TGPSC Group 2 Exams : తెలంగాణ గ్రూప్-2 అభ్యర్థులకు అలర్ట్.. పరీక్షల షెడ్యూల్‎ విడుదల.. ముఖ్య తేదీలు ఇవే-tgpsc released 2024 group 2 exam schedule ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tgpsc Group 2 Exams : తెలంగాణ గ్రూప్-2 అభ్యర్థులకు అలర్ట్.. పరీక్షల షెడ్యూల్‎ విడుదల.. ముఖ్య తేదీలు ఇవే

TGPSC Group 2 Exams : తెలంగాణ గ్రూప్-2 అభ్యర్థులకు అలర్ట్.. పరీక్షల షెడ్యూల్‎ విడుదల.. ముఖ్య తేదీలు ఇవే

Basani Shiva Kumar HT Telugu
Nov 21, 2024 09:08 PM IST

TGPSC Group 2 Exams : గ్రూప్-2 అభ్యర్థులకు టీజీపీఎస్సీ నుంచి బిగ్ అప్డేట్ వచ్చింది. గ్రూప్-2 పరీక్షల షెడ్యూల్‎ విడుదలైంది. పరీక్షల తేదీలు, హాల్ టికెట్ల గురించి టీజీపీఎస్సీ వివరాలు వెల్లడించింది. వచ్చేనెలలో పరీక్షలు ఉంటాయని కమిషన్ స్పష్టం చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్

గ్రూప్-2 పరీక్షల షెడ్యూల్‎ను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది. 2024, డిసెంబర్ 15, 16 తేదీల్లో గ్రూప్-2 పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించింది. హాల్ టికెట్లను డిసెంబర్ 9వ తేదీ నుంచి అందుబాటులో ఉంచుతామని.. టీజీపీఎస్సీ అధికారిక వెబ్ సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవాలని అభ్యర్థులకు సూచించింది.

డిసెంబర్ 15, 16వ తేదీల్లో రోజు రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహిస్తామని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్పష్టం చేసింది. దీనికి సంబంధించిన హాల్ టికెట్ డౌన్ లోడ్ సమయంలో సమస్యలు తలెత్తితే సంబంధింత అధికారులను సంప్రదించాలని సూచించింది. ఆగస్ట్ నెలలోనే గ్రూప్-2 పరీక్షలు జరగాల్సి ఉంది.

అయితే.. అదే సమయంలో డీఎస్సీ ఎగ్జామ్స్ ఉండటంతో.. గ్రూప్-2 పరీక్షను వాయిదా వేయాలని అభ్యర్థులు విజ్ఞప్తి చేశారు. సానూకూలంగా స్పందించిన ప్రభుత్వం.. పరీక్షలను పోస్ట్‎పోన్ చేసింది. మొత్తం 783 గ్రూప్-2 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ నోటీఫికేషన్ విడుదల చేసింది. గ్రూప్-2 పరీక్షకు మొత్తం 5.57 లక్షల మంది అభ్యర్థులు అప్లై చేసుకున్నారు.

పరీక్షలు ఇలా..

డిసెంబర్‌ 15న ఉదయం 10 నుంచి 12:30 వరకు పేపర్-1

డిసెంబర్‌ 15న మధ్యాహ్నం 3 నుంచి 5:30 వరకు పేపర్‌-2

డిసెంబర్‌ 16న ఉదయం 10 నుంచి 12:30 వరకు పేపర్-3

డిసెంబర్‌ 16న మధ్యాహ్నం 3 నుంచి 5:30 వరకు పేపర్‌-4

మొత్తం 783 పోస్టులతో టీఎస్‌పీఎస్సీ గతేడాది గ్రూప్ 2 ఉద్యోగ ప్రకటన జారీ చేసింది. 2023 జనవరి 18 నుంచి ఫిబ్రవరి 16వరకు దరఖాస్తులు స్వీకరించింది. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 5.51 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. తొలుత గతేడాది ఆగస్టు 29, 30న గ్రూప్‌-2 పరీక్ష నిర్వహిస్తామని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. వరుసగా గ్రూప్‌-1, 4 పరీక్షలు, గురుకుల నియామక పరీక్షలతో పూర్తిస్థాయిలో సన్నద్ధమయ్యేందుకు సమయం లేనందున గ్రూప్‌-2 పరీక్షలు వాయిదా వేయాలని అభ్యర్థులు పెద్ద ఎత్తున డిమాండ్‌ చేశారు. ఈ మేరకు పరీక్షలను నవంబరు 2, 3 తేదీలకు రీషెడ్యూలు చేసింది కమిషన్.

Whats_app_banner