Palmistry for Marriage: లవ్ మ్యారేజ్ చేసుకుంటారా లేక అరేంజ్డ్ ఆ - మీ చేతి మీదున్న ఈ రేఖ చెబుతోంది
Palmistry for Marriage: అరచేతి రేఖలు, దానిపై ఉండే గుర్తులు వ్యక్తి భవిష్యత్తు గురించి సమాచారం ఇస్తాయని హస్త సాముద్రిక శాస్త్రం చెబుతోంది. వాటి ద్వారా, మీరు ప్రేమ వివాహం చేసుకుంటారా లేక పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకుంటారా అనే విషయాన్ని కూడా తెలుసుకోవచ్చు.
వివాహం అనేది జీవితంలో ప్రతి ఒక్కరికీ ఒక కీలక దశ. లవ్ మ్యారేజ్ లేదా అరేంజ్డ్ మ్యారేజ్ ఒకొక్కటి ఒక్కో రకమైన సంతృప్తిని మిగులుస్తుంది. కొన్ని సార్లు డబ్బు, హోదా పెరిగితే ఇంకొన్ని సార్లు నచ్చిన పని చేయగలిగామనే సంతృప్తి మిగులుతుంది. అలా వివాహం వల్ల జరిగే మార్పులు జీవితంపై ప్రభావాన్ని చూపిస్తుంటాయి. మరి మీరు భవిష్యత్తులో చేసుకోబోయే వివాహం పెద్దలు కుదిర్చిన వివాహమా లేదా ప్రేమ వివాహమా తెలుసుకోవాలని ఉందా.. రండి హస్త సాముద్రికా శాస్త్రం దీని గురించి ఏం చెప్తుందో తెలుసుకుందాం.
హస్తసాముద్రికంలో వృత్తి, ఆర్థిక జీవితం, ప్రేమ జీవితం మొదలైనవి అరచేతి రేఖల ద్వారా వెల్లడి అవుతాయి. ప్రేమ వివాహం జరుగుతుందా లేక పెద్దలు కుదిర్చిన పెళ్లి అవుతుందా అనే విషయాలు కూడా తెలుసుకోవచ్చు. మీ వివాహం గురించి ఏ చేతి రేఖ చెబుతుందంటే,
హస్తసాముద్రికం ప్రకారం, వివాహ రేఖలు చేతిలోని చిన్న వేలి క్రింద ఉన్న బుధుడి పర్వతంతో అనుసంధానించబడి ఉంటాయి. బుధ పర్వతంపై బయటి నుంచి లోపలకు వచ్చే రేఖను వివాహ రేఖ అంటారు. ఈ లైన్ ద్వారానే ఏ వ్యక్తి దాంపత్య జీవితమైనా తెలుస్తుంది. ఈ రేఖపై ఏర్పడే గుర్తు ఆ వ్యక్తికి సంబంధించిన ప్రేమ వివాహం లేదా పెద్దలు కుదిర్చిన వివాహాన్ని సూచిస్తుంది.
ప్రేమ వివాహమా.. పెద్దలు కుదిర్చిన వివాహమా?
హస్తసాముద్రికం ప్రకారం ఒక వ్యక్తి అరచేతిలో పెళ్లి రేఖపై చతురస్రాకార గుర్తు ఉంటే అతని అదృష్టంలో ప్రేమ వివాహం రాసి ఉన్నట్లే. ఈ గుర్తు స్పష్టంగా ఉంటే ఆ వ్యక్తికి లవ్ మ్యారేజ్ చేసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయని హస్త సాముద్రిక నిపుణులు అంటున్నారు. ఈ రేఖ విషయంలో క్రాస్ మార్క్ ఉంటే ఆ వ్యక్తి వైవాహిక బంధంలో ఇబ్బందులు ఎదురవుతాయి. వైవాహిక జీవితం సజావుగా సాగకుండా తరచూ చిక్కులు ఏర్పడుతుంటాయి. అలా కాకుండా ఒక వ్యక్తి చిటికెన వేలి కింద సరళమైన, స్పష్టమైన రేఖను కలిగి ఉంటే ప్రేమ వివాహం జరగదు. అరేంజ్డ్ మ్యారేజ్ జరిగే అవకాశాలు పెరుగుతాయి. అంతేకాకుండా వారి వైవాహిక జీవితం ఇతరుల కంటే మెరుగ్గా ఉంటుందని నమ్ముతారు.
ప్రేమ వివాహానికి సంబంధించిన రేఖలు మీ చేతిలో గుర్తించండిలా:
పెద్దలు కుదిర్చిన వివాహాన్ని చేతిలోని చిటికెన వేలు కింది భాగం సూచిస్తుంటే, బొటనవేలు కింద పెరిగిన భాగం ప్రేమ వివాహపు రేఖలు సూచిస్తుంది. చిటికెన వేలి కింద భాగాన్ని బుధ పర్వతం అని చెబుతుంటే, బొటన వేలి కింది భాగాన్ని శుక్ర పర్వతం అని పిలుస్తారని నమ్ముతారు. బొటనవేలి కింది భాగం చేతిలో స్పష్టంగానూ, మరింత ప్రముఖంగానూ కనిపిస్తే, ప్రేమ వివాహం చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతుంటారు.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
టాపిక్