NTPC Green Energy IPO: రెండో రోజు ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ఐపీఓ సబ్ స్క్రిప్షన్ స్టేటస్ 93% మాత్రమే..
NTPC Green Energy IPO: ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ఐపీఓ కు ఇన్వెస్టర్ల నుంచి ఆశించినంత స్పందన లభించడం లేదు. ఐపీఓ ప్రారంభమైన రెండో రోజు 93 శాతం సబ్ స్క్రైబ్ అయింది. రిటైల్ ఇన్వెస్టర్లు అత్యధికంగా బిడ్ వేశారు.
NTPC Green Energy IPO: ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ఐపీఓ రెండో రోజు 93 శాతం సబ్ స్క్రైబ్ కాగా, రిటైల్ ఇన్వెస్టర్లు అత్యధికంగా బిడ్ వేశారు. రెండో రోజు రిటైల్ ఇన్వెస్టర్ల వాటా 2.38 రెట్లు సబ్ స్క్రైబ్ అయింది. క్యూఐబిల వాటాలో 75%, ఎన్ఐఐ వాటాలో 34 శాతం సబ్ స్క్రైబ్ అయింది.
రూ.10,000 కోట్ల విలువైన ఐపీఓ
రూ.10,000 కోట్ల విలువైన ఈ ఐపీఓ లో పూర్తిగా కొత్త ఈక్విటీ షేర్లు ఉంటాయి. ఆఫర్ ఫర్ సేల్ (OFS) కోసం ఏ విభాగాన్ని కేటాయించలేదు. ఈ ఐపీఓ నవంబర్ 19న ఓపెన్ అయింది. నవంబర్ 22 వరకు అప్లై చేసుకోవచ్చు. ఈ ఐపీఓ ప్రైస్ బ్యాండ్ ను రూ.102 నుంచి రూ.108 వరకు నిర్ణయించారు. ఐపీఓ ద్వారా వచ్చే మొత్తం ఆదాయంలో రూ.7,500 కోట్లను దాని అనుబంధ సంస్థ ఎన్టీపీసీ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ (NREL) కొన్ని లేదా అన్ని బకాయిలను తిరిగి చెల్లించడానికి లేదా ముందస్తుగా చెల్లించడానికి గణనీయమైన భాగాన్ని కేటాయిస్తారు. కొంత భాగాన్ని సాధారణ కార్పొరేట్ ప్రయోజనాల కోసం కూడా కేటాయించనున్నారు.
ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ఐపీఓ: అప్లై చేయాలా వద్దా?
ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ఐపీఓకు పలు బ్రోకరేజ్ సంస్థలు ‘బై’ ట్యాగ్ ను ఇచ్చాయి. వాటిలో స్టోక్స్ బాక్స్ రీసెర్చ్, ఆనంద్ రాఠీ ఫైనాన్షియల్ సర్వీసెస్, అడ్రోయిట్ ఫైనాన్షియల్ సర్వీసెస్, అరెట్ సెక్యూరిటీస్, అరిహంత్ క్యాపిటల్ మార్కెట్స్, బీపీ ఈక్విటీస్, కెనరా బ్యాంక్ సెక్యూరిటీస్, చోళమండలం సెక్యూరిటీస్, మార్వాడీ షేర్స్ అండ్ ఫైనాన్స్, మెహతా ఈక్విటీస్, రిలయన్స్ సెక్యూరిటీస్, ఎస్బీఐసీఏపీ సెక్యూరిటీస్, వెంచురా సెక్యూరిటీస్ మొదలైన బ్రోకరేజ్ సంస్థలు ఈ ఐపీఓకు సబ్ స్క్రైబ్ చేయాలని సూచించాయి.
సూచన: ఈ వ్యాసంలోని అభిప్రాయాలు, సిఫార్సులు వ్యక్తిగత విశ్లేషకులవి. ఇవి హిందుస్తాన్ టైమ్స్ తెలుగు అభిప్రాయాలకు ప్రాతినిధ్యం వహించవు. ఏదైనా పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు సర్టిఫైడ్ నిపుణులను సంప్రదించాలని మేము పెట్టుబడిదారులకు సలహా ఇస్తున్నాము.
టాపిక్