తెలుగు న్యూస్ / ఫోటో /
Hyderabad ORR : వాహనదారులకు అలర్ట్.. ఇకనుంచి ఓఆర్ఆర్‌పై డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు.. దొరికితే అంతే సంగతులు!
- Hyderabad ORR : హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు.. నిత్యం వేలాది వాహనాలతో రద్దీగా ఉంటుంది. అలాంటి రద్దీ రోడ్లపైకి కొందరు ఫుల్లుగా తాగి ఎక్కుతున్నారు. దీంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో ప్రమాదాల నివారణకు పోలీసులు చర్యలు చేపట్టారు. త్వరలో ఓఆర్ఆర్‌పై డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించనున్నారు.

(1 / 5)
ఇకపై హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించనున్నారు. ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదాల నివారణకు పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు.(@sridhar_gundu)
(2 / 5)
ఔటర్ రింగ్ రోడ్డు ఎంట్రీ, ఎగ్జిట్‌ల దగ్గర డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేయనున్నారు. ఇప్పటికే యాక్సిడెంట్ అనాలసిస్ ప్రివెన్షన్ టీమ్‌లను ఏర్పాటు చేశారు.
(3 / 5)
పోలీసులు, అధికారులు రోడ్ల మీద ఉంటేనే ట్రాఫిక్ నియంత్రణలో ఉంటుందని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ప్రమాదాల విశ్లేషణ, నివారణ చర్యల కోసం యాక్సిడెంట్ అనాలసిస్ ప్రివెన్షన్ టీం ఏర్పాటు చేశామని చెబుతున్నారు. (@sridhar_gundu)
(4 / 5)
ఓఆర్‌ఆర్‌పై ప్రమాదాలను, వాహనాల వేగాన్ని తగ్గించేందుకు డ్రంకెన్ డ్రైవ్ (డీడీ) నిర్వహిస్తున్నామని.. రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు వెల్లడించారు. దేశంలోనే విస్తీర్ణంలో అతిపెద్ద పోలీసు కమిషనరేట్ రాచకొండ.
ఇతర గ్యాలరీలు