమ్ము చేతికి అందుతుంది. వ్యాపారులకు లాభ సూచన. ఉద్యోగులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. నిరుద్యోగులకు అనుకూలమైన సమాచారం అందుతుంది. రాజకీయనాయకులకు గుర్తింపు లభిస్తుంది.
వృశ్చికం:
ధనవ్యయం ఎక్కువవుతుంది. ఖర్చు చేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. సమయానికి సొమ్ము అందకపోవచ్చు. పదోన్నతులు లభించవచ్చు. కొత్త వారితో పరిచయం మేలు కలిగిస్తుంది. వ్యాపారులకు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలి.
ధనుస్సు:
ప్రోత్సాహకరంగా ఉంటుంది. పనులు చకచకా పూర్తవుతాయి. రావలసిన సొమ్ము అందుతుంది. నలుగురిలో గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగులు కొత్తబాధ్యతలు స్వీకరిస్తారు. కొత్త పెట్టుబడులు పెడతారు. ఆచితూచి అడుగు వేయండి. మాట అదుపు అవసరం.
మకరం:
ఆటంకాలు ఎదురవుతాయి. ఓర్మితో పనులు పూర్తి చేసుకోవాలి. ఆత్మవిశ్వాసం వదులుకోవద్దు. ఉద్యోగులపై ఒత్తిడులు పెరుగుతాయి. వ్యాపారుల లాభాలు తగ్గే సూచన. రాజకీయనాయకులు, కళాకారులు ఊహించనివి చోటు చేసుకుంటాయి. విద్యార్థులకు ఇబ్బందులు ఎదుర్కొంటారు.
కుంభం:
వివాదాలు తలెత్తవచ్చు. ఓర్పుతో వ్యవహరించాలి. మాట అదుపులో ఉంచుకోవాలి. ఉద్యోగులకు మార్పులు జరుగుతాయి. అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు. జాగ్రత్తలు పాటించాలి. కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. వాహన కొనుగోలు యత్నం చేస్తారు.
మీనం:
కొత్తవారితో పరిచయాలు కలుగుతాయి. అనుకున్నట్టుగా ధనం చేతికందుతుంది. అనారోగ్య సూచన. బాల్యమిత్రులను కలుస్తారు. వ్యాపారులకు లాభసాటిగా ఉంటుంది. ఉద్యోగులకు ప్రోత్సాహం లభిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగావకాశం. బాధ్యతలు సక్రమంగా నిర్వహించి ప్రశంసలు అందుకుంటారు.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.